MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa626d57e4-4d8c-408a-8c81-618d90274ee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa626d57e4-4d8c-408a-8c81-618d90274ee8-415x250-IndiaHerald.jpgఅంతకముందు రెండేళ్లుగా ఆశించిన స్థాయి విజయాలు దక్కించుకోలేకపోయిన మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఒక్కసారిగా గత ఏడాది త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా మంచి ట్రాక్ లోకి వచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ సంస్థలు గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించాయి. విడుదల తరువాత భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ జాతీయ స్థాయిలో allu arjun{#}Ala Vaikunthapurramloo;devi sri prasad;Master;you tube;trivikram srinivas;Mass;Yuva;Christmas;Allu Arjun;rashmika mandanna;India;Pooja Hegde;Cinema;Hero;Successఅల తో అలా కొట్టాడు .... మరి పుష్ప తో ఎలా కొడతాడో .....??అల తో అలా కొట్టాడు .... మరి పుష్ప తో ఎలా కొడతాడో .....??allu arjun{#}Ala Vaikunthapurramloo;devi sri prasad;Master;you tube;trivikram srinivas;Mass;Yuva;Christmas;Allu Arjun;rashmika mandanna;India;Pooja Hegde;Cinema;Hero;SuccessSat, 14 Aug 2021 17:20:00 GMTహీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఒక్కసారిగా గత ఏడాది త్రివిక్రమ్ తీసిన అలవైకుంఠపురములో సినిమాతో భారీ సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా మంచి ట్రాక్ లోకి వచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రముఖ సంస్థలు గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించాయి. విడుదల తరువాత భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ జాతీయ స్థాయిలో బాగా గుర్తింపు ని దక్కించుకున్నాయి.

ఇక యూట్యూబ్ లో ఈ మూవీ సాంగ్స్ వందల మిలియన్స్ వ్యూస్ అందుకోవడం విశేషం గా  చెప్పుకోవాలి. ఇక ఆ సినిమాతో హీరోగా విశేషమైన క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ తీస్తున్న ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగె భారీ యాక్షన్ తో కూడిన మాస్ మూవీగా తెరకెక్కుతోంది. యువ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి బాగా రెస్పాన్స్ రాగా, రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన దాక్కో దాక్కో మేక లిరికల్ సాంగ్ కి మిశ్రమంగా స్పందన లభిస్తోంది. మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీ గ రూపొందుతున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుండగా దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో విపరీతంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. మరోవైపు సినిమా అద్భుత్భంగా తెరకెక్కుతోందని, తప్పకుండా సూపర్ హిట్ కొడతాం అని పుష్ప టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, ఫైనల్ గా మాత్రం క్రిస్మస్ కి విడుదల కానున్న పుష్ప పార్ట్ 1 చూసిన తరువాత నే ఇది ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందనేది చెప్పగలం అంటున్నారు సాధారణ ప్రేక్షకులు. మరి అల మాదిరిగా అల్లు అర్జున్ పుష్ప తో మరొక సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి ... .!!





ఆ టీడీపీ నేతకు బాబు మార్క్ షాక్....సైకిల్ సెట్ అవుతుందా?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>