LifeStyleN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/heavy-marriagesc7b57465-2f02-4149-b7dc-4eb3c6ee5b51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/heavy-marriagesc7b57465-2f02-4149-b7dc-4eb3c6ee5b51-415x250-IndiaHerald.jpgదీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్లు కరోనా మూడో దశ రాకముందే పెళ్లి తంతు పూర్తి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఈ సందడి వాతావరణం మరింత ఎక్కువగా దర్శనమిస్తోంది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా బాజాభజంత్రీలు మోగుతుండటంతో నగరానికి పెళ్లి కళ వచ్చింది. ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు వివాహ వేడుకలతో కళకళలాడుతున్నాయి. శ్రావణ మాసంలో దివ్యమైన శుభముహూర్తాలు ఉండటంతో పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయిheavy marriages{#}House;Telugu;marriage;Coronavirusమూడు రాకముందే ఒక్కటవుతున్నారు!మూడు రాకముందే ఒక్కటవుతున్నారు!heavy marriages{#}House;Telugu;marriage;CoronavirusSun, 15 Aug 2021 19:14:00 GMTదీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్లు కరోనా మూడో దశ రాకముందే పెళ్లి తంతు పూర్తి చేసుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఈ సందడి వాతావరణం మరింత ఎక్కువగా దర్శనమిస్తోంది. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా బాజాభజంత్రీలు మోగుతుండటంతో నగరానికి పెళ్లి కళ వచ్చింది. ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు వివాహ వేడుకలతో కళకళలాడుతున్నాయి. శ్రావణ మాసంలో దివ్యమైన శుభముహూర్తాలు ఉండటంతో పెద్దసంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

కరోనా కారణంగా ఏడాదికిపైా అన్ని రకాల శుభకార్యాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ముహూర్తాలు నిర్ణయించుకుని, ఫంక్షన్‌ హాళ్లు బుక్‌ చేసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల వివాహాలు ఆగిపోయాయి. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతోపాటు ఎక్కువ ముహూర్తాలు ఉండటంతో ఈ నెలలో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. కర్నూలుకు చెందిన ఒక జంట అయితే వినూత్నంగా ఆన్‌లైన్‌ మ్యారేజ్‌ చేసుకుంది. వృత్తి రీత్యా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నారు. కరోనా కారణంగా వారు ఇండియాకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆ జంట ఇరువైపుల పెద్దలు ఆన్‌లైన్‌ మ్యారేజ్‌కు ఏర్పాట్లు చేశారు. వధూవరులు ఆస్ట్రేలియాలో కల్యాణ మండపంలో పెళ్లి పీటలపై కూర్చోన్నారు. కర్నూలులో పురోహితుడు కూర్చోని వేదమంత్రాలు చదివారు. అలా వారిద్దరూ ఒక్కటి కావడం తెలుగు రాష్ట్రాల్లోనే హైలెట్‌గా నిలిచింది.


ఇక శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండటంతో మార్కె ట్లో సైతం సందడి నెలకొంది.  షాపుల్లో అమ్మకాలు పెరిగాయి. కేటరింగ్ సంస్థలకు, వంట మాస్టర్లు, బాజాభజంత్రీల వాళ్లకు డిమాండ్ ఏర్పడింది. చాలాకాలంగా ఎలాంటి వేడుకలు లేక వెలవెలపోయిన ఫంక్షన్ హాళ్లు తిరిగి ముస్తాబు అవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌ నగరంలోని అనేక చోట్ల ఫంక్షన్ హాళ్లు పూర్తి గా బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

కొవిడ్ కాలంలో పరిమితంగా పెళ్లిళ్లు జరిగాయి. బంధుమిత్రులు లేకుండా కేవలం అయిదుగురు నుంచి పది మంది దగ్గరివాళ్ల సమక్షంలో మొక్కుబడిగా పెళ్లిళ్లు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే ఘనంగా పెళ్లి వేడుకలు చేసుకోవాలనుకున్న వాళ్లు మాత్రం వాయిదా వేసుకున్నారు. దీంతో ఇంచుమించు గత ఏడాది నుంచి నిలిచిపోయిన వివాహ మహోత్సవాలు ఈసారి పెద్ద ఎత్తున జరిగే అవకాశం కనిపిస్తోంది.



సెంచరీ వీరుడు తుస్ మన్నాడు

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>