PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedకాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా? అన్న సందేహం టీఆర్ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ తెలంగాణ కేబినెట్‌ ఈనెల ఒకటిన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన గెజిట్‌ సీఎంవో నుంచి గవర్నర్‌ కార్యాలయానికి వెళ్లి రెండు వారాలు దాటినా.. దానికి ఆమోదం లభించక పోవడం రకరకాల చర్చకు దారితీసింది. నిజానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైkoushik mlc suspence{#}kaushik;Cabinet;Governor;raj;Huzurabad;CM;Minister;రాజీనామా;Party;Telanganaకౌశిక్‌ ఎమ్మెల్సీ కథ మారేనా?కౌశిక్‌ ఎమ్మెల్సీ కథ మారేనా?koushik mlc suspence{#}kaushik;Cabinet;Governor;raj;Huzurabad;CM;Minister;రాజీనామా;Party;TelanganaSun, 15 Aug 2021 20:28:00 GMTకాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా? అన్న సందేహం టీఆర్ఎస్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ తెలంగాణ కేబినెట్‌ ఈనెల ఒకటిన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన గెజిట్‌ సీఎంవో నుంచి గవర్నర్‌ కార్యాలయానికి వెళ్లి రెండు వారాలు దాటినా.. దానికి ఆమోదం లభించక పోవడం రకరకాల చర్చకు దారితీసింది. నిజానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైపు పాదయాత్ర చేయడం ద్వారా మరోసారి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఈటల ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నుండి నాయకులను టీఆర్‌ఎస్‌ తమవైపు ఆకర్షిస్తుంది. దానిలో భాగంగా కౌశిక్ రెడ్డి కారెక్కారు. అయితే ముందుగా హుజురాబాద్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అని అందరూ భావించినా.. ఆయన్ను అనూహ్యంగా ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఇది ఇతర పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలను సైతం ఊహించని షాక్‌కు గురి చేసింది. గతంలో ఉన్న చాలామంది సీనియర్లను కాదని సీఎం కౌశిక్ కి అవకాశం ఇవ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ కేసీఆర్‌ కేబినెట్‌ నిర్ణయం తీసుకుని ఇప్పటికే రెండు వారాలు గడిచింది. అయిన ఇప్పటివరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే  ఫైల్ రాజ్ భవన్ కు వెళ్లి అక్కడ ఆగిందా? లేక సీఎంఓలోనే పెండింగులో ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. క్రీడా కోటలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీనిపై గవర్నర్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యే అవకాశం లేదనే వాదన ఉంది. దీనికి తోడు అసలు కౌశిక్ రెడ్డి నియామక ఫైల్ ఎక్కడ ఉంది ఎందుకు ఆగిందనే దాని పైన క్లారిటీ లేదు. గత కొద్దిరోజులుగా గవర్నర్ సైతం రాజ్ భవన్‌లో అందుబాటులోనే ఉంటున్నారు. ఇటు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్‌పై గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా నియమితులైనట్లు నోటిఫికేషన్‌ వస్తుందా? లేక ఆయనకు ఆ పదవి దక్కకుండా ఎవరైనా అడ్డుపడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



మెగా స్టార్ తో మరో సారి రొమాన్స్ కి ఆమె ఓకేనా!!

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>