SignaturesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/india-c440b11e-ae3a-44da-9a46-0a5eff8d8d44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/india-c440b11e-ae3a-44da-9a46-0a5eff8d8d44-415x250-IndiaHerald.jpgదేశంలో ఆడబిడ్డల కోసమే పథకాలు.. బేటీ బచావో బేటీ పడావో..లాంటి పథకాలు..కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలు..పసుపు - కుంకుమ లాంటి పథకాలు..ఇవన్నీ మహిళల కోసం.. ఆడబిడ్డల సంక్షేమం కోసం.. కోట్లు పో తాయి..శవాలు తేలుతాయి.. తల్లి గర్భంలో మనిషి .. ఏమౌతాడు.. తల్లి గర్భం నుంచి వచ్చిన మనిషి ఏమౌతున్నాడు.. మనిషి మారాడు అన్నది తప్పు.. ఈ దరిద్రం నాలో లేదు..రాదు కూడా.. కానీ దేశంలో ఈ భ్రూణ హత్యల నియంత్రణ మాత్రం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే చెప్పగలను. india{#}Lakshmi Devi;Illalu;Manamకలల భారతం : భ్రూణ హత్యలు లేని దేశంకలల భారతం : భ్రూణ హత్యలు లేని దేశంindia{#}Lakshmi Devi;Illalu;ManamSun, 15 Aug 2021 15:54:00 GMTఈ దేశం బాధ్యత

ఆడ బిడ్డలకు హక్కుల
కల్పన పరిరక్షణ
ఈ  దేశం  బాధ్యత

కడుపులో పిండం
కడుపులోనే ఆగిపోతుంది

అది హత్య..

కడుపులో పిండం
లింగ నిర్థారణ తేలగానే
తన ఆయువు తీరిందని
నిర్ణయించుకుంటుంది
చంపేది తల్లి
చంపించేది తండ్రి
ఇలా ఎవ్వరు ఎలా అనుకోని
మన దరిద్రం ఎక్కడికీ పోదు


నగరాలూ నదులూ గొప్పవి.చావూ - బతుకూ గొప్పవి - గొప్పవి అనుకోవడంలో నుంచి బయటపడడం సాధ్యం కాదు కానీ శాస్త్ర విజ్ఞానం ఆరంభం నుంచి మనం పొందినవి అన్నీ గొప్పవి అని చెప్పుకోవడం తప్పు కాదు. అ లాంటిదే  లింగ నిర్థారణ..అలాంటిదే గర్భ విచ్ఛిత్తి.. అయినా ఏం కాదు దేశంలో మనల్ని పట్టించుకోని ప్రభుత్వాలూ, కోర్టులూ, పోలీసులూ ఉన్నంత కాలం ఏం కాదు..మీరు కడుపులో బిడ్డను చిదిమేసినా ఏం కాదు.. మీరు స్కానింగ్ సెంటర్ల పేరిట డబ్బులు గుంజుకున్నా ఏం కాదు. అమాయక ప్రభుత్వాలు అమయాక ప్రజలు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకునే తీరే చాలా వింత.




దేశంలో ఆడబిడ్డల కోసమే పథకాలు.. బేటీ బచావో బేటీ పడావో..లాంటి పథకాలు..కల్యాణ లక్ష్మీ లాంటి పథకాలు..పసుపు - కుంకుమ లాంటి పథకాలు..ఇవన్నీ మహిళల కోసం.. ఆడబిడ్డల సంక్షేమం కోసం.. కోట్లు పో తాయి..శవాలు తేలుతాయి.. తల్లి గర్భంలో మనిషి .. ఏమౌతాడు.. తల్లి గర్భం నుంచి వచ్చిన మనిషి ఏమౌతున్నాడు.. మనిషి మారాడు అన్నది తప్పు.. ఈ దరిద్రం నాలో లేదు..రాదు కూడా.. కానీ దేశంలో ఈ భ్రూణ హత్యల నియంత్రణ మాత్రం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే చెప్పగలను.


కొన్ని పతకాలు కొన్ని విజయాలు ప్రపంచం గర్వపడేలా చేసినా మనం తలవొంచుకునేందుకు కారణంగా కొన్ని అసమానతలు నిలుస్తున్నాయి. వర్ణ విభేదం, లింగ వివక్ష అన్నవి ఇప్పటివా? ఇప్పటికిప్పుడు పోయేవా? అ యినా పోవాలి అనుకునే తలంపుతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ అవి క్షేత్ర స్ధాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. మన స్కానింగ్ సెంటర్లపై నియంత్రణ ఉండదు..ప్రయివేటు ఆస్పత్రలుపై నియంత్రణ ఉండదు. కడు పులో బిడ్డ ఆడబిడ్డ అని చెప్పకూడదన్న ఇంగితం అస్సలు లేదు.. ఓ ఇంటి ఇల్లాలు పురుడుపోసుకునే వరకూ ఆగలేరు.. తెలుసుకోవాలన్న ఆత్రం..తెలిశాక  చంపేయాలన్న కసి.. ఏదో ఒకటి పట్టి పీడిస్తుంటాయి. బిడ్డల రక్షణ బా ధ్యత దేశంకు సంబంధించిందే కానీ దేశాన చెత్త దిబ్బలలో మృత శిశువులు, నవజాతి శిశువులు కనిపించి మనల్ని వెక్కిరిస్తుంటే అయ్యో ఈ దౌర్భాగ్యం అయ్యో దయనీయం  అని అనుకోవడం తప్ప ఆపగలమా..మనం దే నినీ ఆపలేకపోతున్నప్పుడు దేనినీ నియంత్రించలేకపోతున్నప్పుడు మాట్లాడడంలో విలువ లేదు. ఒకవేళ మాట్లాడినా విలువ ఉండదు కూడా!







బ్రేకింగ్ : ఎవరు మీలో కోటీశ్వరుడు ఫస్ట్ గెస్ట్ గా చరణ్ .... ప్రోమో వైరల్ ...!!

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>