MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh2b4cc3f3-94af-43aa-b734-d99fa4c517ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh2b4cc3f3-94af-43aa-b734-d99fa4c517ff-415x250-IndiaHerald.jpgనటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా తన నిర్ణయంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చాడు. అయితే ఈ సారి ఆయన మళ్ళీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో, లేదంటే కాంట్రవర్సీలో చిక్కుకోవడమో చేయలేదు. తన జీవితంలో ఇకపై ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడానికే గట్టి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం. త్వరలో ట్విట్టర్‌కు వీడ్కోలు పలకబోతున్నట్టు ఆయన చేసిన ట్వీట్‌తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటనే అంతా ఆలోచిస్తున్నారు. మరో వైపు ఇది బండ్ల గణేష్ అభిBandla Ganesh;{#}bandla ganesh;politics;producer;Producer;Jr NTR;kalyan;media;Cinemaబండ్లన్నా... ఇట్లా చేస్తే ఎట్లన్నా ?బండ్లన్నా... ఇట్లా చేస్తే ఎట్లన్నా ?Bandla Ganesh;{#}bandla ganesh;politics;producer;Producer;Jr NTR;kalyan;media;CinemaSat, 14 Aug 2021 19:21:00 GMTనటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా తన నిర్ణయంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చాడు. అయితే ఈ సారి ఆయన మళ్ళీ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమో, లేదంటే కాంట్రవర్సీలో చిక్కుకోవడమో చేయలేదు. తన జీవితంలో ఇకపై ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఉండడానికే గట్టి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండడం. త్వరలో ట్విట్టర్‌కు వీడ్కోలు పలకబోతున్నట్టు ఆయన చేసిన ట్వీట్‌తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమిటనే అంతా ఆలోచిస్తున్నారు. మరో వైపు ఇది బండ్ల గణేష్ అభిమానులకు, ఫాలోవర్స్ కు చేదు వార్త అని చెప్పాలి.

మరికొంత మంది బండ్ల మరో తప్పు చేస్తున్నాడు అంటున్నాడు. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బండ్ల గణేష్ కు ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియా ఒక్కటే ఆధారం. ఆయన వార్తల్లో నిలవాలన్నా, ఏదైనా చెప్పాలనుకున్నా...! కొంతకాలం నుంచి సోషల్ మీడియా కారణంగానే బండ్ల గణేష్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియానే బండ్ల వద్దనుకుంటే ఆయనకున్న ఈ కాస్త గుర్తింపు కూడా మసకబారిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
 
నిర్మాతగా ఆయన చివరగా 2015లో జూనియర్ ఎన్టీఆర్ తో "టెంపర్" చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత మరే ఇతర ప్రాజెక్ట్ ను ఆయన చేపట్టలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటున్నారు. కానీ ఇప్పుడు దానిపై కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కొంతకాలం రాజకీయాల్లో కాలక్షేపం చేసి, పలు సినిమా డైలాగులతో కామెడీగా మారాడు. ఆ తరువాత రాజకీయాలు తనకు కలిసి రావని చెప్పి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల "సరిలేరు నీకెవ్వరు"లో హాస్యనటుడిగా ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చాడు. అయితే అతని పాత్ర పెద్దగా క్లిక్ అవ్వలేదు. వృత్తిపరంగా బండ్ల గణేష్ కెరీర్ ఇప్పుడు ఏమంత బాలేదు.

సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్ల ద్వారా మాత్రమే నెటిజన్లకు బండ్ల గుర్తుకు వస్తాడు. వాస్తవానికి బండ్ల గణేష్‌కు ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చేతిలో ప్రాజెక్ట్‌లు లేనప్పటికీ ఆయన ట్వీట్‌ల ద్వారా మాత్రమే గత కొన్నిరోజులు వెలుగులో నిలిచాడు. ఇప్పుడు ఆయన గనుక సోషల్ మీడియాను విడిచి పెట్టాలని నిర్ణయించుకుంటే అది ఖచ్చితంగా ఆయన చేసే మరో పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాకు దూరమైన మరుక్షణం నుంచే ఫేడ్ అవుట్ అయిపోతాడు. జనాలు అతన్ని మరిచిపోవడం ఖాయం. మరి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు... బండ్ల నిర్ణయం మార్చుకుంటే మంచిదని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.
" style="height: 369px;">





హాట్ టాపిక్ గా చిత్తూరు జిల్లా

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>