EditorialVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indians0805fd57-9e42-4abd-97e6-7322b50d3cb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indians0805fd57-9e42-4abd-97e6-7322b50d3cb8-415x250-IndiaHerald.jpgవరాహమిరుడు, చాణక్యుడు, మరెందరో శాస్త్రవేత్తలు, ఇంకెంతో మంది తత్వవేత్తలు, రాజనీతిజ్ఞులు ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. గుప్తుల కాలం నుంచి కూడా దేశం ప్రపంచ స్థాయిలో కీర్తిని ఆర్జించింది. మేధాసంపత్తి పునరుద్ధరణకు ఈ కాలంగా సాక్ష్యంగా నిలిచింది. దీనిని "భారతదేశం శాస్త్రీయ" లేదా " స్వర్ణ యుగం " అని వర్ణిస్తారు. ఈ కాలంలో భారతీయ నాగరికత, పరిపాలన, సంస్కృతి వంటివి ఆసియాలో ఎంతో గుర్తింపునకు నోచుకోవడంతో పాటు ఆయా దేశాలు అనుసరించేలా చేశాయి. ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సాంస్కృతిక ప్రభindians{#}Culture;zero75వ పంద్రాగస్టు : ఒక నలందా, ఒక తక్షశిల.. అక్కడే ఆగిపోయాయేమో..?75వ పంద్రాగస్టు : ఒక నలందా, ఒక తక్షశిల.. అక్కడే ఆగిపోయాయేమో..?indians{#}Culture;zeroFri, 13 Aug 2021 11:02:00 GMTభారత దేశం! 135 కోట్ల మంది ప్రజలతో నిండు గర్భిణిని తలపిస్తున్న దేశంగా మాత్రమే నిలిచిపోయింది. కానీ, వాస్తవానికి ఈ దేశానికి అనేక రూపాల్లో ఘన చరిత్ర ఉంది. నేడు ప్రపంచం మొత్తం.. అనుసరిస్తున్న అనేక రంగాల్లో దేశం ఏనాడో.. ప్రగతిని సాధించింది. అంతేకాదు.. ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పింది. అనేక ఉద్గ్రంధాలను సైతం రచించింది. యోగా, ఆయుర్వేదం, తత్వ శాస్త్రం.. ఇలా ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకుపోయింది. ఎంతో మంది మేధావులు ఈ భరత గడ్డపై జన్మించి.. ప్రపంచానికి దిక్సూచిగా మారారు.
వరాహమిరుడు, చాణక్యుడు, మరెందరో శాస్త్రవేత్తలు, ఇంకెంతో మంది తత్వవేత్తలు, రాజనీతిజ్ఞులు ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. గుప్తుల కాలం నుంచి కూడా దేశం ప్రపంచ స్థాయిలో కీర్తిని ఆర్జించింది. మేధాసంపత్తి పునరుద్ధరణకు ఈ కాలంగా సాక్ష్యంగా నిలిచింది. దీనిని "భారతదేశం శాస్త్రీయ" లేదా " స్వర్ణ యుగం " అని వర్ణిస్తారు. ఈ కాలంలో భారతీయ నాగరికత, పరిపాలన, సంస్కృతి వంటివి ఆసియాలో ఎంతో గుర్తింపునకు నోచుకోవడంతో పాటు ఆయా దేశాలు అనుసరించేలా చేశాయి. ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సాంస్కృతిక ప్రభావం విస్తరించింది.
ఇలా.. అనేక అంశాల్లో భారతీయులు ప్రపంచ స్థాయిలో విలసిల్లారు. మన దేశంలోని మేధావుల నుంచి అనేక విషయాలు నేర్చుకునేందుకు ఇతర దేశాల వారు క్యూకట్టారంటే.. ఆశ్చర్యం కలగక మానదు. వరాహమిహరుడు, చాణక్యుడు వంటివారు.. ఈ దేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. వారి నుంచి నేర్చుకునేందుకు గ్రీకు సహా చైనాల నుంచి అనేక మంది వచ్చి.. ఇక్కడ కొన్నేళ్లపాటు ఆవాసం ఉండి.. నేర్చుకుని తమ తమ దేశాల్లో ఆయా విద్యలను వ్యాపింపజేశారు. రామానుజన్ జీరో కనిపెట్టి.. ప్రపంచ గణిత రంగాన్ని ఓ కీలక మలుపు తిప్పాడు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. కనిపెట్టిన మిస్సయిల్స్.. దేశ రక్షణ రంగ చరిత్రను తిరగరాసింది.
ఇంత ఘన చరిత్ర ఉన్న.. దేశంలో ఇప్పుడు.. ఎటు చూసినా.. విద్యావంతులు కనిపిస్తున్నా.. నైపుణ్యం ఏది? ఎక్కడా..? అనే ప్రశ్నలే వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితిని గమనిస్తే.. ఒక రామానుజాన్ని, ఒక కలాం వంటి మేధావులను అందించిన దేశమేనా? ఇది! అని అనిపిస్తోందని అంటున్నారు నిపుణులు. దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ.. విద్యార్థుల్లో నైపుణ్యం లేదు. ఘనత వహించిన IIT లు, NITలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఉద్యోగులను తాయారుచేసే కర్మాగారాలే అవుతున్నాయి.
కానీ మానవజాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేవిధంగా లేవు. దీనికి కారణం ఏంటి? వ్యక్తిని.. అనంతర కాలంలో సమాజాన్ని.. దేశాన్ని నిలబెట్టే విద్యను వ్యాపారమయం చేయడమే! అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. పాలకుల మైండ్ సెట్ మారుతుందా? ఈ దేశం కీర్తి.. ఇప్పటికైనా.. పుంజుకుంటుందా? చూడాలి..!!