PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pandragustu392c3d3d-1fa9-44cd-9da1-5a22a222a309-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pandragustu392c3d3d-1fa9-44cd-9da1-5a22a222a309-415x250-IndiaHerald.jpgభరత భూమి.. ధన్వంతరి పుట్టిన నేల.. శుశ్రూతుడు వంటి వైద్యశిఖామణులు నడయాడిన నేల.. వేదాల్లోనే ఓ వేదం వైద్యానికి సంబంధించిన సంస్కృతి మనది. క్రీస్తు పూర్వమే సర్జరీలు చేసిన ఘన చరిత్ర ఉంది. అలాంటి నేపథ్యం ఉన్నా.. స్వతంత్ర్య భారతావనిలో అందరికీ వైద్యం అందని పండే అవుతోంది. అందరికీ వైద్యం అని పాలకులు చెబుతూనే ఉన్నారు.. ఉచిత వైద్యం అంటూ ఊరిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వ వైద్యం ఏ స్థాయిలో ఉందో చూస్తే గుండె చెరువుకాక మానదు.. ఇప్పటికీ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట పాడుకోవాల్సిందే. 130 కోట్లపైబడిPANDRAGUSTU{#}history;Culture;Arogyasri;Population;Heart;Telangana;Telugu75వ పంద్రాగస్టు: ధన్వంతరి పుట్టిన నేలన.. వైద్యానికి ఇంకా కటకట..!75వ పంద్రాగస్టు: ధన్వంతరి పుట్టిన నేలన.. వైద్యానికి ఇంకా కటకట..!PANDRAGUSTU{#}history;Culture;Arogyasri;Population;Heart;Telangana;TeluguSat, 14 Aug 2021 10:00:00 GMTభరత భూమి.. ధన్వంతరి పుట్టిన నేల.. శుశ్రూతుడు వంటి వైద్యశిఖామణులు నడయాడిన నేల.. వేదాల్లోనే ఓ వేదం వైద్యానికి సంబంధించిన సంస్కృతి మనది. క్రీస్తు పూర్వమే సర్జరీలు చేసిన ఘన చరిత్ర ఉంది. అలాంటి నేపథ్యం ఉన్నా.. స్వతంత్ర్య భారతావనిలో అందరికీ వైద్యం అందని పండే అవుతోంది. అందరికీ వైద్యం అని పాలకులు చెబుతూనే ఉన్నారు.. ఉచిత వైద్యం అంటూ ఊరిస్తూనే  ఉన్నారు. కానీ ప్రభుత్వ వైద్యం ఏ స్థాయిలో ఉందో చూస్తే గుండె చెరువుకాక మానదు.. ఇప్పటికీ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాట పాడుకోవాల్సిందే.


130 కోట్లపైబడిన జనాభా ఉన్న దేశంలో వైద్య భరోసా మాత్రం లేదు. ఏదైనా ఒక్క మహమ్మారి సోకిందంటే అప్పటివరకూ సంపాదించిన సొమ్మంతా ప్రాణాలు కాపాడుకోవడానికే సరి.. తెలుగు  రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి చికిత్సలు అందుతున్నా అది పేద వర్గాలకే.. దిగువ మధ్యతరగతికి ఇంకా ఆరోగ్య భరోసా లేనేలేదు.. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా దారుణం.. సాధారణ పౌరుడికి అందాల్సిన మౌలిక సదుపాయాల్లో  విద్య, వైద్యం ప్రాధాన్యమైనవి.


ప్రభుత్వానే పూనుకుని పౌరులకు వైద్య బీమా అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విదేశాల్లో వైద్యబీమా అందరికీ ఉంటోంది. ప్రభుత్వాలు తమ సొంత ఖర్చుతో ఇలాంటి వైద్య బీమా అందిస్తేనే సామాన్యుడికి సైతం ఆరోగ్య ధీమా దక్కేది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతున్నామని చెబుతున్నా.. జనం అనారోగ్యంతో ఈసురోమని ఉంటే.. ఇంకా దేశమేగతి బాగుపడుతుందన్న ఆందోళన నెలకొంది.  


ఇక మారుమూల ప్రాంతాల్లో గిరిజనుల వైద్య అవస్థలు చెప్పనలవి కాదు.. ఇప్పటికీ రోగం వస్తే డోలీల్లో రోగులను తరలించాల్సిన దుస్థితి.. సర్కారు దవాఖానాలను బలోపేతం చేయడం.. వైద్య బీమా కల్పించడం ఇప్పుడు ఇండియాలో యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు. విద్య, వైద్యం అందించకుండా ఏ దేశం కూడా ఆరోగ్యకరమైన జాతిగా ఎదగజాలదన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.





ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్న చందమామ కాజల్!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>