MoviesSiva.Keditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-freedomb1a142ba-6992-4173-82bf-b7c04e34742b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-freedomb1a142ba-6992-4173-82bf-b7c04e34742b-415x250-IndiaHerald.jpgభారత స్వాతంత్య్ర సంగ్రామం వెనుక జరిగిన అనేక మహనీయుల జీవిత గాథలను,  చరిత్ర పుటలను చిత్రాలుగా  తెరకెక్కించి  తమదైన దేశ సేవ చేసిన సినీ కళాకారులు ఎందరో ఉన్నారు.  రెపరెపలాడిన మువ్వన్నెల జెండా వెనుక   వీరత్వానికి, పోరాటానికి మధ్య త్యాగాలు చేసిన  ఆ మహా వీరులు గురించి,  అలాంటి చిత్రాలను  మనకు అందించిన  ఆ సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాం.    పద్మశ్రీ చిత్తూరు నాగయ్య.  ఇప్పటి తరానికి ఆయన తెలియకపోవచ్చు. మొడ్డమొదటి తెలుగు సినిమా కథానాయకుడు 'చిత్తూరు నాగయ్య'.  పైగా మొదటి స్టార్ హీరో కూడా.   ఎన్టీఆర్ శకం మIndian Freedom{#}Rajamouli;Komaram Bheem;Padma Shri;uyyalawada narasimha reddy;jeevitha rajaseskhar;krishna;Service;history;Father;Rayalaseema;NTR Kathanayakudu;Chitram;Alluri Sitarama Raju;Chiranjeevi;Telugu;Maha;NTR;Cinema;Heroస్వాతంత్య్ర సంగ్రామంలో సినీ  కళాకారులుస్వాతంత్య్ర సంగ్రామంలో సినీ  కళాకారులుIndian Freedom{#}Rajamouli;Komaram Bheem;Padma Shri;uyyalawada narasimha reddy;jeevitha rajaseskhar;krishna;Service;history;Father;Rayalaseema;NTR Kathanayakudu;Chitram;Alluri Sitarama Raju;Chiranjeevi;Telugu;Maha;NTR;Cinema;HeroSun, 15 Aug 2021 19:24:00 GMT
భారత స్వాతంత్య్ర సంగ్రామం వెనుక జరిగిన అనేక మహనీయుల జీవిత గాథలను,  చరిత్ర పుటలను చిత్రాలుగా  తెరకెక్కించి  తమదైన దేశ సేవ చేసిన సినీ కళాకారులు ఎందరో ఉన్నారు.  రెపరెపలాడిన మువ్వన్నెల జెండా వెనుక   వీరత్వానికి, పోరాటానికి మధ్య త్యాగాలు చేసిన  ఆ మహా వీరులు గురించి,  అలాంటి చిత్రాలను  మనకు అందించిన  ఆ సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాం.

 

పద్మశ్రీ చిత్తూరు నాగయ్య.  ఇప్పటి తరానికి ఆయన తెలియకపోవచ్చు. మొడ్డమొదటి తెలుగు సినిమా కథానాయకుడు 'చిత్తూరు నాగయ్య'.  పైగా మొదటి స్టార్ హీరో కూడా.   ఎన్టీఆర్ శకం మొదలు అయ్యాక కూడా  తండ్రి పాత్రల్లో ఒదిగిపోయిన మహా నటుడు నాగయ్య.   1930లో అంటే  నాగయ్యగారు సినిమాల్లోకి రాకముందు  ఆంధ్రపత్రికలో జర్నలిస్టుగా వర్క్ చేశారట. ఆ సమయంలో సత్యాగ్రహంలో పాల్గొని ‘భారతమాతకు జై’ అంటూ నినదించి  తన దేశ భక్తి చాటుకున్నారు.      



రొమ్ము విరిచి  తూటాకి ఎదురు వెళ్లిన  ఆంధ్రకేసరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఆయన జీవితం ఆధారంగా తెలుగులో ‘ఆంధ్రకేసరి’ అనే సినిమా వచ్చింది.   విజయ్‌ చందర్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తూ  ఈ సినిమాని తీశారు.  పైగా  ఈ సినిమాకి  నంది అవార్డు కూడా రావడం విశేషం.  ప్రస్తుతం  రాజమౌళి  చేస్తోన్న  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా  ఆంగ్లేయులకు  ఎదురెళ్లిన అల్లూరి పోరాటం గురించి,  నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమరం భీమ్‌ వీరత్వం  గురించే.


 
అలాగే  ‘త్యాగభూమి’ చిత్రం కూడా  అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తీసిందే.  అలాగే 1996లో  మోహన్‌లాల్‌  హీరోగా  వచ్చిన  బహు భాషాచిత్రం ‘కాలాపానీ’ సినిమా  స్వాతంత్య్ర  ఉద్యమ ఖైదీల కష్టాలను కళ్లకు కట్టింది.  ఇక  సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామారాజు’ చిత్రం సృష్టించిన ప్రభంజనం ఓ చరిత్ర అయింది.  అలాగే మెగాస్టార్ హీరోగా వచ్చిన   రేనాటి సీమ కన్న సూరీడు ‘సైరా’ కూడా   ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగాన్ని గుర్తు చేసింది. ఇలా స్వాతంత్య్ర  మహా సంగ్రాం గురించి చెబుతూ   సినీమాతరాన్ని పలికించిన  కళాకారులు ఎందరో ఉన్నారు.  వారందరికీ మా ఓకేతెలుగు తరపున ప్రత్యేక వందనాలు.    
 
 



సెంచరీ వీరుడు తుస్ మన్నాడు

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva.K]]>