MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/daggubati-bullodu-new-root772b78d4-2128-4379-bc65-cfc9512ca77c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/daggubati-bullodu-new-root772b78d4-2128-4379-bc65-cfc9512ca77c-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి రానాకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఏమని బాహుబలిలో నటించాడో కానీ ఆయనకుండే క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. వెంకటేశ్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా.. ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అంతేకాదు ఆ సినిమాతో ఎన్నో అవకాశాలను చేజిక్కించుకున్నాడు కూడా. ఇప్పుడు ప్రేక్షకుల మీద భారం వేసి కొత్త రూట్ ఎంచుకుంటున్నాడు. Daggubati Bullodu New Root{#}venkat;television;Samantha;rana daggubati;Hero;Prabhas;Coronavirus;Fatherదగ్గుబాటి బుల్లోడు న్యూ రూట్..!దగ్గుబాటి బుల్లోడు న్యూ రూట్..!Daggubati Bullodu New Root{#}venkat;television;Samantha;rana daggubati;Hero;Prabhas;Coronavirus;FatherSat, 14 Aug 2021 17:00:00 GMTరానా ఎందులో అడుగు పెట్టినా ఆ వర్క్ కు న్యాయం చేసేందుకు ఎంతో కృషి చేస్తాడు.  ఏ అవకాశం వచ్చినా.. వద్దనకుండా  చేసేస్తున్నాడు. అలా చేసిన ప్రయోగమే బాహుబలిలో విలన్ పాత్ర.  హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా ఉండాలని నమ్మే వ్యక్తి దర్శకధీరుడు రాజమౌళి. ఆ సినిమాలో దున్నతో తన బలప్రదర్శన చూపించడం.. తర్వాత ప్రభాస్ తో భారీ ఫైట్లు చేయడంలో తన సత్తా ఏంటో చూపించాడు. విలన్‌గా చేస్తే మార్కెట్‌ దెబ్బతింటుందని అంతా భయపడుతోన్న సమయంలోనే ఈ హీరో ప్రయోగాలు చేశాడు.. ఆడియన్స్‌ని మెప్పించాడు. ఈ నమ్మకంతోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా అడుగుపెడుతున్నాడు రానా.

టాలీవుడ్‌ యంగ్‌స్టర్స్‌ అంతా మాస్‌ హీరో, లవర్‌ బాయ్ అనే ఇమేజ్‌ల కోసం పోరాడుతోంటే, రానా మాత్రం ఆల్ రౌండర్‌గా ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నాడు. సినిమాలు, టీవీ షోస్‌తో ఇప్పటికే యూనిక్‌ వేలో వెళ్తోన్న రానా నెక్ట్స్ ఒక వెబ్‌ సీరీస్‌ కూడా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.  

కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతబడ్డాక ఓటీటీ మార్కెట్‌ పెరిగిపోయింది. కొంచెం కొత్తగా, యూనిక్‌గా ఉండే కథలకి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలతో ఈ సీరీసులని కంపార్ చేస్తున్నారు. ఆడియన్స్‌లో వచ్చిన ఈ మార్పులకి తగ్గట్లుగా టాలీవుడ్‌ స్టార్స్‌ కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్తున్నారు. నాగచైతన్య, సమంత లాంటి స్టార్స్‌ కూడా వెబ్‌సీరీసులు చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వడంలో ముందుంటాడు రానా. టీవీ షో హోస్టింగ్స్‌ అంటే ఇమేజ్‌ పడిపోతుందేమో అని అంతా అనుకుంటోన్న టైమ్‌లోనే యాంకర్‌గా మారాడు. టాక్‌షో తో ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు కూడా ఇలాగే యూత్‌కి కనెక్ట్ కావడానికి ఒక వెబ్‌ సీరీస్‌కి సైన్‌ చేశాడట రానా. ఇక ఈ సీరీస్‌లో వెంకటేశ్ కూడా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తాత రామానాయుడికి తగ్గ మనుమడిగా.. తండ్రి సురేష్ బాబుకు తగ్గ కొడకుగా.. బాబాయ్ వెంకట్ శ్ కు తగ్గ వారసుడిగా తన టాలెంట్ ను ప్రూ వ్ చేసుకుంటున్నాడు రానా.









జాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>