MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna48c5789f-459a-44fb-9e8b-1155c034fad7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna48c5789f-459a-44fb-9e8b-1155c034fad7-415x250-IndiaHerald.jpg50 ప‌దుల వ‌య‌స్సు దాటిన యువ‌కుడిగా క‌న‌బ‌డుతూ అమ్మాయిల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన మ‌న్మ‌ధుడు అక్కినేని నాగార్జున‌. ` బంగార్రాజు ` సినిమా ప్రాజెక్ట్ రెండేళ్లుగా వార్త‌ల్లో నానుతూనే ఉంది. క‌ళ్యాణ్ కృష్ణ బౌండ్ స్క్రిప్టు రెడీ చేసి ఇన్ని రోజులుగా కింగ్ నాగార్జున కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇన్ని రోజుల త‌రువాత ప్రాజెక్టుకు సంబంధించి ఉత్కంఠ‌కు ముగింపు ప‌లికింది. వ‌చ్చే వారం నుండి సినిమా నిర్మాణం ప్రారంభం కానుంది. 2016 లో వ‌చ్చిన ` సోగ్గాడే చిన్ని నాయ‌నా ` బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. దీనికి ప్రీక్వెల్ గnagarjuna{#}Soggade Chinni Nayana;Akkineni Nagarjuna;festival;Music;king;King;naga;Chitram;rahul;Rahul Sipligunj;Bigboss;Hanu Raghavapudi;krishna;kalyan;Director;Cinemaఆ ప్రాజెక్ట్ పైనే నాగార్జున ఆశ‌ల‌న్ని..?ఆ ప్రాజెక్ట్ పైనే నాగార్జున ఆశ‌ల‌న్ని..?nagarjuna{#}Soggade Chinni Nayana;Akkineni Nagarjuna;festival;Music;king;King;naga;Chitram;rahul;Rahul Sipligunj;Bigboss;Hanu Raghavapudi;krishna;kalyan;Director;CinemaSat, 14 Aug 2021 14:40:00 GMT 50 ప‌దుల వ‌య‌స్సు దాటిన యువ‌కుడిగా క‌న‌బ‌డుతూ అమ్మాయిల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన మ‌న్మ‌ధుడు అక్కినేని నాగార్జున‌. ` బంగార్రాజు ` సినిమా ప్రాజెక్ట్ రెండేళ్లుగా వార్త‌ల్లో నానుతూనే ఉంది. క‌ళ్యాణ్ కృష్ణ బౌండ్ స్క్రిప్టు రెడీ చేసి ఇన్ని రోజులుగా కింగ్ నాగార్జున కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇన్ని రోజుల త‌రువాత ప్రాజెక్టుకు సంబంధించి ఉత్కంఠ‌కు ముగింపు ప‌లికింది. వ‌చ్చే వారం నుండి సినిమా నిర్మాణం ప్రారంభం కానుంది. 2016 లో వ‌చ్చిన ` సోగ్గాడే చిన్ని నాయ‌నా ` బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. దీనికి ప్రీక్వెల్ గా ` బంగార్రాజు ` సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.


  నాగార్జున ఇటీవ‌ల కొంత‌కాలంగా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 2019 లో నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా వ‌చ్చిన సినిమా ` మ‌న్మ‌ధుడు 2 ` బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాకు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆ త‌రువాత అహిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన వైల్ట్‌డాగ్  అనుకున్న స‌మీక్ష‌లు రాబ‌ట్టినా క‌రోనా కార‌ణంగా అనుకున్నంత స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌సూలు చేయ‌లేక‌పోయింది. దీంతో ` బంగ‌ర్రాజు ` ప్రాజెక్ట్ పైనే నాగార్జున ఆశ‌లు పెట్టుకున్నాడ‌ట‌.

 అయితే, ప్రీక్వెల్ క‌థ‌లో రూపొందుతుండ‌డంతో `బంగార్రాజు` ఊహాగానాలు  తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ సారి బ‌డ్జెట్ ప‌రంగా ఎలాంటి రాజీ లేకుండా మంచి ప్రొడ‌క్ట్ ఇవ్వాల‌ని త‌పిస్తున్నార‌ట నాగార్జున‌. ` సోగ్గాడే చిన్ని నాయనా `  భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రీక్వెల్ తోనూ హిట్టు కొట్టాలన్న పంతంలో ఉన్నాడు కింగ్‌. నిర్మాణ విలువల విషయంలో అసలు రాజీ కి రావడం లేద‌ని తెలుస్తోంది నాగార్జున‌.  

కళ్యాణ్ కృష్ణకు క్రియేటివ్ ఫ్రీడమ్ ను ఇచ్చిన నాగార్జున‌ అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పర్యవేక్షణలో భారీ సెట్ నిర్మిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో నాగ చైత‌న్య క‌నిపించ‌నుండ‌డంతో అక్కినేని అభిమానుల‌కు పండుగ కానుంది. నాగ చైత‌న్య‌కు జంటగా కృతి శెట్టి న‌టించ‌నుంది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గ‌జ్జ‌ర్ కూ ` బంగార్రాజు` చిత్రం న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకు నూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఈ `బంగార్రాజు` నాగార్జున పాలిట బంగారంగా మారుతుందో లేదో అన్న విషయాన్ని వేచి చూడాల్సిందే.


 



ఇండియాను పొగుడుతూనే.. మోడీకి వార్నింగ్ ఇచ్చిన తాలిబన్లు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>