MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu875625fb-c280-405d-9864-a079d8fb48c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu875625fb-c280-405d-9864-a079d8fb48c7-415x250-IndiaHerald.jpgసోలో, గీతగోవిందం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్. తొలి రెండు సినిమాలు ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాలు కావడంతో ఆయనకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోయింది. దాంతో ఈ సారి ఆయన చేయబోయే సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గరగా చేస్తుందని భావించాడు కానీ అనూహ్యంగా ఆయన మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు. మహేష్ బాబు కూడా పరశురామ్ చెప్పిన కథకు ఫిదా అయిపోయి ఈ సినిమాలో చేస్తున్నాడని తెలుస్తోంది.mahesh babu{#}parasuram;Fidaa;Suresh;Mass;Success;India;bollywood;mahesh babu;trivikram srinivas;Rajamouli;Darsakudu;Director;Cinemaపరశురామ్, త్రివిక్రమ్ లు తట్టుకోగలరా!!పరశురామ్, త్రివిక్రమ్ లు తట్టుకోగలరా!!mahesh babu{#}parasuram;Fidaa;Suresh;Mass;Success;India;bollywood;mahesh babu;trivikram srinivas;Rajamouli;Darsakudu;Director;CinemaMon, 16 Aug 2021 17:05:00 GMT
సోలో, గీతగోవిందం వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు పరశురామ్. తొలి రెండు సినిమాలు ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాలు కావడంతో ఆయనకు ఫ్యామిలీ ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోయింది. దాంతో ఈ సారి ఆయన చేయబోయే సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గరగా చేస్తుందని భావించాడు కానీ అనూహ్యంగా ఆయన మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే మాస్ మసాలా చిత్రాన్ని చేస్తున్నాడు.  మహేష్ బాబు కూడా పరశురామ్ చెప్పిన కథకు ఫిదా అయిపోయి ఈ సినిమాలో చేస్తున్నాడని తెలుస్తోంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఇప్పటికే వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడంలో సఫలం అయింది. దాంతో మహేష్ బాబు నుంచి మరొక సూపర్ హిట్ రావడం ఖాయం అంటున్నారు అభిమానులు.  ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. 

ఇకపోతే ఈ రెండు సినిమాల ద్వారా బాలీవుడ్ కూడా రిలీజ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుని రాజమౌళి సినిమా ను పాన్ ఇండియా సినిమా గా చేయాలని మహేష్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ ఆలోచనలకు తగ్గట్టుగా పరుశురాం మరియు త్రివిక్రమ్ లు మహేష్ సినిమా ను ఆ రేంజ్ లో చేస్తారా అనేది చూడాలి. త్రివిక్రమ్ అయితే పర్వాలేదు కానీ మహేష్ మీదనే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు. గతంలో పెద్ద హీరోలతో చేసిన అనుభవం పరశురామ్ కు లేకపోవడం, మొదటిసారిగా మహేష్ బాబు తో సినిమా చేయడం వంటివి ఆయనపై నమ్మకం లేక పోవడానికి కారణాలు. మరి సర్కారు వారి పాట తరువాత త్రివిక్రమ్ తో మహేష్ చేయబోయే సినిమా చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పవచ్చు. 



బాలయ్య తో ఆపని చేయిస్తున్న దర్శకుడు!!

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>