PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/covid-vaccine94419a47-d6b5-4023-93cb-ebb5ef5aae66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/covid-vaccine94419a47-d6b5-4023-93cb-ebb5ef5aae66-415x250-IndiaHerald.jpgకొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడకుండా తప్పించుకోలేరు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్, శానిటైజర్ వాడాల్సిందే, సామాజిక దూరం పాటించాల్సిందే. ఇప్పటి వరకూ అందరూ ఇదే చెబుతున్నారు. మరి వ్యాక్సిన్ వేయించుకోవడం దేనికి అంటే, కరోనా వచ్చినా దాని ప్రభావం ఎక్కువగా లేకుండా చూసుకోడానికి.. అనే సమాధానం వినిపిస్తోంది. భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్, టీకా తర్వాత కొవిడ్ ఎంతమందికి సోకింది అనే విషయాలపై ఆసక్తికర అధ్యయనం జరిగింది. ఈ అధ్యయన నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. covid vaccine{#}central government;Coronavirus;Indiaవ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ ప్రభావం.. ఆసక్తికర అధ్యయనం..వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ ప్రభావం.. ఆసక్తికర అధ్యయనం..covid vaccine{#}central government;Coronavirus;IndiaSat, 14 Aug 2021 08:00:00 GMTకొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడకుండా తప్పించుకోలేరు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్, శానిటైజర్ వాడాల్సిందే, సామాజిక దూరం పాటించాల్సిందే. ఇప్పటి వరకూ అందరూ ఇదే చెబుతున్నారు. మరి వ్యాక్సిన్ వేయించుకోవడం దేనికి అంటే, కరోనా వచ్చినా దాని ప్రభావం ఎక్కువగా లేకుండా చూసుకోడానికి.. అనే సమాధానం వినిపిస్తోంది. భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్, టీకా తర్వాత కొవిడ్ ఎంతమందికి సోకింది అనే విషయాలపై ఆసక్తికర అధ్యయనం జరిగింది. ఈ అధ్యయన నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

టీకా తీసుకున్నా కొవిడ్ వస్తుంది.. కానీ..!
టీకా తీసుకున్నవారు కూడా కొవిడ్ బారిన పడే అవకాశాలున్నాయి. అయితే అది చాలా స్వల్ప శాతం అని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పటి వరకూ భారత్ లో 53.14కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. అంటే ఇందులో సింగిల్ డోస్, రెండు డోసులు కలిపి ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎంతమంది అనే వివరం మాత్రం స్పష్టంగా లేదు. 53.14 కోట్ల లెక్కను తీసుకుంటే.. వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయిన తర్వాత టీకా తీసుకున్నవారిలో కేవలం 0.048 శాతం మందికి మాత్రమే  కొవిడ్ సోకిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 2.6లక్షలమంది వ్యాక్సిన్ వేయించుకున్నా కొవిడ్ బారిన పడ్డారు.

సింగిల్ డోస్ టీకా తీసుకున్నవారిలో 1,71,511మందికి కొవిడ్ సోకగా, డబుల్ డోస్ తీసుకున్నవారిలో 87మందిని కొవిడ్ ఇబ్బంది పెట్టింది. అయితే భారత్ లో పంపిణీ అయిన వ్యాక్సిన్ డోస్ లతో పోల్చి చూస్తే ఈ సంఖ్య చాలా స్వల్పం. టీకా తీసుకున్నవారిలో ఎక్కువమంది బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ ముప్పు నుంచి తప్పించుకున్నట్టు తేలింది.

టీకా తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ సోకడాన్ని బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటారు. అయితే ఇలా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో ప్రాణాపాయ ముప్పు తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. టీకా తీసుకున్నవారికి కొవిడ్ సోకే ముప్పు కూడా తక్కువేనంటున్నారు నిపుణులు. అందుకే అందరూ విధిగా టీకా తీసుకోవాలని చెబుతున్నారు. అయితే కొత్తగా వస్తున్న వేరియంట్లను దృష్టిలో ఉంచుకుని టీకా తీసుకున్నాక కూడా మాస్క్, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.



శ్రీదేవి, కమెడియన్ రాజబాబు జంటగా నటించిన సినిమా ఇదే..??

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>