PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/plastic-effect-on-children1f9a2be1-36a4-40d3-b21d-f1c63a80a43c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/plastic-effect-on-children1f9a2be1-36a4-40d3-b21d-f1c63a80a43c-415x250-IndiaHerald.jpgమన జీవితంలో కొన్ని వస్తువులు మనకు హని కలిగిస్తాయని తెలిసినా వాటి వాడకానికి మనము బాగా అలవాటుపడిపోయాము. అందులో ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైనది. మానవుని జీవిత మనుగడకు ఇది ఎన్నో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ విషయంపై గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ప్లాస్టిక్ ను రద్దు చేసినా ప్రజలు ఎవ్వరూ కూడా పూర్తి స్థాయిలో దీనిని నిసేధించలేకపోయారు. PLASTIC EFFECT ON CHILDREN{#}jeevitha rajaseskhar;Brazil;Czech Republic;Cycle;Father;central government;Cancer;Doctor;Director;pollution;Governmentపిల్ల‌లూ... ప్లాస్టిక్ బూచీ అదిగోపిల్ల‌లూ... ప్లాస్టిక్ బూచీ అదిగోPLASTIC EFFECT ON CHILDREN{#}jeevitha rajaseskhar;Brazil;Czech Republic;Cycle;Father;central government;Cancer;Doctor;Director;pollution;GovernmentSat, 14 Aug 2021 09:00:00 GMTమన జీవితంలో కొన్ని వస్తువులు మనకు హని కలిగిస్తాయని తెలిసినా వాటి వాడకానికి మనము బాగా అలవాటుపడిపోయాము. అందులో ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైనది. మానవుని జీవిత మనుగడకు ఇది ఎన్నో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఈ విషయంపై గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ప్లాస్టిక్ ను రద్దు చేసినా ప్రజలు ఎవ్వరూ కూడా పూర్తి స్థాయిలో దీనిని నిసేధించలేకపోయారు. మరోసారి కేంద్ర ప్రభుత్వం నిన్న దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ను నిషేధించింది. ఇది నిన్నటి నుండే అమలులోకి వచ్చింది. ఈ ప్లాస్టిక్ వాడకం కారణంగా వాతావరణం, సకల జీవరాశికి ఇది ఎంతో చేటును కలిగిస్తోంది. అమ్మ కడుపులో పెరిగే పిండం నుండి ఆడుతూ పడుతూ తిరిగే చిన్న పిల్లలు ఆరోగ్యం సైతం దెబ్బ తింటోందని ప్లాస్టిక్ పొల్యూషన్ కమిటీ మేనేజింగ్ డైరెక్టర్ జూలియా కోహెన్ ఆధ్వర్యంలో చైల్డ్ అండ్ కన్స్యుమారిజం వారు నిర్వహించిన వెబినార్ లో ఈ విషయాలను వివరించారు.అంతే కాకుండా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ప్లాస్టిక్ మరియు విషపదార్థాలు నిపుణుడు కరోలినా బ్రకోవా ప్లాస్టిక్ పిల్లలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుందని, అలాగే పిల్లల యొక్క జీవిత కాలాన్ని ఇది తగ్గిస్తుందని తెలిపారు. పిల్లలు పుట్టక మునుపు కూడా ప్లాస్టిక్ ప్రభావం ఉంటుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పిల్లలపై ఎందుకు ఇంతటి ప్రభావాన్ని చూపుతుంది అంటే, పిల్లలు పుట్టిన నుండి ఒక వయసు వచ్చే వరకు వారు ఆడుకునే అన్ని వస్తువులు ప్లాస్టిక్ తోనే తయారుచేయబడి ఉంటాయి. వీరు ఆడుకునే వస్తువులలో 90% బొమ్మలు ప్లాస్టిక్ తోనే చేయబడి ఉన్నాయని డాక్టర్ వెనియా జుయిన్ తెలిపారు. ఈ ప్లాస్టిక్ లో అతి ప్రమాదకరమైన పాలివినైల్ క్లోరైడ్ నుండి థాలెట్స్ అనే విషపదార్ధం కలిసి ఉంటుంది. ఈ థాలెట్స్ వలన పిల్లలలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమవుతుంది అని తెలిపారు.
ప్రపంచంలోనే బ్రెజిల్ లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ బొమ్మలను తయారు చేస్తున్నది. ఇలా తయారు చేసిన బొమ్మలు అన్నీ వివిధ ప్రాంతాలకు పంపబడుతాయి. పిల్లలు ఈ ప్లాస్టిక్ ఆట వస్తువులతో ఆడుకున్న తర్వాత వీటిని ఎక్కడో ఇంటిలో మూలన పడేస్తారు. ఇవి ఎప్పటికీ పాడయిపోవు... ఇవి భూమిలో పూడ్చినా సరే...కరగవు. అంతే కాకుండా వీటిని రీ సైకిల్ చేయడానికి వీలు పడదు. వీటి వల్ల విడుదలయ్యే టాక్సిన్స్ పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా సకల జీవరాశికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని మన నుండి తరిమి కొడదాము. పుట్టని పిల్లలని సైతం చిధిమేస్తున్న ప్లాస్టిక్ ను మన జీవితాల నుండి దూరం చేయాల్సిన బాధ్యత ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరిది. నేటి పిల్లలే రేపటి పౌరులు. ప్లాస్టిక్ ద్వారా అంతమవుతున్న మన రేపటి పౌరులను మనము కాపాడుకుందాం. ప్రతి తల్లి మరియు తండ్రి మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ ఆట వస్తువులను వారికి కొనివ్వకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటే ప్రపంచమంతా మార్పు వస్తుంది. మార్పు ఒక్కరితోనే మొదలవుతుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని గౌరవించి మనల్ని మనము కాపాడుకుందాము.




టీకా వేయించుకుంటేనే ఆ రాష్ట్రంలోకి ప్ర‌వేశం..!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>