SignaturesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/75-th-pandragast3e474832-b33d-4524-86b7-cfe65d817bd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/75-th-pandragast3e474832-b33d-4524-86b7-cfe65d817bd3-415x250-IndiaHerald.jpg కురుస్తున్న వ‌ర్షం.. విరిగిన మంచం.. ఆ మంచం పైనే నిద్రిస్తున్న మొత్తం కుటుంబ స‌భ్యులు వారితో పాటు పెంపుడు జంతువులు..వారి ముఖాల్లో కొట్టొచ్చినట్టు క‌నిపిస్తున్న ఆనందం..! అస‌లైన ఆనందం అంటే ఏంట‌ని అడిగిన స్నేహితుడి కోసం ఓ వ్య‌క్తి చెప్పిన నిర్వ‌చ‌నం ఇది. ప్ర‌పంచానికి వ‌సుదైక కుటుంబ‌కం అని ప‌రిచ‌యం చేసిన దేశం మ‌న‌ది. ప్ర‌పంచం మొత్తం త‌న కుటుంబం అని భావించాలంటుంది భార‌తీయ సంస్కృతి. ఇది అంతా ఒక‌ప్ప‌టి మాట ఇప్పుడు వ‌సుదైక కుటుంబ‌కం కాదు.. వ‌ర‌సైన వాళ్లు మాత్రమే కుంటుంబం అంతే..! అస‌లు చెప్పాలంటే 75 th pandragast{#}Anandam75వ పంద్రాగ‌స్టు : వ‌సుదైక‌ కుటుంబ‌కం ఆన‌వాలు ఎక్క‌డ.? అంతా స్వార్ధం నిండిన వేళ‌..75వ పంద్రాగ‌స్టు : వ‌సుదైక‌ కుటుంబ‌కం ఆన‌వాలు ఎక్క‌డ.? అంతా స్వార్ధం నిండిన వేళ‌..75 th pandragast{#}AnandamSat, 14 Aug 2021 10:11:05 GMT      కురుస్తున్న వ‌ర్షం.. విరిగిన మంచం.. ఆ మంచం పైనే నిద్రిస్తున్న మొత్తం కుటుంబ స‌భ్యులు వారితో పాటు పెంపుడు జంతువులు..వారి ముఖాల్లో కొట్టొచ్చినట్టు క‌నిపిస్తున్న ఆనందం..! అస‌లైన ఆనందం అంటే ఏంట‌ని అడిగిన స్నేహితుడి కోసం ఓ వ్య‌క్తి చెప్పిన నిర్వ‌చ‌నం ఇది.

 ప్ర‌పంచానికి వ‌సుదైక కుటుంబ‌కం అని ప‌రిచ‌యం చేసిన దేశం మ‌న‌ది. ప్ర‌పంచం మొత్తం త‌న కుటుంబం అని భావించాలంటుంది భార‌తీయ సంస్కృతి. ఇది అంతా ఒక‌ప్ప‌టి మాట ఇప్పుడు వ‌సుదైక కుటుంబ‌కం కాదు.. వ‌ర‌సైన వాళ్లు మాత్రమే కుంటుంబం అంతే..! అస‌లు చెప్పాలంటే ప్ర‌స్తుత ప‌రిస్తితులు చూస్తుంటే అది కూడా త‌ప్పే అనిపిస్తుంది. ఒకే త‌ల్లికి పుట్టిన బిడ్డ‌లు ఒకే ఇంట్లో ఉండ‌లేక పోతున్నారు. వేరు బ‌డి.. కాదు దూరం అయి బ‌తుకుతున్నారు. నలుగురిని క‌న్న ఆ త‌ల్లిదండ్రులు ఆ న‌లుగురిని కష్ట‌ప‌డి ఉన్న‌దో లేదో పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ప్ర‌యోజికుడిని చేస్తున్నారు. కానీ ఆ న‌లుగురు క‌లిసి త‌మ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్ల‌దండ్రుల‌కు ఇంత ముద్ద పెట్ట‌లేని దారుణ ప‌రిస్థితిని సామాజంలో మ‌నం చూస్తున్నాం.. చూస్తూనే ఉన్నాం.. చూస్తూనే ఉంటాం.

   
   కుటుంబం అంటే కేవ‌లం న‌లుగురు వ్య‌క్తులే కాదు. కుటుంబం అంటే అప్యాయ‌త, అనురాగం, క‌ష్టం, సుఖం, సంతోషం, బ‌లం, బ‌ల‌హీన‌త‌. కానీ ఇప్పుడు ఎవ‌రికి వారే ఎమునా తీరే అన్న‌ట్టుగా ఎవ‌రి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఆప‌తి, సంప‌తి అనే తేడా లేకుండా ఎవ‌రి ప‌నుల్లో వారు బీజీ అవుతున్నారు. ఉన్న చోటే ఉంటూ, ఆఫీస్ ఇళ్లే త‌ప్ప త‌మ కుటుంబ స‌భ్యుల‌ను ప‌ట్టించుకునే స‌మ‌యం లేకుండా పోతోంది. కాలం మారిన కొద్ది మ‌నుషులు మారిపోతున్నారు.


  ఒక‌ప్పుడు క‌ల్మ‌షం లేని ప్రేమ‌లు, బంధుత్వాలు ఉండేవి. ఇప్పుడు డ‌బ్బులు, వ‌స్తువులు ప్ర‌ధాన‌మ‌యిపోయాయి... మ‌నుషులేమో మ‌న‌సు లేని వార‌య్యారు. భార‌త దేశం కుటుంబ ఆధారిత దేశం ఇత‌ర దేశాల‌లో కాకుండా ఇక్క‌డ ఎక్కువ‌గా ఉమ్మ‌డి కుటుంబాలు జీవిస్తాయి. అంతా క‌లిసే తింటారు, ఉంటారు. ఈ విష‌యం కూడా భార‌త్‌ను ప్ర‌పంచ దేశాల ముందు ఉన్న‌తంగా నిల‌బెట్టింది.. గౌర‌వించింది. కుటుంబాలే దేశానికి మూలంగా ఉన్నాయి ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడు చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ ఎవ‌రికి వారే ఉంటున్నారు.





 







పుష్ప : దేవిశ్రీ కి మళ్ళీ ఊపిరులూదేనా ? ధమన్ దాడి నుండి కాపాడేనా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>