PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/indian43901daa-88aa-436a-a8ae-261fcda0b49c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/indian43901daa-88aa-436a-a8ae-261fcda0b49c-415x250-IndiaHerald.jpgఎంద‌రో పోరాట వీరుల ప్రాణ త్యాగ ఫ‌లిత‌మే భార‌త దేశ‌ స్వాతంత్య్రం. భార‌త మాత దాస్య శృంక‌లాలు తంచేందుకు ఎన్నో క‌ష్టాలు మ‌రెన్నో పోరాటాలు, అంత‌కు మించి స్వ‌రాజ్య‌మే ఊపిరిగా బ‌తికిన ధీరులు ఎంద‌రో. ఏదైమైనా చివ‌ర‌కు భార‌త జాతి స్వాతంత్య్రాన్ని ముద్దాడాల‌నే ప‌ట్టుద‌ల ముఖ్యంగా దేశం కోసం పోరాడుతున్నామ‌నే గ‌ర్వం పోరాట యోధుల్లో ఉంది. అందు వ‌ల్లనే మ‌నం స్వేచ్ఛా వాయువ‌లు పీల్చ‌కుంటున్నాం. స్వాతంత్య్రం అనంత‌రం దేశం ఏ విధంగా ముందుకు వెళ్లాలో, అభివృద్ది లో ఎలా స‌త్తా చాటాలో ఇలా అనేక విష‌యాల్లో స్వాతంత్ర స‌మ‌ర యోindian{#}Mohandas Karamchand Gandhiక‌ల‌ల భార‌తం : స్వాతంత్య్ర పోరాట వీరుల క‌ల‌లు క‌నుల‌కు క‌నిపించిన వేళ‌.!క‌ల‌ల భార‌తం : స్వాతంత్య్ర పోరాట వీరుల క‌ల‌లు క‌నుల‌కు క‌నిపించిన వేళ‌.!indian{#}Mohandas Karamchand GandhiSun, 15 Aug 2021 13:51:52 GMT ఎంద‌రో పోరాట వీరుల ప్రాణ త్యాగ ఫ‌లిత‌మే భార‌త దేశ‌ స్వాతంత్య్రం. భార‌త మాత దాస్య శృంక‌లాలు తంచేందుకు ఎన్నో క‌ష్టాలు మ‌రెన్నో పోరాటాలు, అంత‌కు మించి స్వ‌రాజ్య‌మే ఊపిరిగా బ‌తికిన ధీరులు ఎంద‌రో. ఏదైమైనా చివ‌ర‌కు భార‌త జాతి స్వాతంత్య్రాన్ని ముద్దాడాల‌నే ప‌ట్టుద‌ల ముఖ్యంగా దేశం కోసం పోరాడుతున్నామ‌నే గ‌ర్వం పోరాట యోధుల్లో ఉంది. అందు వ‌ల్లనే మ‌నం స్వేచ్ఛా వాయువ‌లు పీల్చ‌కుంటున్నాం. స్వాతంత్య్రం అనంత‌రం దేశం ఏ విధంగా ముందుకు వెళ్లాలో, అభివృద్ది లో ఎలా స‌త్తా చాటాలో ఇలా అనేక విష‌యాల్లో స్వాతంత్ర స‌మ‌ర యోధులు అనేక క‌ల‌లు క‌న్నారు. స్వాతంత్య్రంతో దేశానికి, దేశ ప్ర‌జ‌లకు విముక్తి క‌లుగుతుంద‌ని క‌ల‌గ‌న్నారు.. కానీ నేడు వారి క‌ల‌లు సాకారం అయ్యాయా అంటే.. లేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

     స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా, మ‌న కంటే త‌రువాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన వారు ముందున్నారు. భ‌ర‌త మాత భానిసత్వం నుంచి బ‌య‌ట ప‌డి ఏడు ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా దేశంలో బానిస‌ల సంఖ్య మాత్రం త‌గ్గ‌లేదు. రోజురోజుకు పేద‌రికం పెరిగిపోతోంది. తిండికి తిండి లేక అనేక మందిచ‌నిపోతున్నారు ఈ దేశంలో. స్వ‌రాజ్యం నా జ‌న్మ హక్కు అని నిన‌దించిన బాల‌గంగాధ‌ర్ తిల‌క్ నినాదాలు  నేడు స్వేచ్చకు దూర‌మ‌యిపోయింది. ఎక్క‌డ చూసిన అణ‌చివేసే దోర‌ణి. ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ను మాట్లాలేక‌పోతున్నారు.

   మీ ర‌క్తాన్ని నాకు ఇవ్వండి.. మీకు స్వ‌తంత్య్రాన్ని నేను ఇస్తాను అని చెప్పిన ధీరుడు పుట్టిన దేశంలో చీము రక్తం లేకుండా ప్ర‌జ‌లు జీవిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. శాంతి, అహింసే ఆయుధాలుగా స్వ‌తంత్య్ర సంగ్రామంలో దూకిన మ‌హాత్మ గాంధీ ఇప్పుడు గ‌నుక ఉంటే ఇప్పుడు చెల‌రేగుతున్న అశాంతి, హింస‌ను చూసి కంట త‌డి పెట్టుకుంటాడేమో. ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కుల అవినీతి ప‌రిపాల‌నను చూసి రాజ్యాంగాన్ని ర‌చించిన డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ బాధ‌ప‌డుతాడేమో.


     స్వాతంత్య్ర పోరాటంలో త‌మ ప్రాణాలు తృణ‌ప్రాయంగా అర్పించిన యోధుల‌కు మ‌నం ఇచ్చే నివాళి, వారు క‌ల‌ల‌ను సాకారం చేయ‌డ‌మే. ఇప్ప‌టికైనా పోయింది ఏమీ లేదు వారి క‌ల‌ల‌ను మ‌న క‌నులారా చూడ‌డ‌మే. ఆ దిశ‌గా అడుగులు వేయాల్సిన బాధ్య‌త‌ ప్ర‌తి భార‌తీయుడి భుజాల పై ఉంది.






   



స్వాతంత్ర్యమా పాడుకో: రాజులు ఐనా - పేదలు ఐనా భరతమాత సుతులే

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>