PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india314f68cc-47c3-4e4b-b866-76b244828427-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india314f68cc-47c3-4e4b-b866-76b244828427-415x250-IndiaHerald.jpg భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఎంద‌రో మ‌హానుభావుల త్యాగాల ఫ‌లితాన్ని అనుభ‌విస్తున్నాంకానీ వారి ఆశ‌యాలు, ఆచ‌ర‌ణ‌ల‌ను మనం పాటిస్తున్నామా? అని ఒక‌సారి మ‌న‌ల్ని మ‌నం ప్ర‌శ్నించుకుంటే కాదు అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెద్ద పెద్ద సంఘ‌ట‌నలేవీ మ‌న లోపాల‌ను ఎత్తిచూప‌వు. చాలా చాలా చిన్న చిన్న సంఘ‌ట‌న‌లే మ‌న లోపాల్ని ఎత్తిచూపుతుంటాయి. మ‌న‌ల్ని మ‌నం మార్చుకోమ‌ని సూచిస్తుంటాయి. మ‌న‌కు ఓర్పు లేద‌నే విష‌యం మీకు అర్థ‌మ‌వుతోందా?india{#}Manamక‌ల‌ల భార‌తం: 75 సంవ‌త్స‌రాల స్ఫూర్తి.. ట్రాఫిక్ సిగ్న‌ల్స్..!!క‌ల‌ల భార‌తం: 75 సంవ‌త్స‌రాల స్ఫూర్తి.. ట్రాఫిక్ సిగ్న‌ల్స్..!!india{#}ManamSun, 15 Aug 2021 09:53:34 GMT
భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఎంద‌రో మ‌హానుభావుల త్యాగాల ఫ‌లితాన్ని అనుభ‌విస్తున్నాంకానీ వారి ఆశ‌యాలు, ఆచ‌ర‌ణ‌ల‌ను మనం పాటిస్తున్నామా? అని ఒక‌సారి మ‌న‌ల్ని మ‌నం ప్ర‌శ్నించుకుంటే కాదు అనే స‌మాధాన‌మే వ‌స్తోంది. పెద్ద పెద్ద సంఘ‌ట‌నలేవీ మ‌న లోపాల‌ను ఎత్తిచూప‌వు. చాలా చాలా చిన్న చిన్న సంఘ‌ట‌న‌లే మ‌న లోపాల్ని ఎత్తిచూపుతుంటాయి. మ‌న‌ల్ని మ‌నం మార్చుకోమ‌ని సూచిస్తుంటాయి.

మ‌న‌కు ఓర్పు లేద‌నే విష‌యం మీకు అర్థ‌మ‌వుతోందా?
నిత్యం రోడ్ల‌పై ఎంత‌మేర‌కు ట్రాఫిక్ ఆగిపోతుందో చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద 60 సెక‌న్లు ఆగ‌మ‌ని డిస్‌ప్లే చూపిస్తుంటే అంత‌సేపు ఆగి ఆకుప‌చ్చ లైటు వెలిగిన త‌ర్వాత మనం ముందుకు వెళ్లాలి. కానీ అలా చేయ‌డంలేదు. 60 సెక‌న్లు పూర్త‌వ‌డానికి ఇంకా ఐదు నుంచి ఏడు సెక‌న్ల స‌మ‌యం మిగిలివుండ‌గానే కొంప‌లారిపోతున్న‌ట్లు హ‌డావిడిగా వెళ్లిపోతున్నాం. కానీ ఆ ఐదు నుంచి ఏడు సెక‌న్ల స‌మ‌యంలో అటువైపు నుంచి వ‌చ్చే వాహ‌నాల ప‌రిస్థితి ఏమిటి?  వాటికి ఆకుప‌చ్చ లైటు ఉండ‌గానే, మ‌న‌కు ఎర్ర లైటు ఉండ‌గానే వెళుతున్నాం. త‌ప్పెవ‌రిది అంటే మ‌న‌ది. ఈ ఐదు సెక‌న్ల‌లో ఏ ప్ర‌మాద‌మ‌న్నా సంభ‌విస్తే.. బాధ్య‌లెవ‌రు. ?

మ‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది..
తొంద‌ర‌పాటు ప‌నికిరాదు. అంతేకాదు మ‌న బాధ్య‌తారాహిత్యాన్ని, క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డాన్ని, ఓర్పు త‌క్కువ అని చెప్ప‌డంతోపాటు మ‌న లోపాల‌ను అంద‌రికీ తెలియ‌జేయడానికి ఈ ట్రాఫిక్ సిగ్న‌ల్స్ అనేవి ఒక  ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి. అవి క‌న‌ప‌డిన‌ప్పుడ‌ల్లా మ‌న‌లోని లోపాలు గుర్తుకురావాలి. వాటిని స‌రిజేసుకోవాలి. ప్ర‌తిరోజు మ‌న‌కు అవి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అందుకే ఓపిగ్గా ఆకుప‌చ్చ లైటు వెలిగిన త‌ర్వాతే మ‌న వాహ‌నాల‌ను బ‌య‌లుదేర‌నిద్దాం. బాధ్య‌త క‌లిగిన పౌరుల‌నిపించుకుందాం. అంతేకాదు.. ఎరుపురంగు లైటు వేసివుండ‌గానే బండిమీదో, కారులోనో ర‌య్యిమంటూ దూసుకువెళ్ళిపోతాం. కానీ మీకు తెలుసా.. అలా వెళ్లే స్వాతంత్ర్యం ఒక్క భార‌త‌దేశంలోనే ఉంద‌ని. మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చింది ఈ స్వాతంత్ర్యం కోసం కాదుక‌దా..?? మ‌నం మార‌దాం.. మ‌న చుట్టుప‌క్క‌ల‌వారిని మార్చుదాం. అందుకు మ‌న‌మేం చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌నం మారితే చాలు.. మ‌న‌ల్ని స్ఫూర్తిగా తీసుకొని అంద‌రూ మార‌తారు.
జైహింద్‌
జై భార‌త్‌



చిరంజీవిని సస్పెన్స్ లో పెడుతున్న కొరటాల ?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>