PoliticsVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-33430c3f-acac-4451-850d-ed0631d24bcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-33430c3f-acac-4451-850d-ed0631d24bcd-415x250-IndiaHerald.jpgఅబ్బా... ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ? విసుగ్గా అన్పించింది నాకు. ఆసుపత్రికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ కలిగే విసుగే అది. నేను మా బాబుకి జ్వరంగా ఉందని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళాను. మెడికల్ కాలేజీ అంటూ కొంతవరకు ఫ్రీగానే వైద్యం చేస్తున్నారు. కానీ లైన్ మాత్రం బారెడు ఉంది. కూర్చోండి అని చెప్పారు. ఒకరి తరువాత ఒకరిని పిలుస్తున్నారు. మధ్యాహ్నం అయ్యింది. డాక్టర్లు లంచ్ కి వెళ్లారు. రెండేళ్ల బాబుని పట్టుకుని ఉదయమనగా వచ్చాను. మధ్యాహ్నం అయ్యింది. డాక్టర్ల లంచ్ అయ్యేసరికి 3 గంటలు. తరువాత ఎప్పటికో పిలిచారు. వెళIndia;{#}Doctor;college;Populationకలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?India;{#}Doctor;college;PopulationSun, 15 Aug 2021 09:32:05 GMTఅబ్బా... ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ? విసుగ్గా అన్పించింది నాకు. ఆసుపత్రికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ కలిగే విసుగే అది. నేను మా బాబుకి జ్వరంగా ఉందని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళాను. మెడికల్ కాలేజీ అంటూ కొంతవరకు ఫ్రీగానే వైద్యం చేస్తున్నారు. కానీ లైన్ మాత్రం బారెడు ఉంది. కూర్చోండి అని చెప్పారు. ఒకరి తరువాత ఒకరిని పిలుస్తున్నారు. మధ్యాహ్నం అయ్యింది. డాక్టర్లు లంచ్ కి వెళ్లారు. రెండేళ్ల బాబుని పట్టుకుని ఉదయమనగా వచ్చాను. మధ్యాహ్నం అయ్యింది. డాక్టర్ల లంచ్ అయ్యేసరికి 3 గంటలు. తరువాత ఎప్పటికో పిలిచారు. వెళ్ళి డాక్టర్ చెకప్ తరువాత ప్రిస్క్రిప్షన్ తీసుకుని రూమ్ లో నుంచి బయట వచ్చాను. చాలా విసుగ్గా, తలనొప్పిగా అన్పించింది. దీనికోసం ఇంతసేపు వెయిట్ చేయాలా... నేనే ఒక పారాసిటమాల్ తీసుకుని ఇంట్లోనే వేసి ఉంటే సరిపోయేది అన్పించింది. కానీ పిల్లాడి హెల్త్ కదా... హాస్పిటల్ కి రావాల్సిందే తప్పదు. తల్లి మనసు కదా... అంతే! బయట ఇంకా ఉన్నారు పేషెంట్స్. కానీ డాక్టర్లు ఇప్పుడు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు రేపు రావాల్సిన పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితే ఇలా ఉంటే మరి ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటి? దారుణం... ఎక్కడపడితే అక్కడ... కుప్పలు తెప్పలుగా జనాలు ఉంటారు. చేతిలో డబ్బు లేక కొంతమంది అక్కడికి వెళ్తుంటే, తప్పక మరికొంతమంది వెళ్తారు.

అప్పుడు అన్పించింది నాకు... ఇండియాలో వైద్య సదుపాయం బాగానే ఉంది. పెద్ద పెద్ద కూడా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులు... అయితే వీటన్నిటి వల్ల ఎంతమందికి వైద్య సదుపాయం అందుతుంది? అసలు ఇండియాలో ఉన్న 130 కోట్ల మంది జనాభా... మరి ఎంతమందికి ఆసుపత్రి అందుబాటులో ఉంది ? 130 కోట్ల జనాభా అంటే ఎన్ని ఆసుపత్రులు ఉండాలి? ఎంతమంది డాక్టర్లు ఉండాలి ? అనే డౌట్ వచ్చింది నాకు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా... కానీ ఇక్కడ ఆరోగ్యంతో వ్యాపారం జరుగుతోంది.

ప్రతీ 100 మందికి ఒక డాక్టర్ ఉంటే అసలు ఈ తిప్పలేవీ ఉండవు కదా! అంతమంది డాక్టర్లు అందుబాటులో లేరు అన్నది జగమెరిగిన సత్యం. వెంటనే మరి ఎందుకు అంతమంది డాక్టర్లు లేరు ? అనే ప్రశ్న నాలో... ప్రతి ఏడాది డాక్టర్లుగా పట్టాలు అందుకుంటున్న డాక్టర్లు ఏమైపోతున్నారు ? డాక్టర్లు చదువు కోట్లల్లో ఎందుకు ఉంది? మరి డాక్టర్ కావాలనుకునే పేదవాడి సంగతి ఏంటి? అన్నీ ప్రశ్నలే... కానీ నిజంగానే ప్రతీ 100 మందికి ఒక డాక్టర్ ఉంటే... డాక్టర్లే దేవుళ్ళైపోతారు. ఇప్పటికీ అదే అనుకోండి... కాకపోతే కావాల్సినంత మంది డాక్టర్లు అందుబాటులో లేరు కదా..!? ప్రతి పేదవాడికి వైద్యం అందుతుంది. ఇది ఒక పేదరాలిగా అందరికీ వైద్యం అందాలనే సదుద్దేశ్యంతో నేను కంటున్న ఒక కల... ఇదే నా కలల భారతం. జై హింద్ !




చిరంజీవిని సస్పెన్స్ లో పెడుతున్న కొరటాల ?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>