corona in India : 38,667 కరోనా కేసులు, 478 మరణాలు ; కొత్తగా డెల్టా ప్లస్ భయం
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశంలో మరోమారు కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా క్షీణించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో 38,667 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులలో 3.6 శాతం తగ్గుదల కనిపించింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా దేశంలో గత 24 గంటల్లో 478 మంది మరణించారు. వ్యాక్సిన్ ల పంపిణీ 53 కోట్లు దాటింది. ప్రస్తుతం తాజాగా నమోదైన 478 మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తంగా నమోదైన మరణాల సంఖ్య 4.30 లక్షల మార్కును దాటింది.
కరోనా విలయ తాండవం : 142 దేశాల్లో డెల్టా కేసులు, డేంజర్ లిస్ట్ లో భారత్ : డబ్ల్యూహెచ్ఓ
దేశంలో క్రియాశీల కేసులు 3,87,673
నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారినుండి 35వేల మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.13 కోట్లకు పైగా చేరుకుంది. కరోనా నుండి కోలుకున్న శాతం 97.45 శాతంగా ఉంది. దేశంలో క్రియాశీల కేసులు 3,87,673గా ఉండగా, క్రియాశీల కేసుల శాతం 1.21 కి చేరుకుంది. మరోపక్క 63,80,937 మందికి నిన్న ఒక్కరోజే వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.21 కోట్లకు చేరుకుంది. రోజువారీ పరీక్ష సానుకూలత రేటు 1.73 శాతంగా ఉంది. ఇది గత 19 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.

కేరళలో రోజువారీ కేసులు నిన్న ఒక్క రోజే 20,452 .. టాప్ ఫైవ్ రాష్ట్రాలివే
20,452 తాజా కేసులతో, ఒకే రోజు అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులలో కేరళ దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముందంజలో ఉంది. కేరళ తాజాగా114 మరణాలను నివేదించింది. ఇక దేశంలోనే అత్యధికంగా కరోనా కారణంగా ప్రభావితమైన మహారాష్ట్రలో తాజా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. తాజాగా మహారాష్ట్రలో 6,686 కేసులు నమోదయ్యాయి. 1,933 తాజా కోవిడ్ కేసులతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 1,746 కొత్త కేసులతో, కర్ణాటక 1,669 కేసులతో టాప్ ఫైవ్ లో ఉన్నాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలలో రోజువారీ కేసులు 1,000 కి పైగా కేసు నమోదు అవుతుంది పరిస్థితి ఉంది.
మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ భయం
తెలంగాణలో 427 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర లో ఇప్పుడు వరకు డెల్టా ప్లస్ వేరియంట్ 67 మందికి సోకినట్లు గా తెలుస్తుంది. ఇందులో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లుగా అధికారిక సమాచారం. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారికి చాలామందికి వ్యాక్సినేషన్ కూడా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల లోనూ కరోనా కలకలం కొనసాగుతోంది. 763 కరోనా కేసులతో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం ముందుంది. అస్సాంలో 20 మంది తాజాగా మరణించినట్లు నివేదికలు చూపిస్తున్నాయి. 524 కేసులతో మిజోరం, 522 కేసులతో మణిపూర్, 384 కేసులతో మేఘాలయా రాష్ట్రాలు కరోనా కల్లోలం లో ఉన్నాయి.
53 కోట్లకు పైగా కరోనా వ్యాక్సినేషన్
ఢిల్లీలో ఈ రోజు వరుసగా మూడవ రోజు కోవిడ్ సంబంధిత మరణాలు నమోదు కాలేదు, అయితే 50 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 25 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది రెండు మరణాలను కూడా నివేదించింది. దాదాపు 2.6 లక్షల మంది ఇప్పటివరకు నిర్వహించిన 53.14 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లలో 0.048 శాతం మంది ఇప్పటివరకు ఒక డోస్‌ని తీసుకున్న తర్వాత కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.