CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-cooking7599dd03-143f-42e8-bdec-f46287eeb14a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-cooking7599dd03-143f-42e8-bdec-f46287eeb14a-415x250-IndiaHerald.jpgమీ అందరికి మరమరాల గురించి తెలిసే ఉంటుంది . మరమారాలతో ఎంతో సులభంగా రెడీ అయిపోయే రెసిపీ ఒకటి మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. చాలా సులువుగా అయిపోయే టేస్టీ ఉగ్గాని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ! కావాల్సిన పదార్ధాలు 200 గ్రామ్స్ మరమరాలు 1 ఉల్లిపాయ – పెద్దది ఒకటి టొమాటాలు -2 పచ్చిమిర్చి-3 కరివేపాకు కొద్దిగా 1 టీ స్పూన్  ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 2 ఎండు మిర్చి ఉప్పు-సరిపడా కొద్దిగా కారం 2 టేబుల్ స్పూన్ల నూనె నిమ్మ రసం -కొద్దిగా కొత్తి మీర తరుగు – కొద్దిగా తయారు చేసే విధానం : india herald -cooking{#}Curry leaf;Curry leaves;Rasam;salt;Gas Stove;oil;Mirchiమీరు ఎప్పుడన్నా ఉగ్గానిని రుచి చూసారా...?మీరు ఎప్పుడన్నా ఉగ్గానిని రుచి చూసారా...?india herald -cooking{#}Curry leaf;Curry leaves;Rasam;salt;Gas Stove;oil;MirchiSat, 14 Aug 2021 12:03:19 GMT
కావాల్సిన పదార్ధాలు

200 గ్రామ్స్ మరమరాలు

1 ఉల్లి పాయ – పెద్దది ఒకటి

టొమాటాలు -2

పచ్చి మిర్చి-3

 కరివేపాకు కొద్దిగా

1 టీ స్పూన్  ఆవాలు

1 టీ స్పూన్ జీలకర్ర

1 టీ స్పూన్ - సాయి మినపప్పు

2 ఎండు మిర్చి

ఉప్పు-సరిపడా

కొద్దిగా కారం

2 టేబుల్ స్పూన్ల నూనె

నిమ్మ రసం -కొద్దిగా

కొత్తి మీర  తరుగు – కొద్దిగా

తయారు చేసే విధానం :

ఒక గిన్నెలోకి నీటిని తీసుకుని అందులో కొంచెం కొంచెంగా మరమరాలు వేస్తూ కొద్ది సేపు నానపెట్టాలి. ఆ తర్వాత మరమరాల లోని నీరు పోయే లాగా చేతితో గెట్టిగా పిండి వాటిని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే వాటిలో ఉప్పు కొద్దిగా వేయండి. ఇలా ఉప్పు వేయడం వలన మరమరాలకు ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి తాలింపు కోసం ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. ఆ తరువాత ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేపండి. అలాగే చిన్నగా కోసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి వేపిన తరువాత అందులో కొద్దిగా పసుపు,ఉప్పు,కారం వేసి వేపాలి. అన్ని మెత్తగా అయ్యాక ముందుగా నానబెట్టి ఉంచుకున్న మరమరాలు వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఒక రెండు నిముషాలు అయ్యాక కొద్దిగా నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే ఉగ్గాని రెడీ అయిపోయినట్లే.మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా రుచికరంగా ఉంటుంది.









అనన్యా కి అతనంటే చాలా ఇష్టమట..!

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>