WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe57f61cf4-37df-46c2-8670-5f234c8d0743-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhe57f61cf4-37df-46c2-8670-5f234c8d0743-415x250-IndiaHerald.jpgనేడు పరుగులు తీస్తున్న సమాజంలో మనుషులు ఎదుటి వారి యోగ క్షేమాలు ఆలోచించడం మానేశారు సరి కదా కనీసం ఇరుగు పొరుగు వారి గురించి కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. సహాయం అంటే స్పందించే వారు కరువయ్యారు. ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు, అందరూ బాగుండాలి అని అనుకునేవాళ్లు చాలా తక్కువే. VIJAYAM MEEDHE{#}March;Santosham;bhavana;Indians;Manam;Yevaruవిజయం మీదే: ఫ్రీడమ్ ఫైటర్స్... మన ప్రేరణవిజయం మీదే: ఫ్రీడమ్ ఫైటర్స్... మన ప్రేరణVIJAYAM MEEDHE{#}March;Santosham;bhavana;Indians;Manam;YevaruSun, 15 Aug 2021 21:00:00 GMTనేడు పరుగులు తీస్తున్న సమాజంలో మనుషులు ఎదుటి వారి యోగ క్షేమాలు ఆలోచించడం మానేశారు సరి కదా కనీసం ఇరుగు పొరుగు వారి గురించి కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. సహాయం అంటే స్పందించే వారు కరువయ్యారు. ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళు, అందరూ బాగుండాలి అని అనుకునేవాళ్లు చాలా తక్కువే. ఇతరుల సంతోషం అనే మాట పక్కన పెట్టేసి మనం బాగుంటే చాలు, ఎవరు ఎలా పోతే మనకేంటి అనుకుంటున్నారు చాలామంది. అయితే ఈ ఆలోచన విధానం నెమ్మది నెమ్మదిగా మానవ సంబంధాలను కూల్చేస్తుంది. ఇదే భావన నాడు బ్రిటీషు వారు మనల్ని బానిసులుగా మార్చి హింసిస్తున్న సమయంలో మనకెందుకులే...ఎవరు ఎలా పోతే ఏంటి ..?.మనం బాగుంటే చాలు అని మన పెద్ద వారు అనుకుని ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది.

మనం ..మన కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అని స్వాతంత్ర్య సమర యోధులు  ఒక్కసారి అనుకుని ఉన్నా నేడు మనకు ఈ స్వేచ్చ ఉండేది కాదు. మనం మన కుటుంబాలతో హాయిగా జీవించే వాళ్ళమా ఒక్కసారి ఆలోచించండి. మన నాయకులు తమ గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించారు, తమ తదుపరి తరాలు స్వేచ్చగా ఆనందంగా జీవించాలి అని కోరుకున్నారు. అందుకోసం ఆంగ్లేయులకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను  కూడా కోల్పోయారు. మనం వారిలా ప్రాణాలు త్యాగం చేయకపోయినా పర్వాలేదు. కనీసం సాయం కోసం ఎదురు చూసే చేతికి మనకు వీలైనంతలో సహాయం చేద్దాం.

మనతో కలసి ఈ సమాజంలో  జీవిస్తున్న తోటి మనుషులను గౌరవిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవరి గురించో ఎందుకు ఆలోచించాలి అనుకుంటే...నీ గురించి కూడా ఎవరు ఆలోచించరు. నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగొస్తుంది అన్నారు పెద్దలు. ఒక మనిషిగా ఆనందాన్ని పంచు, వీలైనంత సహాయం చెయ్యి. అప్పుడు నీకు కూడా అవసరమైనప్పుడు సహాయం దక్కుతుంది. పూర్వం మన భారతీయులు సైతం ఆ మంచితనం వలనే ఆంగ్లేయులు మన దేశంలోకి రాగలిగారు. కానీ వారు మనము చేసిన సహాయాన్ని దుర్వినియోగానికి ఉపయోగించారు. ప్రతి విషయంలోనూ మనకు ప్రేరణ మన పూర్వీకులే.



ఆఫ్ఘన్లను ఎటూ కాకుండా చేసిన అగ్ర రాజ్యం... ?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>