MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-car-instagram4bdad4fc-f14c-49f2-a027-a5546f8f1590-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-car-instagram4bdad4fc-f14c-49f2-a027-a5546f8f1590-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారి కోడలు సమంత ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే మరోవైపు బిజినెస్, సోషల్ మీడియా ప్రమోసన్స్‌పై దృష్టి సారిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల కాలంలో ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సీరీస్ ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సమంత పోషించిన పాత్రకుగాను ప్రశంసల వర్షం కురిసింది. ఇకపోతే సాకీ బ్రాండ్ క్లాత్స్ ప్రమోషన్స్‌లోనూ సామ్ యాక్టివ్‌గా ఉంది. కాగా తాజాగా సమంత ఓ ఖరీదైన వస్తువును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. వెరీ కాస్ట్లీ కార్ ‘లంబోర్ఘిణి’ని ఇప్పటికే మెగా పవర్ స్టsamantha; car; instagram{#}sam;Samantha;Sam Mendes;Varsham;Aamir Khan;prakruti;Husband;Car;Pawan Kalyan;Chaitanya;bollywood;Director;India;NTR;media;Cinemaలగ్జరీ లంబోర్ఘినిపై సామ్ కన్ను..?లగ్జరీ లంబోర్ఘినిపై సామ్ కన్ను..?samantha; car; instagram{#}sam;Samantha;Sam Mendes;Varsham;Aamir Khan;prakruti;Husband;Car;Pawan Kalyan;Chaitanya;bollywood;Director;India;NTR;media;CinemaSat, 14 Aug 2021 15:00:00 GMTఅక్కినేని వారి కోడలు సమంత ఓ వైపు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే మరోవైపు బిజినెస్, సోషల్ మీడియా ప్రమోసన్స్‌పై దృష్టి సారిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల కాలంలో ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సీరీస్ ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ టాక్ తెచ్చుకుంది. ఇందులో సమంత పోషించిన పాత్రకుగాను ప్రశంసల వర్షం కురిసింది. ఇకపోతే సాకీ బ్రాండ్ క్లాత్స్ ప్రమోషన్స్‌లోనూ సామ్ యాక్టివ్‌గా ఉంది. కాగా తాజాగా సమంత ఓ ఖరీదైన వస్తువును బుక్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే..

వెరీ కాస్ట్లీ కార్ ‘లంబోర్ఘిణి’ని ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొనుక్కున్నారు. ఈ క్రమంలోనే వారు అప్పుడప్పుడు కుటుంబీకులతో ఈ కార్లలో షికార్లు కొడుతున్నారు. ఈ కార్‌పై మనసు పడ్డ సామ్ తన భర్త నాగ‌చైతన్య కోసం బుక్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కారు గురించి తెలుసుకుని ఎగ్జైటింగ్‌గా ఫీలవుతుందట సమంత. సామ్ కెరీర్ విషయానికొస్తే ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

ఇది ఆమెకు తొలి చారిత్రక సినిమా కాగా ప్రకృతి ప్రియమైన ‘శాకుంతలం’గా కనిపించేందుకు కసరత్తు చేస్తోంది సామ్. ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సమంత- చైతన్య జంట ‘మజిలీ’ తర్వాత మరోసారి జోడీగా ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇక చైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  చైతన్య ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ చిత్రంలోనూ నటించారు. ఈ సినిమా ద్వారానే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’లో చైతన్య  కీ రోల్ ప్లే చేశారు.



ప్రభాష్ గొప్పతనం గురించి రాజమౌళి మాటల్లో..!!

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>