PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/employees-strugglesf64054ad-6861-4828-9030-63a2442ef738-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/employees-strugglesf64054ad-6861-4828-9030-63a2442ef738-415x250-IndiaHerald.jpg75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వేతన జీవుల కష్టాలు అన్నీఇన్నీ కావు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాము చేస్తున్నది ఉద్యోగమా? ఊడిగమా? అన్న సందేహం ప్రభుత్వోగుల్లో తలెత్తుతోంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగి అయితే లైఫ్‌ హ్యాపీ అనేలా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా మాటకు అర్థం మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ఉద్యోగుల తలరాతలు కూడా మారిపోతున్నాయి. ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా, నిర్బంధంగా పని చేయాల్సిన పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులు. అemployees struggles75వ పంద్రాగస్టు: చేసేది ఉద్యోగమా.. ఊడిగమా..75వ పంద్రాగస్టు: చేసేది ఉద్యోగమా.. ఊడిగమా..employees strugglesSat, 14 Aug 2021 16:24:16 GMT75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వేతన జీవుల కష్టాలు అన్నీఇన్నీ కావు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తాము చేస్తున్నది ఉద్యోగమా? ఊడిగమా? అన్న సందేహం ప్రభుత్వోగుల్లో తలెత్తుతోంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగి అయితే లైఫ్‌ హ్యాపీ అనేలా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడా మాటకు అర్థం మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ఉద్యోగుల తలరాతలు కూడా మారిపోతున్నాయి. ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా, నిర్బంధంగా పని చేయాల్సిన పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులు. అయినా అన్నింటిని భరిస్తూ ఓర్పుగా, నేర్పుగా ఉద్యోగ బాధ్యతలను నెట్టుకొస్తున్నారు. పేదవాడి కోపం పెదవికి చేటు అన్న మాటను మననం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు అప్పటి పాలకులు. దేశాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని భావించిన నాటి పాలకులు.. వారిలో స్ఫూర్తి రగిల్చి కార్యోన్ముఖులను చేశారు. నాడు స్వార్థ రాజకీయాలకు తావు లేకపోవడంతో ఉద్యోగులు స్వేచ్ఛగా విధులు నిర్వహించారు. అప్పుడు పనికి తగ్గట్లుగా వేతనాలు రాకపోయినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడంతో కష్టమనుకోకుండా కార్యాలయాల్లో అదనపు సమయం వెచ్చించి మరీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలు. వీటిని దగ్గరగా చూసిన ఉద్యోగులు విసుగెత్తిపోయారు. స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం లేకుండా పోయింది. పాలకులు చెప్పింది చేయడమే తప్ప.. కనీసం సలహాలు, సూచనలు ఇవ్వలేని పరిస్థితులు ఉండటంతో నిస్సహాయులుగా మారారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వేతన జీవుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒకటో తేదీ వచ్చి వారం రోజులు దాటినా జీతాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. తమ బ్యాంక్‌ అకౌంట్‌లో సాలరీ క్రెడిట్ అయిన వెంటనే ఉద్యోగి సెల్‌కు బ్యాంక్‌ నుంచి మెసేజ్‌ అందుతుంది. అయితే అది ఒకటో తేదీ దాటినా రాకపోవడంతో.. ఏదైనా సాంకేతిక సమస్య కారణంగా రాలేదని వారు నేరుగా బ్యాంకుల వద్దకెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. జీతాలొచ్చిన వెంటనే ఇంటి అద్దెలతో పాటు ఈఎంఐలు, పిల్లల ఫీజులు, పాలు, కిరాణ షాపులకు బకాయిలు వంటి వాటికి చెల్లింపులు చేస్తుంటారు. అయితే ఒకటో తేదీన ఖాతాల్లో జీతాలు జమ కాకపోవడంతో ఏపీలో ఉద్యోగుల ఆందోళన వర్ణణాతీతంగా మారింది.

ఇక ఆయా రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగానే ఉంది. రిటైర్మెంట్‌ వయసు తగ్గిస్తారేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది. లాక్‌డౌన్‌ కారణంగా డీఏల్లో కోత విధించారు. అంతేగాక రెండు మూడు నెలలపాటు సగానికి సగం జీతాలు ఇచ్చారు. తర్వాత వాటిని మెల్లగా సర్దుబాటు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వాల్సిన జీతాలు కూడా సరిగా ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగులు పూర్తి లంచగొండులుగా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.





అలా చేశాడని.. హెడ్ మాస్టర్ ని చితకబాదిన గ్రామస్తులు?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>