MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshc8c942f2-a6f4-4a6e-b532-56f6a8f365b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshc8c942f2-a6f4-4a6e-b532-56f6a8f365b5-415x250-IndiaHerald.jpgరాజకీయాలలో సినిమాలలో శాశ్విత మిత్రులు శతృవులు ఉండరు అన్న విషయం మరొకసారి లేటెస్ట్ గా రుజువైంది. ‘పుష్ప’ మూవీ పనులలో బిజీగా ఉన్న సుకుమార్ తన పనులను పక్కకు పెట్టి మహేష్ ఇంటికి వెళ్ళి అతడిని అభినందించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.‘రంగస్థలం’ మూవీ తరువాత సుకుమార్ మహేష్ తో మూవీ చేయడానికి ప్రయత్నించినప్పుడు సుకుమార్ కు ఒకే చెప్పి ఆతరువాత మనసు మార్చుకుని అనీల్ రావిపూడి వైపు వెళ్లిపోయి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ చేసినందుకు అప్పట్లో సుకుమార్ చాల బాధ పడ్డాడు అన్న గుసగుసలు వినిపించాయి. ఆ షాక్ నుండి తేరmahesh{#}anil ravipudi;ooha;vijay deverakonda;you tube;Rajani kanth;sukumar;Allu Arjun;Cinemaమహేష్ సుకుమార్ ల మధ్య మారుతున్న సమీకరణాలు !మహేష్ సుకుమార్ ల మధ్య మారుతున్న సమీకరణాలు !mahesh{#}anil ravipudi;ooha;vijay deverakonda;you tube;Rajani kanth;sukumar;Allu Arjun;CinemaSun, 15 Aug 2021 11:02:00 GMTరాజకీయాలలో సినిమాలలో శాశ్విత మిత్రులు శతృవులు ఉండరు అన్న విషయం మరొకసారి లేటెస్ట్ గా రుజువైంది. ‘పుష్ప’ మూవీ పనులలో బిజీగా ఉన్న సుకుమార్ తన పనులను పక్కకు పెట్టి మహేష్ ఇంటికి వెళ్ళి అతడిని అభినందించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


‘రంగస్థలం’ మూవీ తరువాత సుకుమార్ మహేష్ తో మూవీ చేయడానికి ప్రయత్నించినప్పుడు సుకుమార్ కు ఒకే చెప్పి ఆతరువాత మనసు మార్చుకుని అనీల్ రావిపూడి వైపు వెళ్లిపోయి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ చేసినందుకు అప్పట్లో సుకుమార్ చాల బాధ పడ్డాడు అన్న గుసగుసలు వినిపించాయి. ఆ షాక్ నుండి తేరుకుని సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ మూవీ చేస్తున్నాడు.


అయితే సుకుమార్ గత విషయాలను మర్చిపోయి మహేష్ పుట్టినరోజునాడు సూపర్ స్టార్ ఇంటికి వెళ్ళడమే కాకుండా అతడిని కలిసి అభినందించాడని తెలుస్తోంది. ‘సర్కారు వారి పాట’ టీజర్ కు వస్తున్న స్పందన పట్ల తన ఆనందాన్ని అభినందనలను సుకుమార్ మహేష్ కు తెలిపినట్లు టాక్. దీనితో రానున్న కాలంలో మళ్ళీ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో  మూవీ వచ్చే అవకాశం ఉందా అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారడమే కాకుండా ఈ టీజర్ కు 30 మిలియన్ వ్యూస్ రావడం సంచలనంగా మారింది. వాస్తవానికి సుకుమార్ ‘పుష్ప’ మొదటి భాగం విడుదల అయినతరువాత ఈ మూవీ సెకండ్ పార్ట్ చేయవలసి ఉంది. ఈమూవీ తరువాత  విజయ్ దేవరకొండ తో మరొక మూవీకి సుకుమార్ కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో మహేష్ సుకుమార్మూవీ ఉండే ఆస్కారం లేదు. కేవలం అభినందనలు తెలియచేయడానికి మాత్రమే సుకుమార్ మహేష్ ను కలిసి ఉంటాడని మరికొందరు అంటున్నారు. అయితే వీరిద్దరి లేటెస్ట్ సమావేశం మాత్రం ఇండస్ట్రీలో అనేక ఊహా గానాలకు తావిస్తోంది..





దేశ భక్తి అంటే ఇది అని చూపించిన సినిమా లు!!

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>