PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan7c567562-fccc-4f65-925c-d7754ad5319d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan7c567562-fccc-4f65-925c-d7754ad5319d-415x250-IndiaHerald.jpgఏపీలో కాపు సామాజికవర్గం బలం ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో కులాల వారీగా చూస్తే కాపు ఓటర్లే ఎక్కువ ఉంటారు. వీరు చాలా నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఎక్కువగా కాపులని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు కూడా కాపులపై వరాలు కురిపిస్తాయి. కానీ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయని ప్రభుత్వాలని గద్దె దింపడంలో కాపులు ముందే ఉంటారు. jagan{#}Hanu Raghavapudi;Jagan;CBNజగన్‌ని ‘కాపు’ కాసే వాళ్ళు తగ్గుతున్నారా?జగన్‌ని ‘కాపు’ కాసే వాళ్ళు తగ్గుతున్నారా?jagan{#}Hanu Raghavapudi;Jagan;CBNFri, 13 Aug 2021 02:00:00 GMTఏపీలో కాపు సామాజికవర్గం బలం ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో కులాల వారీగా చూస్తే కాపు ఓటర్లే ఎక్కువ ఉంటారు. వీరు చాలా నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటములని డిసైడ్ చేస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఎక్కువగా కాపులని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటాయి. అలాగే ప్రభుత్వాలు కూడా కాపులపై వరాలు కురిపిస్తాయి. కానీ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయని ప్రభుత్వాలని గద్దె దింపడంలో కాపులు ముందే ఉంటారు.

గతంలో కాపులకు పలు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ వారికి తగ్గట్టుగా చంద్రబాబు పనిచేయలేదు. అందుకే 2019 ఎన్నికల్లో వారు జగన్‌కు కాపు కాశారు. మరి అధికారంలోకి వచ్చిన జగన్...కాపులని ఆదుకోవడంలో ముందే ఉన్నారా? అంటే ఏది చెప్పలేని పరిస్తితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా కాపులకు న్యాయం జరుగుతున్నట్లైతే కనబడటం లేదని తెలుస్తోంది.

జగన్ ప్రభుత్వం విషయంలో కాపులు అసంతృప్తిగానే ఉన్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో అందరి లాగానే కాపులకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇక ఒక్క కాపు నేస్తం మాత్రం అదనంగా కాపులకు ఇచ్చే పథకం. ఈ పథకం రాష్ట్రంలోని కాపులు అందరికీ మేలు చేస్తున్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. పైగా కాపుల చిరకాల కోరిక రిజర్వేషన్లు అమలు అయ్యేలా కనిపించడం లేదు.

పైగా గత చంద్రబాబు ప్రభుత్వం, అగ్రవర్ణాల పేదల కోసం కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఇచ్చింది. కానీ జగన్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు రద్దు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం ఇవ్వడానికి చూస్తున్నారు. కానీ ఇందులో కాపులకు ప్రత్యేకంగా ఇచ్చే రిజర్వేషన్లు లేవు. దీనిపై కాపులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అటు కాపు కార్పొరేషన్ ఏమైందో తెలియదు. ఛైర్మన్ అయితే పెట్టారు గానీ, దాని ద్వారా ఎంతమంది కాపులకు అండగా నిలిచారో తెలియదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో జగన్‌ని కాపు కాసేవారు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. కాపులు నిదానంగా వైసీపీకి దూరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.



జగన్‌ని ‘కాపు’ కాసే వాళ్ళు తగ్గుతున్నారా?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>