PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mamathab73b8eba-80a1-49fe-90da-5efe49b17ee7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mamathab73b8eba-80a1-49fe-90da-5efe49b17ee7-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోడీకి ఏ మాత్రం కూడా మింగుడు పడటం లేదు. రాజకీయంగా మోడీ ఎంత బలవంతుడు అయినా సరే మమత ముందు ఆయన ప్రభావం కనపడలేదు. గతంలో కంటే కూడా మమత ఈసారి బలంగా సిఎం అయ్యారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు... బెంగాలీలలో తనకు ఉన్న దీదీ ఇమేజ్ అన్నీ కూడా మమతకు బాగా కలిసి వచ్చాయి. రాజకీయంగా తనకు ఎదురు లేదని మమత ప్రూవ్ చేసుకున్నారు. అయితే నందిగ్రామ్ లో మాత్రం మమత త్రుటిలో ఓడిపోయారు. సువెందు అధికారి అనే అగ్ర నేత చేతిలో మమత ఓటమి తృణముల్ కాంగ్రెస్ కి మింగుడుmamatha{#}రాజీనామా;benarjee;West Bengal - Kolkata;Mamta Mohandas;Prime Minister;Mamata Benerjee;Prashant Kishor;Congress;November;Elections;Governor;central government;Coronavirus;MLA;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR;bhavanaమమతా బెనర్జీ మీదున్న పగ ఈటెలను బలి చేస్తుందా...?మమతా బెనర్జీ మీదున్న పగ ఈటెలను బలి చేస్తుందా...?mamatha{#}రాజీనామా;benarjee;West Bengal - Kolkata;Mamta Mohandas;Prime Minister;Mamata Benerjee;Prashant Kishor;Congress;November;Elections;Governor;central government;Coronavirus;MLA;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR;bhavanaMon, 16 Aug 2021 12:00:54 GMTపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోడీకి ఏ మాత్రం కూడా మింగుడు పడటం లేదు. రాజకీయంగా మోడీ ఎంత బలవంతుడు అయినా సరే మమత ముందు ఆయన ప్రభావం కనపడలేదు. గతంలో కంటే కూడా మమత ఈసారి బలంగా సిఎం అయ్యారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు... బెంగాలీలలో తనకు ఉన్న దీదీ ఇమేజ్ అన్నీ కూడా మమతకు బాగా కలిసి వచ్చాయి. రాజకీయంగా తనకు ఎదురు లేదని మమత ప్రూవ్ చేసుకున్నారు.

అయితే నందిగ్రామ్ లో మాత్రం మమత త్రుటిలో ఓడిపోయారు. సువెందు అధికారి అనే అగ్ర నేత చేతిలో మమత ఓటమి తృణముల్ కాంగ్రెస్ కి మింగుడు పడలేదు. అయితే మమత ఎమ్మెల్యే కాకుండానే అంటే చట్ట సభల్లోకి వెళ్ళకుండా సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. నవంబర్ 5 లోపు బెంగాల్ లో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. జరగలేదు అంటే మాత్రం కచ్చితంగా మమత రాజీనామా చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. దానికి అక్కడి గవర్నర్ దాదాపుగా అంగీకరించే పరిస్థితి లేదు.

అప్పుడు మమత కచ్చితంగా మరొకరిని శాశన సభా పక్ష నేతగా ఎంచుకోవాలి. అప్పుడు తృణమూల్ లో చీలిక వచ్చే అవకాశం ఉండొచ్చు... అది బిజెపికి కలిసి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఇప్పుడు దేశంలో ఖాళీలు ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో కేంద్రం లేదని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కరోనా పేరుతో అడ్డుకుంటుంది అని పరిశీలకులు అంటున్నారు. మరి బెంగాల్ కు తెలంగాణా ఈటెల రాజేంద్రకు లింక్ ఏంటీ అంటారా...? ఈటెల రాజేంద్ర ఇప్పుడు హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు.

తెరాస కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన బిజెపి తరుపున బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు ఉన్న అంచనాలు, బిజెపి, తెరాస ల అంతర్గత సర్వేల ప్రకారం ఈటెల కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కేసీఆర్ అన్యాయం చేసారు అనే భావన హుజూరాబాద్ ప్రజల్లో ఉంది. అందుకే సిఎం కేసీఆర్ ఈటెలను ఓడించేందుకు దళిత బంధు అనే రిస్కీ కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. అయితే ఇక్కడ ఎన్నిక మమత కారణంగా ఆలస్యం అయితే ఈటెల మీదున్న సానుభూతి కరిగి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లి ఈటెల ఓడిపోయే అవకాశం ఉండవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.



జగన్ బయటకు రావాల్సిందే...?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>