PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nadendla-manohar-pawan-kalyanc1a2ef6c-8725-43d5-9d28-91b6f4bb5ac4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nadendla-manohar-pawan-kalyanc1a2ef6c-8725-43d5-9d28-91b6f4bb5ac4-415x250-IndiaHerald.jpgఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీగా ఉంటే నాదెండ్ల మాత్రం జనంలోకి మెల్లగా వస్తున్నారు. ఆయన ఇపుడు వైసీపీ సర్కార్ మీద ఒక రేంజిలో కామెంట్స్ చేస్తున్నారు. జనసేన నుంచి పవన్ పలుకే బంగారం అయిన వేళ మనోహర్ పెద్ద నోరు చేసుకుంటున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలలో అధినేతలదే సర్వాధికారం. వారు మాట్లాడితేనే వార్త. వారు చెప్పిందే శాసనం. అలా కాకపోతే ఏం జరుగుతుంది అన్నది ఎన్టీయార్ నాదెండ్ల ఎపిసోడ్ గుర్తు చేస్తుంది. అయితే అన్నీ అలాగే జరగాలని ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక పోలిక అయితే ఉంది. నాడు ఎన్టీయార్, నేడు పవన్ ఇద్దరూ nadendla manohar pawan kalyan{#}Makeup;Chakram;Nadendla Bhaskara Rao;Nadendla Manohar;Janasena;Press;Episode;Jr NTR;TDP;NTR;YCP;Jagan;gold;Party;kalyan;CM;Telangana Chief Minister;mediaస్టీరింగ్ తిప్పేస్తున్న నాదెండ్ల... తేడా కొడుతోందిగా...!స్టీరింగ్ తిప్పేస్తున్న నాదెండ్ల... తేడా కొడుతోందిగా...!nadendla manohar pawan kalyan{#}Makeup;Chakram;Nadendla Bhaskara Rao;Nadendla Manohar;Janasena;Press;Episode;Jr NTR;TDP;NTR;YCP;Jagan;gold;Party;kalyan;CM;Telangana Chief Minister;mediaSat, 14 Aug 2021 17:30:00 GMTచాలా మంది ఈనాటి తరానికి తెలియక పోయినా ఏపీలో తొలి వెన్నుపోటు ఎన్టీయార్ కి జరిగింది సరిగ్గా 1984 ఆగస్ట్ నెలలో. ఎన్టీయార్ పైలెట్ అయితే తాను కో పైలెట్ అని నాడు నాదెండ్ల భాస్కరరావు చెప్పుకునేవారు. అప్పట్లో ఎన్టీయార్ అనారోగ్య సమస్యల మీద విదేశాలకు వెళ్ళడంతో నాదెండ్ల ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిపోయారు. ఎన్టీయార్ స్వదేశం తిరిగి వస్తూనే ఈ ఘటన జరిగింది. దాంతో ఎన్టీయార్ నెల రోజుల పాటు ఆంధ్ర దేశం అంతా తిరిగారు. మళ్ళీ సీఎం సీటు దక్కించుకున్నారు. సరే ఇదంతా ఎందుకు అంటే ఇపుడు ఆయన కుమారుడు జూనియర్ నాదెండ్ల కూడా ఒక సినీ నటుడి పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేనకు ఇపుడు నాదెండ్ల కో పైలెట్  నాదెండ్ల మనోహర్ ఉంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీగా ఉంటే నాదెండ్ల మాత్రం జనంలోకి మెల్లగా వస్తున్నారు. ఆయన ఇపుడు వైసీపీ సర్కార్ మీద ఒక రేంజిలో కామెంట్స్ చేస్తున్నారు. జనసేన నుంచి పవన్ పలుకే బంగారం అయిన వేళ మనోహర్ పెద్ద నోరు చేసుకుంటున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలలో అధినేతలదే సర్వాధికారం. వారు మాట్లాడితేనే వార్త. వారు చెప్పిందే శాసనం. అలా కాకపోతే ఏం జరుగుతుంది అన్నది ఎన్టీయార్ నాదెండ్ల ఎపిసోడ్  గుర్తు చేస్తుంది. అయితే అన్నీ అలాగే జరగాలని ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక పోలిక అయితే ఉంది.

నాడు ఎన్టీయార్, నేడు పవన్ ఇద్దరూ ప్రముఖ  సినీ నటులే. అదే సమయంలో నాడు భాస్కరరావు టీడీపీలో చక్రం తిప్పితే ఇపుడు జనసేనలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు ఆయన కుమారుడు మనోహర్. ఇక వైసీపీ మీద గతంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ విరుచుకుపడేవారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ముఖానికి మేకప్ వేసుకుని మళ్ళీ సినిమాల్లో నటించడానికి వెళ్లారో నాటి నుంచి ప్రెస్ మీట్లు పోయాయి. ప్రెస్ నోట్లు ఆ ప్లేస్ లో వచ్చాయి. ఇటీవల కాలంలో ఆ ప్రెస్ నోట్లు కూడా కరవు అయ్యాయి. దాంతో మనోహర్ రంగంలోకి దిగారనుకోవాలి. ఆయన టీడీపీ మాదిరిగానే జగన్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన గొంతు కూడా అచ్చం టీడీపీ లాగానే ఉండడంటో ఆ పార్టీ అనుకూల మీడియా కూడా బాగానే ఫోకస్ చేస్తోంది అంటున్నారు. ఇక్కడ ఒక సందేహం అందరికీ వస్తోంది.

పవన్ తనకు మారుగా మనోహర్ ని ఇలా రాజకీయంగా యాక్టివ్ కావాలని ప్రోత్సహించారా లేక మనొహరే తన రాజకీయ అనుభవాన్ని రంగరించి జగన్ సర్కార్ మీద దాడి చేస్తున్నారా అన్నది అయితే అందరిలో చర్చగా ఉంది. పవన్ మనోహర్ ని జనసేన తరఫున జనంలో ఉంచినా తప్పులేదు. ఎందుకంటే ఆయన సినిమాల్లో బిజీ కాబట్టి. కానీ రాజకీయాల్లో మరీ అంత అతి నమ్మకం కూడా పనికిరాదు అన్న వారూ ఉన్నారు. మొత్తానికి పవన్ పని విభజన చేసుకుంటూ తాను సినిమాల్లో మనోహర్ రాజకీయాల్లో అన్నట్లుగా చేసుకున్న ఏర్పాటు అయితే బాగానే ఉంది. హిట్ అయితే ఇద్దరికీ లాభమే. కానీ తేడా వస్తేనే ఇబ్బంది అంటున్నారు అంతా.





దళిత బంధు ఫస్ట్ లిస్ట్ ఫైనల్ ?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>