LifeStyleMekala Yellaiaheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-b3a4ee56-e6cd-4b1a-8336-5735b4d84a47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lifestyle-b3a4ee56-e6cd-4b1a-8336-5735b4d84a47-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచంలో ప్లాస్టిక్ ఓ పెను సమస్యగా మారింది. నాణ్యత లేని నాసిరకం ప్లాస్టిక్ సంచులు, నాన్ డిస్పోజబుల్ కాని వస్తువులు పర్యావరణానికి ఎక్కువ హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో చేరే ప్లాస్టిక్ చెత్త కొన్ని దశాబ్దాల పాటు అలాగే ఉండిపోతుంది. నిమిషానికో ఓ ట్రక్కు లోడు ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలుస్తోంది. అందుకే, ప్లాస్టిక్ వాడే తీరు మారాల్సిన అవసరం ఉంది. వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్ గురించి అందరూ ఆలోచించాలి.Lifestyle {#}Jaan;Professor;John;Industries;electricity;war;Hollywood;Cinemaప్లాస్టిక్ ఎలా పుట్టింది..?ప్లాస్టిక్ ఎలా పుట్టింది..?Lifestyle {#}Jaan;Professor;John;Industries;electricity;war;Hollywood;CinemaSat, 14 Aug 2021 17:20:00 GMTపర్యావరణానికి ప్లాస్టిక్ పెను ప్రమాదంగా మారుతోందన్న విషయాన్ని చాలామంది గ్రహించారు. అందుకే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతోంది. అయితే, ఇదే సమయంలో ప్లాస్టిక్ ఎలా పుట్టింది? ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ విప్లవం ఎలాంటి మార్పులు తెచ్చింది? వంటి విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు శాస్త్రవేత్త, ప్రొఫెసర్ మార్క్ మిడోవ్నిక్.
ప్లాస్టిక్‌ గురించి లోతుగా అధ్యయనం చేసిన ఆయన, మనిషి జీవితాన్ని ప్లాస్టిక్ ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తున్నారు.

* ఏనుగు దంతాలకు ప్రత్యామ్నాయంగా వచ్చి..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదటి వాణిజ్యపరమైన ప్లాస్టిక్ వస్తువు దూదితో తయారైంది. అప్పట్లో బిల్లియర్డ్ బంతులను ఏనుగు దంతాలతో తయారు చేసేవారు. అయితే, 1863లో ఏనుగు దంతాల కొరత తీవ్రమైంది. దాంతో బంతుల తయారీ కోసం ప్రత్యామ్నాయ పదార్థాలను కనుగొన్నవారికి 10,000 డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్టు అమెరికన్ బిల్లియర్డ్ బాల్స్ తయారీ సంస్థ ప్రకటిచించింది. ఆ ఛాలెంజ్‌ని అమెరికన్ ఔత్సాహికుడు జాన్ వెస్లీ హయత్ స్వీకరించాడు. దూది, నైట్రిక్ ఆమ్లంతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. సెల్యూలోజ్ నైట్రేట్‌(నైట్రోసెల్యూలోజ్) అనే పదార్థాన్ని కనుగొన్నాడు. దాన్ని 'సెల్యూలాయిడ్' అని కూడా అంటారు. అది సాగే గుణం కలిగి ఉంటుంది. అయితే, దానితో చేసిన బంతులు పేలిపోయే ప్రమాదం ఉండేది. ఒకటికొకటి తాకినప్పుడు పెద్దగా శబ్దం వచ్చేది. అయినా సరే.. ఆ పదార్థం వేల రకాల వస్తువుల తయారీలో ఉపయోగపడింది. తర్వాత సెల్యూలాయిడ్‌ను వాణిజ్యపరంగా సినిమా టేపుల తయారీకి పెద్దఎత్తున వినియోగించారు.

* సినిమాలకు, ప్లాస్టిక్‌కి సంబంధం

తొలినాళ్లలో సినిమా రీళ్లను పేపర్‌తో తయారు చేసేవారు. బలంగా ఉండి, సాగే గుణం కలిగిన సెల్యూలాయిడ్ పదార్థం అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్నే రీళ్ల తయారీలో వినిగించారు. దాంతో పొడవాటి రీళ్లను సులువుగా తయారు చేసే వీలుండేది. హాలీవుడ్ సినిమాల అభివృద్ధికి ఆ మార్పు ఎంతగానో దోహదపడింది.

* బేకలైట్ రంగప్రవేశం

1907లో బేకలైట్ అనే మరో ప్లాస్టిక్ పదార్థం అందుబాటులోకి వచ్చింది. దీనితో అనేక రకాల వస్తువులను విభిన్న ఆకృతుల్లో తయారు చేసే వీలుండేది. విద్యుత్ నిరోధక గుణం కలిగి ఉండటంతో బేకలైట్‌ను బల్బుల హోల్డర్లు, ప్లగ్‌లు, స్విచ్‌బోర్డుల తయారీకి విరివిగా వినియోగించారు. తర్వాత మరెన్నో రకాల ప్లాస్టిక్ పుట్టుకొచ్చేందుకు దారి చూపింది బేకలైట్.

* రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రభావితం చేసిన ప్లాస్టిక్

1930, 40ల్లో పాలీఎథిలీన్ సహా అనేక కొత్త రకాల ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధకులు తయారు చేశారు. రెండో ప్రపంచయుద్ధంలో పాలీఎథిలీన్ కీలక పాత్ర పోషించింది. రాడార్ వ్యవస్థల కోసం వేసే పొడవాటి విద్యుత్ వైర్లకు పూతగా ఆ పదార్థాన్ని బ్రిటన్ సంకీర్ణ దళాలు వినిగించాయి. ఆ రాడార్‌తో అట్లాంటిక్ సముద్రంలో సరకు రవాణా ఓడల భద్రతను పర్యవేక్షించేవారు. ఇంకా అనేక రకాలుగా ప్లాస్టిక్‌ ఉపయోగపడింది. పారాచూట్‌ల తయారీలో నైలాన్‌ను వినియోగించేవారు. యుద్ధ వాహనాల తలుపులను, హెల్మెట్‌లను కూడా వేరువేరు రకాల ప్లాస్టిక్‌తో చేసేవారు.

* పాటల రికార్డింగ్ కోసం..

19వ శతాబ్దం మధ్యకాలం వరకు ఎవరైనా సంగీతాన్ని పరికరాలు వాయిస్తున్నప్పుడు మాత్రమే వినేవారు. కానీ, థామస్ ఎడిసన్ ఫోనోగ్రాఫ్ సిలిండర్ రూపొందించిన తర్వాత ఆ సంగీతాన్ని రికార్డు చేసుకునే వెసులుబాటు వచ్చింది. తర్వాత వినైల్ రికార్డులు, క్యాసెట్లు, టేపులు, సీడీల ద్వారా ఆ సదుపాయం మరింత పెరిగింది. ఇదంతా ప్లాస్టిక్ పుణ్యమే.

* ఆసుపత్రుల్లో..

ప్లాస్టిక్ పదార్థాలకు అదనంగా కొన్ని రకాల రసాయనాలు కలపడం ద్వారా మృధువైన, సాగే గుణం కలిగిన వస్తువులు తయారు చేసే అవకాశం వచ్చింది. దాంతో ఆస్పత్రుల్లో వినియోగించే అనేక డిస్పోజబుల్ వస్తువుల తయారీ సులువైంది. ఉదాహరణకు.. డిస్పోజబుల్ సిరంజీలు రావడం వల్ల అనేక ప్రమాదాలు తప్పాయి.

* ధర తక్కువ..

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పెట్రో రసాయనాల పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. ఆ సమయంలోనే మరిన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు పుట్టుకొచ్చాయి. 1960 ప్రాంతంలో ఒక్కసారి వాడి పడేసే ప్లేట్లు, కిచెన్ సామగ్రి లాంటి ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్‌లోకి వచ్చాయి. తర్వాత క్రమక్రమంగా అనేక రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చేశాయి. తక్కువ ధరలకే విభిన్న ఆకృతులు, రంగుల్లో దొరుకుతుండటంతో వాటి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

* ఆహార వృథా తగ్గుతుంది..

యూరప్ దేశాల్లో ఏటా 88 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. అదే ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేయడం పెరిగితే, ఆ వృథాను క్రమంగా తగ్గించే వీలుంటుంది. కూరగాయలు, పండ్లు వంటివి ప్లాస్టిక్‌ కవర్లతో ప్యాక్ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయని, దాంతో పొలాల నుంచి మార్కెట్లకు తరలించే సమయంలో జరిగే నష్టాన్ని కూడా తగ్గించుకునే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

* ఎక్కడ తేడా జరుగుతోంది?

ప్రస్తుతం ప్రపంచంలో ప్లాస్టిక్ ఓ పెను సమస్యగా మారింది. నాణ్యత లేని నాసిరకం ప్లాస్టిక్ సంచులు, నాన్ డిస్పోజబుల్ కాని వస్తువులు పర్యావరణానికి ఎక్కువ హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సముద్రంలో చేరే ప్లాస్టిక్ చెత్త కొన్ని దశాబ్దాల పాటు అలాగే ఉండిపోతుంది. నిమిషానికో ఓ ట్రక్కు లోడు ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలుస్తోంది. అందుకే, ప్లాస్టిక్ వాడే తీరు మారాల్సిన అవసరం ఉంది. వాడకాన్ని తగ్గించడం, పునర్వినియోగం, రీసైక్లింగ్ గురించి అందరూ ఆలోచించాలి.



అనుష్క సినిమాలకు దూరమైయినట్లేనా!!

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mekala Yellaiah]]>