SignaturesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/pandragustu6ea86b51-c6ec-4071-bb6a-df19ed9ee7ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/pandragustu6ea86b51-c6ec-4071-bb6a-df19ed9ee7ac-415x250-IndiaHerald.jpgకలల భారతం.. 75 ఏళ్ల భారతం కంటున్న కలలు ఎన్నో.. తీరకపోయినా కలలు కందాం.. కలలు కంటే.. అవి కొన్నాళ్లకు నిజాలవుతాయి.. మన కలలు భవిష్యత్తుగా ఊపిరిపోసుకుంటాయి.. ఆ రోజులు చూసేందుకు మనం లేకపోవచ్చు.. మన భావితరం ఉంటుంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో సమానత్వమే ప్రధాన భూమిక.. కానీ.. ఇప్పటికీ మన భారతంలో ఎటుచూసినా కొరవడుతున్నది అదే.. అంబేడ్కర్ రిజర్వేషన్లు పెట్టేటప్పుడు పదేళ్ల కోసమే అని రాశాడంటారు. ఆ తర్వాత పదేళ్ల తర్వాత సమీక్షించుకోవచ్చని చెప్పాడంటారు. కానీ.. ఇప్పటికే అవే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషpandragustu{#}Tamilnadu;Manamకలల భారతం: రిజర్వేషన్లు అవసరం లేని జనం..!కలల భారతం: రిజర్వేషన్లు అవసరం లేని జనం..!pandragustu{#}Tamilnadu;ManamSun, 15 Aug 2021 23:00:00 GMTకలల భారతం.. 75 ఏళ్ల భారతం కంటున్న కలలు ఎన్నో.. తీరకపోయినా కలలు కందాం.. కలలు కంటే.. అవి కొన్నాళ్లకు నిజాలవుతాయి.. మన కలలు భవిష్యత్తుగా ఊపిరిపోసుకుంటాయి.. ఆ రోజులు చూసేందుకు మనం లేకపోవచ్చు.. మన భావితరం ఉంటుంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో  సమానత్వమే ప్రధాన భూమిక.. కానీ.. ఇప్పటికీ మన భారతంలో ఎటుచూసినా కొరవడుతున్నది అదే.. అంబేడ్కర్ రిజర్వేషన్లు పెట్టేటప్పుడు పదేళ్ల కోసమే అని రాశాడంటారు. ఆ తర్వాత పదేళ్ల తర్వాత సమీక్షించుకోవచ్చని చెప్పాడంటారు.


కానీ.. ఇప్పటికే అవే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్ల శాతం వందకు 50 దాటుతోంది.. తమిళనాడు వంటి చోట్ల 60 శాతం దాటుతోంది. ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు కూడా వచ్చాయి. మరి ఇన్ని రిజర్వేషన్లు పెట్టినా.. ఎందుకు బడుగు వర్గాలు ఇంకా బడుగులుగానే  ఉన్నారు. ఏళ్ల తరబడి రిజర్వేషన్లు కొనసాగించినా బడుగుల జీవితాలు మారకపోతే.. ఏం చేయాలి.. ఇంకెన్నాళ్లు కొనసాగించాలి.. రిజర్వేషన్లు.. ఇలా మన దేశంలో ఎంతో కాంట్రావర్షియల్ సబ్జక్టు.


అందుకే రిజర్వేషన్లు ఉండని దేశం కావాలి.. అంటే ఎవరికీ రిజర్వేషన్లు అవసరం కాని స్థాయికి దేశం చేరాలి. అంటే దేశంలో అంతరాలు తొలగిపోవాలి.. సామాజిక, ఆర్థిక అంతరాలు మటుమాయం కావాలి.. అప్పుడే మన కలల  భారతం సాకారం అవుతుంది.  ఆ దిశగా అడుగులు పడాలి. మనుషుల మధ్య అంతరాలు తొలగించాలి. అంతరాలు తొలగేలా అవగాహన పెంచాలి.. అంతరాలు ఉన్నా అవి మనుషుల మధ్య అడ్డుగోడలు కాకూడదు. కుల మతాల పేరుతో జనం కొట్టుకునే రోజులు పోవాలి.


వస్తుంది.. ఆ కాలం త్వరలోనే వస్తుంది.. అసలు కులం అంటే తెలియని కుర్రాళ్లు బతికే రోజులొస్తాయి. అసలు మతం అంటే ఏమిటో తెలుసుకోవాలన్న అభిమతం ఉన్న యువతరం వస్తుంది.. మన నేలపైనే ఈ సమానత్వం వెల్లివిరిస్తుంది. ఉన్న రిజర్వేషన్లు కోరని జనం వస్తారు.. మాకు రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్లు వినిపించవు.. వస్తుంది ఆ కలల భారతం.. సానుకూలంగా ఆలోచిద్దాం.. ఆ దిశగా అడుగులు వేద్దాం.





అఫ్గానిస్తాన్‌: అనుకున్నంతా అయ్యింది.. భారత్‌కు ముప్పు పెరిగింది..!

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>