PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/manoharb46e0d1b-01cd-4c71-94b1-a78adfadd32e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/manoharb46e0d1b-01cd-4c71-94b1-a78adfadd32e-415x250-IndiaHerald.jpgఏపీలో జనసేన పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక, ఏపీలో ఆ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా జనసేన పుంజుకునే పరిస్తితి కనిపించడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నా సరే జనసేనకు ఏ మాత్రం కలిసిరాలేదని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. manohar{#}Tenali;Elections;Nadendla Manohar;Janasena;Hanu Raghavapudi;Congress;Party;local languageనాదెండ్ల ఫ్యూచర్ టీడీపీ చేతుల్లో ఉందా?నాదెండ్ల ఫ్యూచర్ టీడీపీ చేతుల్లో ఉందా?manohar{#}Tenali;Elections;Nadendla Manohar;Janasena;Hanu Raghavapudi;Congress;Party;local languageSat, 14 Aug 2021 00:00:00 GMTఏపీలో జనసేన పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక, ఏపీలో ఆ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేకపోయింది. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా జనసేన పుంజుకునే పరిస్తితి కనిపించడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళుతున్నా సరే జనసేనకు ఏ మాత్రం కలిసిరాలేదని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.

మరి ఇలాంటి పరిస్తితి ఉన్న జనసేనలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యూచర్ ఎలా ఉండనుంది? అంటే చెప్పడం కష్టమే. ఇప్పుడు జనసేన ఉన్న పరిస్తితుల్లో మనోహర్ ఫ్యూచర్ చాలా కష్టంగా ఉంటుంది. భవిష్యత్‌లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయితే గతంలో మనోహర్, కాంగ్రెస్ తరుపున రెండుసార్లు తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారైంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో మనోహర్ దారుణంగా ఓడిపోయారు. ఇక కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదని చెప్పి, పవన్ పెట్టిన జనసేనలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో తెనాలిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా మనోహర్ తెనాలి నుంచి బరిలో ఉంటారు. కానీ గెలుపు మళ్ళీ కష్టమే అని తెలుస్తోంది.

ఎందుకంటే తెనాలిలో వైసీపీ, టీడీపీలు బలంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలని దాటుకుని మనోహర్ గెలవడం కష్టం. కాకపోతే టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటే మనోహర్‌కు గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. అయితే తెనాలి సీటు వస్తుందా? రాదా? అనేది చెప్పలేం. కానీ టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే మాత్రం మనోహర్‌కు మంచి ఛాన్స్ ఉంటుంది. మనోహర్‌కే కాదు...ఇంకా చాలామంది జనసేన నాయకులకు గెలిచే అవకాశం దొరుకుతుంది. మొత్తానికైతే నాదెండ్ల మనోహర్ ఫ్యూచర్...టీడీపీ చేతుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.



నాదెండ్ల ఫ్యూచర్ టీడీపీ చేతుల్లో ఉందా?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>