• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Girlfriend: ప్రియురాలితో నిశ్చితార్థం, పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కాపురం, సూపర్ ఫిగర్ చిక్కిందని, దెబ్బకు !

|

అహమ్మదాబాద్: పరిచయం అయిన యువతికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెతో కొంతకాలం జల్సా చేశాడు. ప్రేమించిన యువతిని వివాహం చేసుకుంటానని యువకుడు సినిమా స్టోరీ చెప్పాడు. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న యువకుడు భర్త అవుతున్నాడని ఆ యువతి మురిసిపోయింది. పెళ్లికి యువతి, యువకుడు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 నెలల క్రితం యువతి, యువకుడికి నిశ్చితార్థం జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత పెళ్లి చేద్దామని ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ఇదే సమయంలో గత ఆరు నెలల నుంచి అమ్మాయి ఇంటిలో ఉంటున్న యువకుడు అమ్మాయితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. కాబోయే అల్లుడే కదా అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు ఏమీమాట్లాడకుండా ఉండిపోయారు. మా ఇంట్లో చిన్న సమస్య ఉందని వాటిని పరిష్కరించుకోవాలని చెప్పిన యువకుడు ప్రియురాలి ఇంటి నుంచి జంప్ అయ్యాడు. ప్రియురాలికి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు ఆమె కంటే అందంగా, మంచి సౌండ్ పార్టీ అమ్మాయి చిక్కడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తనతో ఇంతకాలం ఎంజాయ్ చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేుకుంటావా అంటూ ఏకంగా రేప్ కేసు పెట్టి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో పోటుగాడి పరిస్థితి తల్లకిందులై లబోదిబో అంటున్నాడు.

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !

 ఏడాది క్రితం ఏం జరిగిందంటే ?

ఏడాది క్రితం ఏం జరిగిందంటే ?

గుజరాత్ లోని అహమ్మదాబాద్ జిల్లాలోని చంగూడర్ ప్రాంతంలో 28 సంవత్సరాల వయసు ఉన్న రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అహమ్మదాబాద్ జిల్లాలోని సనంద్ ప్రాంతంలో రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. సంవత్సరం క్రితం మోరియా ప్రాంతంలోని ఆటో మొబైల్స్ తయారు చేసే కంపెనీలో రాకేష్, రూపాకు పరిచయం అయ్యింది.

 ప్రేమలో పడిన యువతి

ప్రేమలో పడిన యువతి

కొంతకాలం క్రితం పరిచయం అయిన రూపాతో రాకేష్ అమాయకుడిలా తిరిగాడు. తరువాత రూపాకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన రాకేష్ ఆమెను లొంగదీసుకుని ఆమెతో కొంతకాలం జల్సా చేశాడు. ప్రేమించిన యువతి రూపాను వివాహం చేసుకుంటానని రాకేష్ సినిమా స్టోరీ చెప్పాడు. తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న రాకేష్ తనకు భర్త అవుతున్నాడని రూపా మురిసిపోయింది.

 ప్రియురాలి ఇంట్లోనే మకాం

ప్రియురాలి ఇంట్లోనే మకాం

పెళ్లికి రూపా, రాకేష్ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన రూపా, రాకేష్ ల నిశ్చితార్థం జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిన తరువాత రూపా, రాకేష్ లకు పెళ్లి చేద్దామని ఇరు వైపుల కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇదే సమయంలో గత ఆరు నెలల నుంచి రూపా ఇంటిలో ఉంటున్న రాకేష్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. రాకేష్ కాబోయే అల్లుడే కదా అంటూ రూపా కుటుంబ సభ్యులు ఏమీమాట్లాడకుండా ఉండిపోయారు.

 సూపర్ ఫిగర్ చిక్కిందని కేటుగాడు ఎస్కేప్

సూపర్ ఫిగర్ చిక్కిందని కేటుగాడు ఎస్కేప్

మా ఇంట్లో చిన్న సమస్య ఉందని వాటిని పరిష్కరించుకోవాలని చెప్పిన రాకేష్ ప్రియురాలు రూపా ఇంటి నుంచి జంప్ అయ్యాడు. ప్రియురాలు రూపాకు హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు రాకేష్ ఆమె కంటే అందంగా, మంచి సౌండ్ పార్టీ అమ్మాయి చిక్కడంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. వేరే అమ్మాయితో రాకేష్ పెళ్లి ఏర్పాట్లు చేసుకుని బిజీ అయిపోయాడు.

 దెబ్బకు మైండ్ బ్లాక్

దెబ్బకు మైండ్ బ్లాక్

ప్రియుడు రాకేష్ వేరే పెళ్లి చేసుకుంటున్నాడని విషయం తెలుసుకున్న రూపా ఇంతకాలం తనతో ఎంజాయ్ చేసి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేుకుంటావా అంటూ ప్రియుడిని నిలదీసింది, మనం విడిపోదామని, నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకో, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాకేష్ రివర్స్ అయ్యాడు. ప్రియుడు ఎంత చెప్పినా మాట వినకపోవడంతో రూపా ఏకంగా తన మీద రాకేష్ అత్యాచారం చేశాడని, అతనికి కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తున్నారని కేసు పెట్టింది. రాకేష్ మీద కేసు పెట్టిన రూపా విషం సేవించి ఆత్మహత్యాయత్నం చెయ్యడంతో ఈదెబ్బకు పోటుగాడు రాకేష్ పరిస్థితి తల్లకిందులైంది. రూపాను ఆసుపత్రికి తరలించిన పోలీసులు రాకేష్ కోసం గాలిస్తున్నారు.

English summary
Girlfriend: Woman registers rape complaint breach of trust against her fiance in Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X