MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishnab87635f9-d298-4cd3-9ce7-c14dfaed35d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishnab87635f9-d298-4cd3-9ce7-c14dfaed35d1-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ క్రిష్ణ అని అంటారు. ఇది ఈ రోజు ముచ్చట కాదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన్ని ఆలాగే పిలుస్తారు. క్రిష్ణను ఈ బిరుదు అచ్చుగుద్దినట్లుగా సరిపోయిందని కూడా చెప్పాలి. ఆయన ఎన్నో సాహసాలు చేశారు. ఏటికి ఎదురీది సినిమాలు నిర్మించారు. krishna{#}Tollywoodక్రిష్ణ సూపర్ స్టార్ బిరుదు వెనక... ?క్రిష్ణ సూపర్ స్టార్ బిరుదు వెనక... ?krishna{#}TollywoodSat, 14 Aug 2021 20:00:00 GMTసూపర్ స్టార్ క్రిష్ణ అని అంటారు. ఇది ఈ రోజు ముచ్చట కాదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన్ని ఆలాగే పిలుస్తారు. క్రిష్ణను ఈ బిరుదు అచ్చుగుద్దినట్లుగా సరిపోయిందని కూడా చెప్పాలి. ఆయన ఎన్నో సాహసాలు చేశారు. ఏటికి ఎదురీది సినిమాలు నిర్మించారు.

క్రిష్ణకు అంతకు ముందు హీరో అన్న ట్యాగ్ ఉండేది. ఆయన‌తో పాటు చాలా మంది హీరోలు అప్పట్లో  ఉండేవారు. అయినా కూడా క్రిష్ణ ప్రస్థావన వస్తే చాలు హీరో అని ముందు తగిలించేవారు. ఒక విధంగా అదో వైభోగం ఆయనకు. అది అలా ఉంటూండగానే సూపర్ స్టార్ బిరుదు వచ్చింది. దీని కోసం క్రిష్ణ చాలా గట్టిగానే  పోటీ పడ్డారు. ఎవరితోనో కాదు, టాలీవుడ్ లో తాను మొదటి నుంచి పోటీ పడిన పెద్దాయన ఎన్టీయార్ తోనే. అప్పట్లో జ్యోతీ చిత్ర అనే సినీ వారపత్రిక  సూపర్ స్టార్ బిరుదుని ప్రకటించింది. దాని కోసం ఓటింగును కూడా నిర్వహించింది. ఎన్టీయార్ క్రిష్ణ, అక్కినేని శోభన్ బాబు ఇలా చాలా మంది పోటీ పడితే ఎన్టీయార్ తొలిసారి గెలిచారు. ఆ తరువాత స్థానం క్రిష్ణదే.

ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక మరుసటి ఏడాది కూడా సూపర్ స్టార్ బిరుదు కోసం జ్యోతీచిత్ర పోటీ పెట్టింది. అపుడు మిగిలిన హీరోలతో పోటీ పడి క్రిష్ణ ఆ బిరుదుని సొంతం చేసుకున్నారు. క్రిష్ణను 80 దశకంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన ఏడాదికి పన్నెండు నుంచి పద్నాలుగు సినిమాల దాకా చేసేవారు. దాంతో ఆయనకు మాస్ ఇమేజ్ కూడా ఉండేది. దాంతో చాలా సునాయాసంగా ఆయన ఈ బిరుదుని దక్కించుకున్నారు. ఆ తరువాత ఆ సినిమా పత్రిక మళ్ళీ పోటీ పెట్టలేదు. దాంతో క్రిష్ణ శాశ్వతంగా సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో నిలిచిపోయారు. ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న మహేష్ బాబుని కూడా అభిమానులు సూపర్ స్టార్ అనే పిలుచుకుంటారు.





'పుష్ప' పార్ట్ - 1 లో ఆ సీన్స్ హైలైట్ అట  .... ??

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>