PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-bjp00011ef2-2c61-438e-a55c-634276ad2ad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-bjp00011ef2-2c61-438e-a55c-634276ad2ad1-415x250-IndiaHerald.jpgవారిలో తెలంగాణకు చెందిన గరికపాటి మోహనరావు గత ఏడాది రిటైర్ కాగా చౌదరి, టీజీ వెంకటేష్ వచ్చే ఏడాది రిటైర్ కానున్నారు. ఇక బీజేపీలో ఆ మధ్య దాకా చౌదరి హవా సాగింది. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేయడంతో మరో మారు బీజేపీ నుంచి మంత్రి అవుతాను అని ధీమాగా ఉండేవారు. కానీ బీజేపీ ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో పాటు ఏపీకి సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయ్యాక చౌదరి బాగా తగ్గిపోయారు. మరో వైపు చూస్తే ఆయన త్వరలోనే మాజీ ఎంపీ కాబోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో రమేష్ అందుకున్నారు. ఆయన ఏకంగా బీజేపీలో అధికార కేంద్రంగా ఉన్న అమిత్ షాTDP BJP{#}Amit Shah;choudary actor;Somu Veerraju;Rajya Sabha;Sujana Choudary;kadapa;CBN;Amith Shah;MP;TDP;YCP;Andhra Pradesh;Success;Jagan;Venkatesh;Hanu Raghavapudi;CM;media;Bharatiya Janata Party;Ministerఏపీ బీజేపీలో ఆ ఒక్క‌డిదే చ‌క్రం... టీడీపీతో దోస్తీ కుదిర్చే ప‌నిలో బిజీ బిజీ ?ఏపీ బీజేపీలో ఆ ఒక్క‌డిదే చ‌క్రం... టీడీపీతో దోస్తీ కుదిర్చే ప‌నిలో బిజీ బిజీ ?TDP BJP{#}Amit Shah;choudary actor;Somu Veerraju;Rajya Sabha;Sujana Choudary;kadapa;CBN;Amith Shah;MP;TDP;YCP;Andhra Pradesh;Success;Jagan;Venkatesh;Hanu Raghavapudi;CM;media;Bharatiya Janata Party;MinisterSat, 14 Aug 2021 17:26:00 GMTచంద్రబాబుకు అతి ముఖ్య అనుచరుడు సీఎం రమేష్. ఆయన కడప జిల్లాకు చెందిన బలమైన సామాజిక వర్గం నేత. రమేష్ రాజకీయం అంతా కూడా టీడీపీ నుంచే మొదలై అలా ముందుకు సాగింది. ఆయన టీడీపీకి అతి పెద్ద ఆర్ధిక వనరుగా చెప్పుకునేవారు. ఇక చంద్రబాబుకు ఒక వైపు సుజనా చౌదరి ఉంటే రెండవ వైపు రమేష్ ఉండేవారు. ఈ ఇద్దరే పార్టీకి పిల్లర్స్ అన్న మాట కూడా నాడు తమ్ముళ్ళు అనుకునేవారు. ఈ ఇద్దరినీ రెండు సార్లు చంద్రబాబు రాజ్యసభకు పంపారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. వీరు కూడా చంద్రబాబు అంటే చాలా ఇష్టపడతారు. ఆయన పట్ల తమ విధేయతను గట్టిగా చాటుకునేవారు. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో రమేష్, చౌదరితో  పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు.

వారిలో తెలంగాణకు చెందిన గరికపాటి మోహనరావు గత ఏడాది రిటైర్ కాగా చౌదరి, టీజీ వెంకటేష్ వచ్చే ఏడాది రిటైర్ కానున్నారు. ఇక బీజేపీలో ఆ మధ్య దాకా చౌదరి హవా సాగింది. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేయడంతో మరో మారు బీజేపీ నుంచి మంత్రి అవుతాను అని ధీమాగా ఉండేవారు. కానీ బీజేపీ ఆ అవకాశం ఇవ్వలేదు. దాంతో పాటు ఏపీకి సోము వీర్రాజు ప్రెసిడెంట్ అయ్యాక చౌదరి బాగా తగ్గిపోయారు. మరో వైపు చూస్తే ఆయన త్వరలోనే మాజీ ఎంపీ కాబోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో రమేష్ అందుకున్నారు.

ఆయన ఏకంగా బీజేపీలో అధికార కేంద్రంగా ఉన్న అమిత్ షాకు అతి సన్నిహితుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య అమిత్ షా శ్రీశైలం వచ్చినపుడు కూడా రమేష్ అన్నీ తానై టూర్ ని సక్సెస్ చేశారు. ఆయన తరచూ అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ఆయన కూడా ఈ ఎంపీకి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మరో వైపు జగన్ సర్కార్ ని గద్దె దించాలన్న పంతంతో ఉన్న‌ రమేష్ దాన్ని బీజేపీ నుంచి సాధించాలని చూస్తున్నారు. ఆయన టీడీపీలో ఉన్నపుడు కూడా ఫుల్  సైలెంట్. తెర వెనక నాయకత్వానికే ఇష్టపడేవారు.

అలాంటి రమేష్ ఒక్కసారిగా ఇపుడు జూలు విదిల్చారు. ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ ని ఎండగడుతున్నారు. బీజేపీకి  ఏపీ తెలంగాణాకు చాలా ముఖ్యమని చెబుతున్నారు. అమిత్ షా ఏపీ మీద ఫోకస్ పెట్టారని కూడా చెబుతున్నారు. మొత్తానికి టీడీపీతో బీజేపీ దోస్తీని కుదిర్చే పనిలో ఫుల్ బిజీగా ఉన్న రమేష్ ఆ దిశగా సక్సెస్ అయిత మాత్రం బాబుకు తగిన శిష్యుడు అనిపించున్న‌ట్లే అంటున్నారు.





కొడాలి ఇలాకాలో చంద్రబాబుకు మ‌రో త‌ల‌నొప్పి మొద‌లైందా ?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>