PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aims6f38a86e-414e-43b4-9c5b-c484eb4c812e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aims6f38a86e-414e-43b4-9c5b-c484eb4c812e-415x250-IndiaHerald.jpgమూడో వేవ్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుందన్న దానికి శాస్త్రీయ అధ్యయనం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. విశాఖ జిల్లా లోని గీతం యూనివర్సిటీ లో ఇవాళ 41 వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ 41 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అవార్డ్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా గులేరియా మాట్లాడుతూ... మన దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రవర్తన నియమావళిని పాటించడం పైనే మూడో వేవ్ ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. పిల్లలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందన్న దానికి శాస్త్covid 19{#}Vishakapatnam;Andhra Pradesh;Coronavirus;Director;Universityపిల్లలపై మూడో వేవ్ ప్రభావం తక్కువే ?పిల్లలపై మూడో వేవ్ ప్రభావం తక్కువే ?covid 19{#}Vishakapatnam;Andhra Pradesh;Coronavirus;Director;UniversitySat, 14 Aug 2021 18:54:00 GMTమూడో వేవ్   ప్రభావం  పిల్లలపై తీవ్రంగా  ఉంటుందన్న దానికి శాస్త్రీయ అధ్యయనం లేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు.  విశాఖ జిల్లా లోని గీతం యూనివర్సిటీ లో ఇవాళ 41 వ  వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ  గీతం యూనివర్సిటీ 41 వ   వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అవార్డ్ అందుకున్నారు. అనంతరం  గులేరియా మాట్లాడుతూ... మన దేశంలో కోవిడ్ మహమ్మారి ప్రవర్తన నియమావళిని పాటించడం పైనే మూడో వేవ్ ఆధారపడి ఉంటుందని వెల్లడించారు.

పిల్లలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందన్న దానికి శాస్త్రీయ అధ్యయనం లేదని చెప్పిన ఆయన.. కేవలం వాళ్ళకు వాక్సినేషన్ లేదు కాబట్టి ఎక్కువగా వారు వైరస్ బారిన పడతారని అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఈశాన్య, దక్షిణ రాష్ట్రల లో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.  
కోవిడ్ మహమ్మారి ప్రవర్తనా నియమావళిని ఏ మేరకు పాటిస్తున్న అంశం పైనే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని వెల్లడించిన డైరెక్టర్ రణదీప్ గులేరియా... దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కేసుల కట్టడి ఇప్పుడు బాగుందన్నారు. అయితే హఠాత్తుగా ఒక ప్రాంతంలో విజృంభణ జరిగితే వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాల్లో కేసులు పెరగకుండా ఉంటాయని సూచనలు చేశారు రణదీప్ గులేరియా.  ఇదే సూత్రం దేశం తో పాటు  ప్రపంచానికి కూడా వర్తిస్తుందని రణదీప్ గులేరియా పేర్కొన్నారు.  కరోనా వైరస్ పై ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయని వెల్లడించారు. వైరస్ కూడా వేరు విధాలుగా రూపాంతరం చెంది వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉందని తెలిపారు రణదీప్ గులేరియా.  హర్డ్ ఇమ్యూనిటీ , వైరస్ తీరుపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ప్రజలందరూ కరోనా నియమ నిబంధనాలు పాటించాలని రణదీప్ గులేరియా సూచనలు చేశారు. 


తాలిబన్లు పాక్ ని కూడా మింగేస్తారా... ?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>