EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/karnataka-politicsd8ac16ef-331e-429b-a5e0-c89f79a17599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/karnataka-politicsd8ac16ef-331e-429b-a5e0-c89f79a17599-415x250-IndiaHerald.jpgకర్నాటకలో కాంగ్రెస్ చేతుల్లోనుంచి బీజేపీ అధికారం చేజిక్కించుకుందన్నమాటే కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలిచేలా లేదు. యడ్యూరప్పను దించేసి ఆ స్థానంలో బసవరాజ్ బొమ్మైని సీఎం సీట్లో కూర్చోబెట్టిన తర్వాత బీజేపీలో లుకలుకలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధికారానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు. karnataka politics{#}Congress;Santosham;Bharatiya Janata Party;Telangana Chief Minister;CM;Minister;Partyకర్నాటకలో సీన్ రివర్స్.. అసంతృప్తులపై కాంగ్రెస్ ఫోకస్..కర్నాటకలో సీన్ రివర్స్.. అసంతృప్తులపై కాంగ్రెస్ ఫోకస్..karnataka politics{#}Congress;Santosham;Bharatiya Janata Party;Telangana Chief Minister;CM;Minister;PartySun, 15 Aug 2021 19:03:18 GMTకర్నాటకలో కాంగ్రెస్ చేతుల్లోనుంచి బీజేపీ అధికారం చేజిక్కించుకుందన్నమాటే కానీ, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలిచేలా లేదు. యడ్యూరప్పను దించేసి ఆ స్థానంలో బసవరాజ్ బొమ్మైని సీఎం సీట్లో కూర్చోబెట్టిన తర్వాత బీజేపీలో లుకలుకలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధికారానికి దూరమయ్యే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు.

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకుని, బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఫిరాయింపులను ప్రోత్సహించి, వారికి మంత్రి పదువులు కూడా ఇచ్చింది. అయితే సీఎం కుర్చీ యడ్యూరప్ప చేతిలో ఉన్నంతకాలం ఎలాంటి సమస్యలు రాలేదు. రాగా పోగా ఇంటిపోరే ఆయనకు ఎక్కువైంది. ఆయన్ను మార్చాల్సిందేనంటూ బీజేపీలోని వైరివర్గం ఢిల్లీకి ఫిర్యాదుల్ని మోసుకెళ్లింది. అందులోనూ వయస్సు పైబడినవారిని కొనసాగించే ఉద్దేశంలేని మోదీ-షా ద్వయం ఎట్టకేలకు యడ్యూరప్పను పక్కకు తప్పించారు. సీఎం కుర్చీ బొమ్మై చేతిలో పెట్టారు. అధిష్టానం ఒకటి అనుకుంటే, అక్కడ మరొకటి జరిగింది. బొమ్మై చేతిలోకి అధికారం వెళ్లాక పరిస్థితి మరింత దిగజారింది.

పరిస్థితుల్ని గమనిస్తున్న కాంగ్రెస్..
కర్నాటకలో కాంగ్రెస్ చేయగలిగిందేమీ లేదు. అయినా కూడా అసంతృప్త నేతలపై కాంగ్రెస్ ఓ కన్ను వేసి ఉంచింది. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ మంత్రి పదవులిచ్చి ప్రోత్సహించడంతో అసలు సిసలు బీజేపీ నేతలు అవాక్కయ్యారు. పార్టీని అంటిపెట్టుకుని ఉండి, అధికారం లేకపోయినా పార్టీకోసం కష్టపడినవారిని పక్కనపెట్టేశారని అప్పట్లోనే నొచ్చుకున్నారు. బొమ్మై హయాంలో అలకలు మరింత పెరిగాయి. విచిత్రం ఏంటంటే.. అటు వలస నేతలు అసంతృప్తితో ఉన్నారు, ఇటు బీజేపీ సీనియర్ నేతలు కూడా అలకతోనే ఉన్నారు. అన్నిటికీ మించి యడ్యూరప్ప తన కొడుక్కి ఉప ముఖ్యమంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నారు. బీజేపీ అసంతృప్తుల్ని మరింత రెచ్చగొడుతోంది కాంగ్రెస్. బీజేపీ ప్రభుత్వం త్వరలోనే పతనం అవుతుందని, ఉప ఎన్నికలొస్తాయని అంటున్నారు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య. బీజేపీ అసంతృప్త నేతల్ని కాంగ్రెస్ ఒడిసిపడితే మాత్రం కర్నాటలో సీన్ రివర్స్ అయ్యే అవకాశాలున్నాయి.



సెంచరీ వీరుడు తుస్ మన్నాడు

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>