PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావచ్చింది. దేశానికి స్వాతంత్ర్య తేవడానికి మాత్రం చాలా మంది పోరాడారు. బ్రిటిష్‌ వారిని తరిమి కొట్టే నేపథ్యంలో చాలా మంది అమరులు కూడా అయ్యారు. అయితే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. మన దేశంలో మాత్రం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ.. దేశ నలుమూలల కుల రాజకీయాలు వ్యాపించాయి. ప్రతి పనిలోనూ నీది ఏ కులం అని అడిగేవారే తప్ప... మనిషిని మనిషిగా చూసే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. తన కులానికి చెందిన వాడైతేనే...మర్యాద ఇస్తూన్నారు. తక్కువ కులం ఉన్నా వారిని independance day{#}politics;social media75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?independance day{#}politics;social mediaSat, 14 Aug 2021 11:11:00 GMT
అలాగే.. మన దేశంలో మానవత్వం కూడా మంట కలిసిపోతోంది. ఎవరైనా..దారిన పోయేవారు.. దాహం వేస్తోంది.. మంచి నీళ్లు ఇవ్వండి అన్నా...ఇచ్చే పరిస్థితి లేదు ఈ సమాజానికి. అంతలా బిజీ అయిపోయారు జనాలు. ఆఫీస్‌ కు టైం అయిపోతుందంటూ సాకులు చెప్పి... పారిపోతున్నారు.  అలాగే.. నడిరోడ్డు పై ఏదైనా ప్రమాదం జరిగితే.. తోటి మనిషికి సహాయం చేయలేని విధంగా భారత సమాజం తయారవు తోంది. రోడ్డు మీద యాక్సిడెంట్‌ అయిన వాన్ని పట్టించు కోకుండా... కాపాడాలనే ఇంగిత జ్ఞానం లేకుండా జీవితాలను గడిపేస్తున్నారు. అంతేకాదు.. ఆ యాక్సిడెంట్‌ ఘటన కు సంబంధించిన ఫోటోలు తీసి... సోషల్‌ మీడియా లో షేర్‌ చేసి...ఈ ఘటన చాలా దారుణమని బాధపడుతున్నారు.

ఫోటోలు తీసే సమయంలో... ప్రాణ పాయ స్థితిలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు మన సమాజం. ఇలాంటి వ్యక్తులు మనలో కూడా చాలా మంది ఉండే ఉంటారు. అలాగే...జాబ్స్, బిజినెస్‌ అంటూ.. కుటుంబ సభ్యులతో ఉండటమే మానేశారు. ఆఫీస్‌ నుంచి ఇంటికి.... ఇంటి నుంచి ఆఫీస్‌ కు ఇలా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఎప్పుడు పని..పని అంటూ రోబోలు అయిపోతున్నారు జనాలు. ఈ పరిస్థితులను చూస్తుంటే... మన తాతల కాలమే...బాగుండని అనిపిస్తోంది. అప్పటి ప్రేమలు, ఆప్యాయతలు, ఇరుగు పోరుగు వారితో అనుబంధాలు అన్ని ఆ కాలంలోనే బాగుండేవి. ప్రస్తుత మానవ జీవితాల్లో అలాంటివి కనుమరుగవుతున్నాయి.


అనన్యా కి అతనంటే చాలా ఇష్టమట..!

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>