PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/corona-virus-third-wave-maharashtra-karnataka-mumbai-banglore-modi-yadiyurappa-modi-thcakery29adaa7e-fa75-4415-9eb7-a66490a31aae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/corona-virus-third-wave-maharashtra-karnataka-mumbai-banglore-modi-yadiyurappa-modi-thcakery29adaa7e-fa75-4415-9eb7-a66490a31aae-415x250-IndiaHerald.jpgదేశంలో సెకండ్ వేవ్ రేపిన కల్లోలం నుంచి ప్రజలింకా కోలుకోక ముందే... థర్డ్ వేవ్ కలవర పెడుతోంది. క్రమంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క కేరళలోనే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ లో మహమ్మారి చిన్న పిల్లలపై పడుతుందని ఇప్పటికే నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు కూడా. ఈ సమయంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదవుతున్న కేసులు దేశవ్యాప్తంగా కలవర పెడుతోంది. ఒక్క బెంగళూరు నగరంలోనే వారం రోజుల్లో 500 మంది చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో దాదాపు Third Wave{#}oxygen;Capital;Coronavirusబెంగళూరులో థర్డ్ వేవ్.. కొత్తగా 263 మంది చిన్నారులకు కొవిడ్బెంగళూరులో థర్డ్ వేవ్.. కొత్తగా 263 మంది చిన్నారులకు కొవిడ్Third Wave{#}oxygen;Capital;CoronavirusSat, 14 Aug 2021 05:31:00 GMTదేశంలో సెకండ్ వేవ్ రేపిన కల్లోలం నుంచి ప్రజలింకా కోలుకోక ముందే... థర్డ్ వేవ్ కలవర పెడుతోంది. క్రమంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క కేరళలోనే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో థర్డ్ వేవ్ లో మహమ్మారి చిన్న పిల్లలపై పడుతుందని ఇప్పటికే నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు కూడా. ఈ సమయంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదవుతున్న కేసులు దేశవ్యాప్తంగా కలవర పెడుతోంది. ఒక్క బెంగళూరు నగరంలోనే వారం రోజుల్లో 500 మంది చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో దాదాపు 75 మంది పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇప్పటికే వైద్యులు వెల్లడించారు ఇదే విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె.... బీబీఎంపీ అధికారులు ప్రకటించారు.

అధికారుల నివేదిక ప్రకారం... కొవిడ్ బారిన పడిన చిన్నారుల్లో తొమిదేళ్ల లోపు వారు 88 మంది ఉన్నారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 305 మంది ఉన్నారు. ఇక కొత్తగా నమోదైన 499 పాజిటివ్ కేసుల్లో.... 263 కేసులు గత 5 రోజుల్లోనే నమోదయ్యాయి. వీరిలో 10 నుంచి 19 ఏళ్ల వయసున్న వారే 175 మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.

ఈ విషయంలో బీబీఎంపీ అధికారులతో ఆరోగ్య శాఖ కమిషనర్ రణదీప్ సమీక్ష నిర్వహించారు. వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆసుపత్రుల్లో ప్రత్యేక పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్ వేవ్ లో తీవ్ర ఇబ్బందులు పెట్టిన ఆక్సిజన్ కొరత... థర్డ్ వేవ్ సమయంలో మరోసారి తలెత్తకూడదని సూచించారు. ప్రస్తుతం 0-19 ఏళ్ల మధ్య వయసున్న వైరస్ బాధితులు 14 శాతం కంటే తక్కువగా ఉన్నారని తెలిపారు. చాలా మందిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ఎక్కువ మంది ఇళ్ల వద్దే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి కారణాలు తెలుసుకోవాలని అధికారులను రణదీప్ ఆదేశించారు. ఇప్పటికే 19 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు తమ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రణదీప్. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని... పిల్లలను బయటకు పంపకుండా ఉండాలని రణదీప్ హెచ్చరించారు.





బెంగళూరులో థర్డ్ వేవ్.. కొత్తగా 263 మంది చిన్నారులకు కొవిడ్

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>