CrimePodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/ramya92d1fb7e-22c3-4a01-996a-9be8b8df2016-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/ramya92d1fb7e-22c3-4a01-996a-9be8b8df2016-415x250-IndiaHerald.jpgగుంటూరు నగరంలో ఈ రోజు జరిగిన బీ టెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఇలాంటి ఘటన జరగడం దారుణం అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని అందించారన్నారు డీజీపీ. రమ్య హత్య అత్యంత దురదృష్టకరమన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. హత్యకు పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు గంట వ్యవధిలోనే అదుపులోకRamya{#}gautham new;gautham;Guntur;Arrest;ramya;ramya krishnan;Mekathoti Sucharitha;Murder.;Government;Telangana Chief Minister;media;House;Reddy;Jagan;CM;policeరమ్య మర్డరిస్ట్ అరెస్ట్... కఠినంగా శిక్షిస్తామన్న డీజీపీరమ్య మర్డరిస్ట్ అరెస్ట్... కఠినంగా శిక్షిస్తామన్న డీజీపీRamya{#}gautham new;gautham;Guntur;Arrest;ramya;ramya krishnan;Mekathoti Sucharitha;Murder.;Government;Telangana Chief Minister;media;House;Reddy;Jagan;CM;policeSun, 15 Aug 2021 21:28:39 GMTగుంటూరు నగరంలో ఈ రోజు జరిగిన బీ టెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఇలాంటి ఘటన జరగడం దారుణం అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని అందించారన్నారు డీజీపీ. రమ్య హత్య అత్యంత దురదృష్టకరమన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. హత్యకు పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు గంట వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారని... సాక్ష్యాల ఆధారంగా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీజీపీ. మహిళలు, యువతులపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ప్రతి ఘటనను రాజకీయ కోణంతో ముడిపెట్టడం సరికాదన్న డీజీపీ... మహిళల రక్షణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని... ఇందుకోసమే ప్రత్యేకంగా దిశ యాప్ రూపొందించినట్లు తెలిపారు డీజీపీ.

బీ టెక్ విద్యార్థిని రమ్య హత్యను ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. రమ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. యువతి హత్యపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు జగన్. నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన గుంటూరు అర్బన్ పోలీసులను జగన్ అభినందించారు. దిశ చట్టం కింద వేగంగా చర్యలు తీసుకుని... నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం జగన్. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరిహారంగా రమ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలని సీఎం ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రమ్య కుటుంబసభ్యులను హోమ్ మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. నిందితుడికి కఠినంగా శిక్షిస్తామన్నారు హోమ్ మంత్రి.





రమ్య మర్డరిస్ట్ అరెస్ట్... కఠినంగా శిక్షిస్తామన్న డీజీపీ

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>