PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf05c43e9-901f-48a6-bbeb-a1d8a6e8b7fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganf05c43e9-901f-48a6-bbeb-a1d8a6e8b7fd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు మామూలుగా పేలడం లేదు. మామూలుగా వెటకారం అంటే గుర్తుకు వచ్చేది గోదారోళ్లు మాత్రమే. కానీ సోషల్ మీడియా, త్రివిక్రమ్ సినిమాల పుణ్యమా అని... అన్ని ప్రాంతాలకు ఈ వెటకారం పాకేసింది. ఇక రాజకీయ పార్టీల అభిమానులైతే.. అబ్బో... సోషల్ లో తమ వైరి పార్టీల నేతలపై ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు. ఏదైనా ఓ టాపిక్ కొత్తగా దొరికితే చాలు... ఇక పండగే మరి. Jagan Tours{#}Vijayawada;Telangana Chief Minister;Assembly;MLA;TDP;Jagan;Governor;CM;trivikram srinivas;YCP;Telugu Desam Party;Andhra Pradeshఅన్నొస్తున్నాడంటూ టీడీపీ సెటైర్లు... బీ అలర్ట్ అంటున్న వైసీపీఅన్నొస్తున్నాడంటూ టీడీపీ సెటైర్లు... బీ అలర్ట్ అంటున్న వైసీపీJagan Tours{#}Vijayawada;Telangana Chief Minister;Assembly;MLA;TDP;Jagan;Governor;CM;trivikram srinivas;YCP;Telugu Desam Party;Andhra PradeshSat, 14 Aug 2021 08:52:53 GMTప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు మామూలుగా పేలడం లేదు. మామూలుగా వెటకారం అంటే గుర్తుకు వచ్చేది గోదారోళ్లు మాత్రమే. కానీ సోషల్ మీడియా, త్రివిక్రమ్ సినిమాల పుణ్యమా అని... అన్ని ప్రాంతాలకు ఈ వెటకారం పాకేసింది. ఇక రాజకీయ పార్టీల అభిమానులైతే.. అబ్బో... సోషల్ లో తమ వైరి పార్టీల నేతలపై ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు. ఏదైనా ఓ టాపిక్ కొత్తగా దొరికితే చాలు... ఇక పండగే మరి.

ఇప్పుడు ఇలాంటి టాపిక్ ఒకటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలకు దొరికింది. ఇంకేముంది... చెలరేగిపోతున్నారు కూడా. అధికారంలోకి రాకముందు పాదయాత్రతో నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండున్నరేళ్లలో వైఎస్ జగన్ బయటకు వచ్చిన సందర్భాలు ఎన్ని అంటే మాత్రం ఖచ్చితంగా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. తాడేపల్లిలోని ఆయన అధికారిక నివాసానికే జగన్ పరిమితం అయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ప్రారంభోత్సవానికో... లేక అసెంబ్లీ సమావేశాలకో తప్ప... రాష్ట్ర సెక్రటెరియేట్ కు కూడా వచ్చింది తక్కువే. మంత్రివర్గ సమావేశాలప్పుడు తప్ప... జగన్ పెద్దగా బయటకు వచ్చింది లేదు.

అయితే ప్రస్తుతం జగన్ వరుసగా పర్యటనలు చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే ఈ నెలలోనే ఇప్పటికే రెండు సార్లు బయటకు వచ్చారు జగన్. మరో పర్యటన కూడా రెడీగా ఉంది. ఈ నెల 5న నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్... రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు రోజే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఈ రోజు భీమవరంలో జగన్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యే ఫుష్పాల వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. సాయంత్రానికి ఇంటి తిరిగి వస్తారు. మళ్లీ రేపు ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రస్తుతం జగన్ వరుస పర్యటనల గురించి టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తెగ జోకులు పేలుస్తున్నారు. బాబోయ్ జగనన్న బయటకు వస్తున్నాడని కొందరంటుంటే... ఏం జరుగుతుందో చూడాలంటూ మరికొందరు ట్యాగ్ చేస్తున్నారు. అన్న వస్తున్నాడు.. అంతా అలర్ట్ అంటూ మరికొందరు మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ కామెంట్లతో అదరగొట్టేస్తున్నారు. అటు వైసీపీ అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. కరోనాతో పాటు, భద్రతా కారణాల దృష్ట్యా ఇన్ని రోజులు బయటకు రాలేదని... ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారంటే... సాధారణ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని... అందుకే బయటకు రావటం లేదంటున్నారు. మరికొందరైతే... ప్రచారం కోసమైతేనే బయటకు రావాలి కానీ... పని చేసే వారు బజార్లలో ఎందుకు తిరుగుతారు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా... జగన్ వరుస పర్యటనలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాయి మరి.





ఐటమ్ సాంగ్ చేస్తున్న కృతి శెట్టి..!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>