PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakc8e516ee-df6e-41ee-8944-a98a645ea3ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakc8e516ee-df6e-41ee-8944-a98a645ea3ce-415x250-IndiaHerald.jpgఆఫ్గానిస్థాన్ లో తుపాకులు రాజ్యమేలుతున్నాయి. ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిసిపోయింది. దేశాన్ని ఇప్పటికే 90 శాతం స్వాధీనం చేసుకున్న తాలిబన్లు... క్రమంగా రాజధాని కాబూల్ నగరానికి దగ్గరవుతున్నారు. ఇప్పటికే దురాక్రమణ జోరుగా సాగిస్తున్న తాలిబన్లు... దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టు సాధించారు. దేశ రాజదాని కాబూల్ సమీపంలో ఉన్న జలలాబాద్ నగరాన్ని ఆక్రమించేశారు తాలిబన్లు. జలలాబాద్ నగరానికి అర్థరాత్రి సమయంలో చేరుకున్న తాలిబన్లు... మొత్తం సిటీ అంతా తమ జెండాలు పాతేశారు. రాజధాని కాబూల్ నగరానికి అత్యంత సమీపానికి చTaliban{#}American Samoa;East;Capital;Islamic countries;INTERNATIONAL;war;Governmentకాబూల్ సమీపంలో తాలిబన్లు... పాపం ఆఫ్గాన్కాబూల్ సమీపంలో తాలిబన్లు... పాపం ఆఫ్గాన్Taliban{#}American Samoa;East;Capital;Islamic countries;INTERNATIONAL;war;GovernmentSun, 15 Aug 2021 12:56:00 GMTఆఫ్గానిస్థాన్ లో తుపాకులు రాజ్యమేలుతున్నాయి. ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిసిపోయింది. దేశాన్ని ఇప్పటికే 90 శాతం స్వాధీనం చేసుకున్న తాలిబన్లు... క్రమంగా రాజధాని కాబూల్ నగరానికి దగ్గరవుతున్నారు. ఇప్పటికే దురాక్రమణ జోరుగా సాగిస్తున్న తాలిబన్లు... దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టు సాధించారు. దేశ రాజదాని కాబూల్ సమీపంలో ఉన్న జలలాబాద్ నగరాన్ని ఆక్రమించేశారు తాలిబన్లు. జలలాబాద్ నగరానికి అర్థరాత్రి సమయంలో చేరుకున్న తాలిబన్లు... మొత్తం సిటీ అంతా తమ జెండాలు పాతేశారు. రాజధాని కాబూల్ నగరానికి అత్యంత సమీపానికి చేరుకున్నారు తాలిబన్లు.

జలలాబాద్ ఆక్రమణతో కాబుల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రాజధాని కాబుల్ నగరంలోకి తాలిబన్లు ఎప్పుడైనా ప్రవేశించే అవకాశముందని అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతున్న నేపథ్యంలో ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వం ముందు రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి తాలిబన్లతో యుద్ధం చేయడం... రెండోది ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించడమే. రెండు రోజుల్లో ఆఫ్గనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్తుందని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి కూడా. దేశానికి సౌత్ సైడ్ ఉన్న లోగర్ రాష్ట్రాన్ని తాలిబన్లు పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన మజార్-ఏ-షరీఫ్ పై ఇప్పటికే తాలిబన్ జెండా ఎగురుతోంది. కాబుల్ నగరానికి కేవలం 70 కిలోమీటర్ల దగ్గర్లో ఉన్న తాలిబన్లు... దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు అన్ని మార్గాలను రెడీ చేస్తున్నారు. కాందహార్ లోని ప్రభుత్వ రేడియో స్టేషన్ ను ఆక్రమించిన తాలిబన్లు... ఇకపై ఇస్లామిక్ వార్తలనే ప్రసారం చేస్తామని కూడా ప్రకటించారు.

దేశంలో ఇకపై రక్తపాతం జరగనివ్వమని ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రజలకు భరోసా ఇచ్చారు. దేశంలో శాంతి, సుస్థిరత స్థాపించేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఆపాలని అధికారులను ఆదేశించారు. అటు ఐక్య రాజ్య సమితి కూడా తాలిబన్ల చర్యను తప్పబట్టింది. తక్షణమే దాడులను ఆపాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సూచించారు. తుపాకీ చర్య... సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారి తీస్తుందన్నారు. బాలికలు, మహిళలపైనా విచక్షణా రహితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. అటు ఆఫ్గాన్ లో నివసిస్తున్న విదేశీ రాయబార కార్యాలయాలకు, అధికారులకు ఎలాంటి ప్రాణ హానీ ఉండదని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహేల్ షహీన్ హామీ ఇచ్చారు. సామాన్యులను ప్రభుత్వమే చంపుతూ.. తమపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్గనిస్థాన్ నుంచి భారత్, అమెరికా సహా పలు దేశాలు తమ అధికారులను వెనక్కి రప్పించాయి.





కలల భారతం : ఉద్యోగం అడిగే వారే ఉండరు ?

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>