MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించాడంటూ వివాదం రాజుకుంటోంది. చరణ్ ప్రముఖ మొబైల్ రిటైలర్ "హ్యాపీ మొబైల్స్‌"కు ప్రచారం చేస్తున్నాడు. బ్రాండ్ వారు స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా ఆఫర్‌ల గురించి ప్రముఖ వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చారు. ప్రకటనలో రామ్ చరణ్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా జెండాలో అశోక చక్రం లేదు. దీంతో అసలు వివాదం మొదలయ్యింది. కొంతమంది జాతీయవాదులు ఇది ఇలా జాతీయ జెండాను అవమానించడం సరైన చర్య కాదంటూ మండి పడుతున్నారు. ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండిRam Charan{#}ashok;Ukraine;October;Chakram;Pawan Kalyan;Alluri Sitarama Raju;Ram Charan Teja;Rajamouli;News;Smart phone;January;India;Cinema;Hyderabadజాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?జాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?Ram Charan{#}ashok;Ukraine;October;Chakram;Pawan Kalyan;Alluri Sitarama Raju;Ram Charan Teja;Rajamouli;News;Smart phone;January;India;Cinema;HyderabadSat, 14 Aug 2021 18:06:00 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించాడంటూ వివాదం రాజుకుంటోంది. చరణ్ ప్రముఖ మొబైల్ రిటైలర్ "హ్యాపీ మొబైల్స్‌"కు ప్రచారం చేస్తున్నాడు. బ్రాండ్ వారు స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా ఆఫర్‌ల గురించి ప్రముఖ వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చారు. ప్రకటనలో రామ్ చరణ్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఆశ్చర్యకరంగా జెండాలో అశోక చక్రం లేదు. దీంతో అసలు వివాదం మొదలయ్యింది.

కొంతమంది జాతీయవాదులు ఇది ఇలా జాతీయ జెండాను అవమానించడం సరైన చర్య కాదంటూ మండి పడుతున్నారు. ఇది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం తీవ్రమైన ఉల్లంఘన అని కొంతమంది అంటున్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య ప్రకటనల కోసం జాతీయ జెండాను ఉపయోగించలేమని, అయితే అశోక్ చక్రాన్ని తొలగించడం ద్వారా త్రివర్ణాన్ని ప్రకటనల కోసం ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. కాబట్టి ఇది నేరం కాదని వారు చెప్పుకొస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆర్ఆర్ఆర్"లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన లెజెండరీ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. "ఆర్ఆర్ఆర్" టీమ్ ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ షూటింగ్‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్ ను అనుకున్న దానికంటే మరో వారం పొడిగించారని వార్తలు వస్తున్నాయి. ఆ తరువాత హైదరాబాద్ లో నెక్స్ట్ ప్యాచ్ వర్క్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా ? లేదా అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. "ఆర్ఆర్ఆర్"ను అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సినిమా పోస్ట్ పోన్ అయ్యేలా కన్పిస్తోంది. ఇప్పుడు సినిమా పోస్ట్ ఫోన్ అయ్యిందంటే మళ్ళీ వచ్చే ఏడాది జనవరి 26న విడుదల అవుతుందని అంటున్నారు.


జాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>