EditorialMekala Yellaiaheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/editorial3afdcfb3-b34e-46f6-aed4-48833ff3ff26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/editorial3afdcfb3-b34e-46f6-aed4-48833ff3ff26-415x250-IndiaHerald.jpgపరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు ఇతర వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తుండడం మనుషులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు సముద్ర జలాల్లో కలుస్తూ చేపలను చంపుతున్నాయి. దీంతో మత్స్యకారులకు నష్టాన్ని తెస్తోంది. పర్యటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం కూడా కాలుష్య కాసారంగా మారుతోందిEditorial{#}Brazil;salt;Kailasagiri;Aaviri;pollution;Carbon dioxide;Industries;June;Sea;sampada;Cheque;Vishakapatnamపరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు ఇతర వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తుండడం మనుషులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు సముద్ర జలాల్లో కలుస్తూ చేపలను చంపుతున్నాయి. దీంతో మత్స్యకారులకు నష్టాన్ని తెస్తోంది. పర్యటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం కూడా కాలపరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు ఇతర వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తుండడం మనుషులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు సముద్ర జలాల్లో కలుస్తూ చేపలను చంపుతున్నాయి. దీంతో మత్స్యకారులకు నష్టాన్ని తెస్తోంది. పర్యటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం కూడా కాలEditorial{#}Brazil;salt;Kailasagiri;Aaviri;pollution;Carbon dioxide;Industries;June;Sea;sampada;Cheque;VishakapatnamSun, 15 Aug 2021 18:53:06 GMTఉప్పు తిన్న సముద్రానికే ముప్పు తెస్తున్నాం!

పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యానికి తోడు ఇతర వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తుండడం
మనుషులకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు సముద్ర జలాల్లో కలుస్తూ చేపలను చంపుతున్నాయి. దీంతో మత్స్యకారులకు నష్టాన్ని తెస్తోంది. పర్యటకులను ఆకట్టుకునే విశాఖ సాగరతీరం కూడా కాలుష్య కాసారంగా మారుతోంది. సముద్రపునీళ్లలో ప్లాస్టిక్ పేరుకుపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఇది రానురాను మరింత పెరుగుతోందని సముద్ర శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. భూమి విస్తీర్ణంలో మూడొంతులు సముద్రాలే ఉండగా, మిగిలిన ఒక వంతులో మాత్రమే నదులు, సరస్సులు, అడవులు, ఎడారులు, మైదానాలు ఉన్నాయి. జీవచరాలు, మనుషుల మనుగడకు సముద్రాల ఉనికే కీలకమైంది. వాటిని కాపాడుకుంటేనే భూమిమీద జీవులు బతుకుతాయి. మనుషుల ఆరోగ్యానికి కీలకమైన ప్రొటీన్లు ఎక్కువగా సముద్రప్రాణులైన చేపలు, పీతలు, రొయ్యల వంటి మత్స్య సంపద నుంచే వస్తున్నాయి. సముద్రాలే వాతావరణంలోని మార్పులను మానవ మనుగడకు అనుకూలంగా మార్చుతూ మేలు చేస్తున్నాయి. సముద్రపునీరు ఆవిరి కావడంతోనే వర్షాలు కురుస్తున్నాయి. సముద్రగర్భం నుంచే సహజవాయువు, ముడిచమురు ఇతర నిక్షేపాలు అందుతున్నాయి. ఇంత మేలు చేస్తున్న సముద్రాలకు మనుషులు కీడు చేస్తున్నారు. ఎన్నో రకాల కాలుష్యాలతో సముద్రాల నుంచి వచ్చే ప్రాణవాయువులను చంపుతున్నారు.  ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా 86.18 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. ఒక్క విశాఖ తీరంలోనే 200 టన్నులకు పైగా వ్యర్థాలు కలుస్తున్నాయి. సముద్రాల్లో అవసరానికి మించి కార్బన్ డయాక్సైడ్ చేరుతుండడంతో ఆమ్ల గాఢత పెరుగుతోంది. భూమి మీద పెరుగుతున్న కాలుష్యం కూడా చివరికి మహాసముద్రాలకే చేరుతోంది. ఇది రోజు రోజుకూ చేటు తెస్తోంది.
చుట్టూరా కొండలు ఉండి, ఒక వైపు సముద్రం ఉంటే దాన్ని బౌల్‌ ఏరియా అంటారు. ఇలాంటి  సహజంగా ఉన్న అందమైన అద్బుత ప్రాంతం విశాఖ. అయితే ఆ గుండ్రని ప్రదేశాన్ని ఇప్పుడు  కాలుష్యం కాటేస్తోంది. కైలాసగిరి, నరవ, యారాడ గుట్టలు సముద్రమట్టానికి 700 మీటర్ల నుంచి కిలోమీటరు వరకు ఎత్తు ఉన్నాయి. దీంతో  పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్య కారకాలు ఇక్కడే ఆగుతున్నాయి. కాలుష్య వ్యర్థాలు ఇంకో దిక్కునకు వెళ్లకుండా ఈ మూడు గుట్టలు అడ్డుగా ఉన్నాయి. ఈ బౌల్‌ ప్రదేశంలో వెదజల్లుతున్న  కాలుష్యం విశాఖ నగరాన్ని, సముద్రాన్ని ప్రమాదంలో పడేస్తోంది. దీని ప్రభావంతో ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. విశాఖ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరం కాలుష్యం వెదజల్లుతోంది. ప్రతిరోజూ పన్నెండు గంటల పాటు విశాఖ నగర ఉపరితలం నుంచి సముద్రంపైకి, సముద్రం నుంచి నగరం మీదకు గాలులు వీస్తుంటాయి. ఈక్రమంలో బౌల్‌ ప్రదేశంలో దుమ్ము  కణాలు సముద్రంపైకి వస్తున్నాయి. సముద్రంలో కాలుష్య కారకాలు 80 శాతం వరకు కలుస్తున్నాయి. సముద్రంలో ఐదు మీటర్ల లోతునకు కాలుష్యం విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రపు నీరు  ఆమ్లజనితమైపోతోంది. సముద్రంలో చేపలతో పాటు కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మ జీవరాశులు ఉంటాయి. వాటిపై ఆధారపడి మరికొన్ని జాతులు బతుకుతుంటాయి. ఇలా గొలుసుకట్టు ఆహార విధానంలో జీవిస్తున్న జాతులను కాలుష్యం కాటేస్తోంది. సముద్ర జీవరాశులు బతకడానికి ఆక్సిజన్‌, ఉప్పు శాతాలు సక్రమంగా ఉండాలి. 8 నుంచి 10 పీపీటీ వరకు ఆక్సిజన్‌ ఉండాలి. 30 నుంచి 33 శాతం వరకు  ఉప్పు ఉండాలి. అయితే విషపూరిత రసాయనాలు కలుస్తుండడంతో అసమతుల్యత ఏర్పడుతోంది. జలచరాలకు అందాల్సిన మోతాదులో ఆక్సిజన్‌ అందకపోవడంతో అవి మరణిస్తున్నాయి. పోర్టులు, పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు ఇంతటి అనర్థాలను తెస్తున్నాయి. విశాఖ సెజ్ లోని కొన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను పట్టించుకోకుండా కాలుష్యాన్ని వదులుతున్నాయి. దీని పర్యవసానంతో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఈ ప్రమాదానికి చెక్ పెట్టాలంటే  బౌల్‌ ఏరియాలో కొత్త పరిశ్రమలు రాకుండా, ఉన్న పరిశ్రమల నుంచి కాలుష్య కారకాలు రాకుండా  చర్యలు తీసుకోవాలి. ఆర్కేబీచ్‌ నుంచి ఫాం బీచ్‌ వరకు ఉన్న నివాస ప్రాంతాల నుంచి మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తోంది. ఈనీటిని శుద్ధి చేయడానికి కైలాసగిరి వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఉన్నా  సముద్రంలోకి మురుగునీరు వదులుతున్నారు. అయినా కాలుష్య నివారణ మండలి పట్టించుకోవడంలేదు. భూ ఉపరితలంతో పాటు, సముద్రతీరాలను కాపాడుకునే దిశగా విశాఖ ప్రజలు అడుగులు వేయాలి. భవిష్యత్ తరాలు బాగుండాలంటే కాలుష్యాన్ని కట్టడి చేయాలని ప్రపంచంలోని పలు దేశాలు రంగంలోకి దిగాయి. 1992లో బ్రెజిల్ లో ధరిత్రి సదస్సు నిర్వహించాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు సముద్రాలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాయి. ఈనేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 2008 జూన్ 8న వరల్డ్ ఓషన్స్ డే నిర్వహించాలని అధికారికంగా ప్రకటించింది. అడవులను రక్షించుకునేందుకు ఫారెస్టు గార్డులు ఉన్నట్టే, సముద్ర తీరాలను కాపాడేందుకు ఓషన్ గార్డులను నియమించాల్సిన అవసరం ఉంది. భూమిని పచ్చదనాల సోయగాలతో పరవశించేలా, జవజీవాలు తీసుకొచ్చే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గించి,  సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి.



సెంచరీ వీరుడు తుస్ మన్నాడు

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mekala Yellaiah]]>