MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-bosse4b0b852-9009-4ea9-b0ed-84782daf9691-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-bosse4b0b852-9009-4ea9-b0ed-84782daf9691-415x250-IndiaHerald.jpgదేశంలోనే అతిపెద్ద రియాల్టీషో గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షో బిగ్ బాస్ రియాలిటీ షో. తెలుగులో నాలుగు సీజన్ లు కంప్లీట్ చేసుకుని ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కావడానికి ఉరకలు వేస్తుంది. తొలి మూడు సీజన్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుని మోస్ట్ వాంటెడ్ రియాల్టీ షో గా అవతరించిన బిగ్ బాస్ త్వరలోనే ఐదవ సీజన్ ప్రారంభం చేసుకోవడం విశేషం. బుల్లితెర ప్రేక్షకుల ఇష్టమైన షో గా బిగ్ బాస్ రికార్డులకెక్కింది. తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషలలో సైతం ఈ షోకి భారీ క్రేజ్ ఉంది.big boss{#}Nani;raghu;contract;Wanted;september;Akkineni Nagarjuna;Telugu;NTR;Bigbossఈ ముద్దుగుమ్మ లు బిగ్ బాస్ రిజెక్ట్ చేశారా!!ఈ ముద్దుగుమ్మ లు బిగ్ బాస్ రిజెక్ట్ చేశారా!!big boss{#}Nani;raghu;contract;Wanted;september;Akkineni Nagarjuna;Telugu;NTR;BigbossSun, 15 Aug 2021 20:05:00 GMTబిగ్ బాస్ రియాలిటీ షో. తెలుగులో నాలుగు సీజన్ లు కంప్లీట్ చేసుకుని ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కావడానికి ఉరకలు వేస్తుంది. తొలి మూడు సీజన్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుని మోస్ట్ వాంటెడ్ రియాల్టీ షో గా అవతరించిన బిగ్ బాస్ త్వరలోనే ఐదవ సీజన్ ప్రారంభం చేసుకోవడం విశేషం. బుల్లితెర ప్రేక్షకుల ఇష్టమైన షో గా బిగ్ బాస్ రికార్డులకెక్కింది. తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషలలో సైతం ఈ షోకి భారీ క్రేజ్ ఉంది.

 తెలుగులో మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఆ తరువాత నాని రెండో సీజన్ యాంకర్ గా చేశాడు. 3, 4 సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేసి బిగ్ బాస్ షో ను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లారు. ఇప్పుడు ఈ ఐదు సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా ఉంటారని తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈ సీజన్ టెలికాస్ట్ మొదలవుతుందని అంటున్నారు. అయితే గత కొద్దికాలంగా ఈ 5వ సీజన్ లో పాల్గొనబోయే పార్టిసిపేట్స్ వీరే అని ఒక లిస్టు తెగ ప్రచారం జరుగుతుంది.

అందులో యాంకర్ రవి, నటి ప్రియ, వర్షిని, రఘు మాస్టర్, సురేఖవాణి, నవ్య స్వామి, షణ్ముఖ్ జస్వంత్, ఇషా చావ్లా, లోబో, సింగర్ మంగ్లీ, దుర్గారావు, ప్రత్యూష తదితరుల పేర్లు ఉన్నాయి. దీంతో వీరి వీరి అభిమానులు తమ అభిమాన నటులను త్వరలో బిగ్ బాస్ షోలో చూడబోతున్నామని ఎగిరి గంతేశారు.  అయితే ఈ షో కి తాము వెళ్లడం లేదని ముగ్గురు ముద్దుగుమ్మలు చెబుతున్నారు. యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు వర్షిణి, తన పాటలతో అందరినీ మైమరిపింపంచేస్తున్న మాంగ్లీ, సీరియల్ నటి నవ్య స్వామి. వీరు బిగ్ బాస్ షో కి వెళ్లడానికి ఏ ఒప్పందం చేసుకోలేదని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 



కౌశిక్‌ ఎమ్మెల్సీ కథ మారేనా?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>