Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gold-f6c53f6a-d8c5-4422-8380-437d8730c2f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/gold-f6c53f6a-d8c5-4422-8380-437d8730c2f1-415x250-IndiaHerald.jpgఇతర దేశాల్లో బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. భారతదేశంలో మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు అయితే బంగారంతో ఒక భావోద్వేగమే ముడిపడి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బంగారం ధర పెరిగినా తగ్గినా కూడా ఎక్కువమంది మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా అటు పెట్టుబడులుగా కూడా బంగారాన్ని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. మరికొంతమంది తమ సంపదను చూపెట్టు కోవడానికి ఇక బంగారాన్ని ప్రGold {#}2020;Bharateeyudu;goldదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు.. తులం బంగారం ధర ఎంతో తెలుసా?దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు.. తులం బంగారం ధర ఎంతో తెలుసా?Gold {#}2020;Bharateeyudu;goldSun, 15 Aug 2021 20:35:00 GMTఇతర దేశాల్లో బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. భారతదేశంలో మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు అయితే బంగారంతో ఒక భావోద్వేగమే ముడిపడి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బంగారం ధర పెరిగినా తగ్గినా కూడా ఎక్కువమంది మహిళలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా అటు పెట్టుబడులుగా కూడా బంగారాన్ని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. మరికొంతమంది తమ సంపదను చూపెట్టు కోవడానికి ఇక బంగారాన్ని ప్రతిరూపంగా వాడుతూ ఉంటారు.


 ప్రస్తుత సమయంలో ప్రతి భారతీయుడు ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉండడం అనేది సర్వసాధారణం. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. మరి 75 సంవత్సరాల క్రితం దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో బంగారం ధర ఎంత ఉందో తెలిస్తే మాత్రం అందరూ అవాక్కవుతారు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న బంగారం ధర తో పోల్చి చూస్తే ప్రస్తుత ధర ఏకంగా 52,000 శాతం పెరిగింది అని చెప్పాలి.  1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో పది గ్రాముల బంగారం ధర కేవలం 88 రూపాయలు మాత్రమే ఉంది.


 ఇక ఆ తర్వాత బంగారం ధర 1959లో ఒక వంద రూపాయలు దాటింది. ఇక 1974లో బంగారం ఏకంగా 500 రూపాయలు స్థాయిని దాటింది.  2007 సంవత్సరంలో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 10 గ్రాములకు పదివేల రూపాయలు దాటేసింది. 2011లో 10 గ్రాములకు 26,000 దాటగా.. ఇక 2020 లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుని ఏకంగా పది గ్రాముల బంగారం ధర 56,191 చేరుకుంది. ప్రస్తుతం నేడు బంగారం ధర 48 వేల 400 రూపాయలు గా కొనసాగుతుంది. ఇలా దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బంగారం ధర అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.



ఆఫ్ఘన్లను ఎటూ కాకుండా చేసిన అగ్ర రాజ్యం... ?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>