PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-ff02b1af-c3eb-4b8e-ba15-8f98f9135635-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/india-ff02b1af-c3eb-4b8e-ba15-8f98f9135635-415x250-IndiaHerald.jpgబ‌డి ఈడు పిల్ల‌ల‌కు బ‌డే లోకం. బ‌డి ఈడు పిల్ల‌ల‌కు ఆట‌లూ పాట‌లే ఓ మంచి వ్యాప‌కం. బ‌డి ఓ ఆల‌యంలాంటిది క‌దా! కానీ మ న బుజ్జి దేవుళ్ల‌కు మాత్రం అందులో చోటే లేదు. కొన్ని సార్లు బ‌డికి వెళ్లాల‌న్నా వెళ్లలేని దీనా వ‌స్థ. ఆర్థికంగా బాలేని కుటుంబా లు కొన్ని, సామాజికంగా ఎద‌గ‌లేని కుటుంబాలు కొన్ని ఇప్ప‌టికీ త‌ప్ప‌ని స‌రై ప‌నుల‌కు పంపిస్తూనే ఉన్నారు. indiaక‌ల‌ల భార‌తం : బాల కార్మికులే లేని భార‌త దేశంక‌ల‌ల భార‌తం : బాల కార్మికులే లేని భార‌త దేశంindiaSun, 15 Aug 2021 14:53:26 GMTపిల్ల‌లు బ‌డికి

పెద్ద‌లు ప‌నికి

ఈ నినాదం  వినిపించి

చాలా కాలం అయింది

కానీ ఆచ‌ర‌ణ మాత్రం

అందుకు విరుద్ధం




బాల్యం అంటేనే జ్ఞాప‌కం

చిట్టి చేతులు మాత్రం

భాగ్య దేశంలో

అభాగ్యులమ‌ని తలుస్తూ

అదే ప‌నిగా ప‌నిచేస్తుంటాయి




మ‌ట్టి త‌ట్ట‌లు మోస్తూ

ఇటుకలు మోస్తూ

హోట‌ళ్ల‌లో ప‌నిచేస్తూ

మేం ఇంతే మా బ‌తుకూ ఇంతే

అన్న బాధ‌ను వెల్ల‌డి చేయ‌లేక

ఉండిపోతున్నారెంద‌రో చీక‌టి గ‌దిలో




బ‌డి ఈడు పిల్ల‌ల‌కు బ‌డే లోకం. బ‌డి ఈడు పిల్ల‌ల‌కు ఆట‌లూ పాట‌లే ఓ మంచి వ్యాప‌కం. బ‌డి ఓ ఆల‌యంలాంటిది క‌దా! కానీ మ న బుజ్జి దేవుళ్ల‌కు మాత్రం అందులో చోటే లేదు. కొన్ని సార్లు బ‌డికి వెళ్లాల‌న్నా వెళ్లలేని దీనా వ‌స్థ. ఆర్థికంగా బాలేని కుటుంబా లు కొన్ని, సామాజికంగా ఎద‌గ‌లేని కుటుంబాలు కొన్ని ఇప్ప‌టికీ త‌ప్ప‌ని స‌రై ప‌నుల‌కు పంపిస్తూనే ఉన్నారు. వారి పైనే ఆధార‌ప‌డు తూ క‌లో,గంజో తాగుతూ కుటుంబాల‌ను  పోషిస్తున్నా రు. మ‌రి ! బాల కార్మిక నిర్మూల‌న సాధ్యం అవుతుందా? లేదు అది జ‌ర గ‌ని ప‌ని..? పాఠ‌శాల‌ల్లో హాజ‌రు శాతం పెంచేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌డం లేదు స‌రిక‌దా! మ‌న ద య‌నీయ స్థితిని వె క్కిరిస్తున్నాయి.




ఏటా బాల కార్మికుల నిరోధ‌క చ‌ట్టాలు.. నిర్మూల‌న పేరిట ప్ర‌త్యేక దినోత్స‌వాలు జ‌రుపుతున్నా అవేవీ క్షేత్ర స్థాయిలో ఫ‌లించ‌డం లే దు. అభివృద్ధి అంత‌గా లేని తండాల నుంచి, ఆక‌లి కేక‌లు త‌రుచూ వినిపించే క‌రువు సీమ‌ల నుంచి, వెనుక‌బాటే త‌మకు శాపం గా మారిన ప‌ల్లె ప్రాంతాల నుంచి ఎంద‌రెంద‌రో పొట్ట చేత‌ప‌ట్టుకుని త‌ల్లిదండ్రుల వెంట న‌డిచి న‌గ‌రాల‌కు చేరుకుని హోట‌ళ్ల‌లో,ప‌రిశ్ర మ‌ల్లో ప‌నుల‌కు కుదురుకుంటున్నారు. కొన్ని సార్లు కూలి గిట్టుబాటు కాక రాత్రీ,ప‌గలు అన్న తేడా లేకుండా ప‌రిశ్ర‌మిస్తున్నారు. ఆరోగ్యాల‌ను సైతం లెక్క చేయ‌క ప‌ని చేసి, తీరా కునుకు తీద్దాం అంటే నిలువ నీడ లేక ఫ్లై ఓవ‌ర్ల కింద ప‌డుకుని జీవ‌నం వెళ్ల‌దీస్తు న్నారు. వీరిని చూసి కూడా ప‌ట్టించుకోని అధికారులు త‌మ రికార్డులలో మాత్రం చైల్డ్ లేబర్, హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ను అరిక‌ట్టామ ని, నియంత్రించామ‌ని పేర్కొంటూ కొన్ని అబ‌ద్ధాల‌ను మాత్రం ప్ర‌స్తావిస్తారు. వాస్త‌వం మాత్రం ఇందుకు భిన్నంగా ఉ న్న‌ప్ప‌టికీ పా ల‌క వ్య‌వ‌స్థ‌ల స్పంద‌న శూన్యం. సంబంధిత బాల కార్మికుల‌ను ఆదుకోవ‌డంలోనూ,  వేళ‌కు తిండి పెట్టించి చ‌దువు చెప్పించ‌డం లోనూ, పోష‌కాహారం అందించి వారికి న‌చ్చిన క్రీడాంశాల్లో రాణించేలా చేయ‌డం వంటి ప‌నులు చేయ‌డం లేదు గాక లేదు. ఇక క‌ల ల భార‌తం సాకారం అన్న‌ది ఎవ‌రి చేతుల్లో..! ఎవ‌రి చేత‌ల్లో! అన్న‌ది ఎవ‌రికి వారు ప్ర‌శ్నించుకుని జ‌వాబులు వెత‌క‌డం ఈ పంద్రా గ‌స్టున త‌ప్ప‌క చేయాల్సిన ప‌ని.





 


 







క‌ల‌ల భార‌తం : బాల కార్మికులే లేని భార‌త దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం

స్వాతంత్ర్యమా పాడుకో : జన గణ మన



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>