MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-babu-aa6769c4-b0d2-4b4e-af81-96c2ca7f4680-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mahesh-babu-aa6769c4-b0d2-4b4e-af81-96c2ca7f4680-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన బిల్లా, కంత్రి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మెహర్ రమేష్ సినీ కెరీర్ లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. Mahesh Babu {#}Kannada;Box office;Darsakudu;meher ramesh;Kanthri;Shadow;Remake;Blockbuster hit;Director;Cinemaఆ దర్శకుడికి మహేష్ బాబుకు మధ్య ఉన్న సంబంధం ఇదేనా..??ఆ దర్శకుడికి మహేష్ బాబుకు మధ్య ఉన్న సంబంధం ఇదేనా..??Mahesh Babu {#}Kannada;Box office;Darsakudu;meher ramesh;Kanthri;Shadow;Remake;Blockbuster hit;Director;CinemaFri, 13 Aug 2021 11:15:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన బిల్లా, కంత్రి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మెహర్ రమేష్ సినీ కెరీర్ లో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కథ అద్భుతంగా చెప్పే టాలెంట్ ఉన్న మెహర్ రమేష్ తెలుగులో దర్శకుడిగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేకపోయాడు.

ఇక కన్నడ చిత్ర పరిశ్రమలో మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ.. తెలుగులో మాత్రం మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన శక్తి, షాడో సినిమాలు డిజాస్టర్ అయ్యి, బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక షాడో తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకున్న మెహర్ రమేష్ చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ ను చేయనున్నారు. ఇది త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే పూరీ జగన్నాథ్ శిష్యుడైన మెహర్ రమేష్ మహేష్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటుంటారు. అంతేకాదు.. మహేష్ బాబుతో యాడ్స్ కూడా తెరకెక్కిస్తున్నారు ఆయన. ఇక తాజాగా మెహర్ రమేష్ మహేష్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు. అయితే మహేష్ బాబుకు తాను ఏ కథ చెప్పినా ఆయన ఛీ కొడతారని మహేష్ కు తనకు ఉన్న అనుబంధం ఇదేనని మెహర్ రమేష్ తెలిపారు.

అంతేకాదు.. తాను కథ చెప్పడం మహేష్ ఛీ కొట్టడం చాలాసార్లు జరిగిందని మెహర్ రమేష్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మెహర్ రమేష్ గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాక.. భవిష్యత్తులో మహేష్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి మరి.



'పుష్ప' ఫస్ట్ సాంగ్ : 'దాక్కో దాక్కో మేక' అంటూ కేక పుట్టించిన డిఎస్పీ .... !!

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

'జనసేనాని' అది చేస్తే జనంలో హీరోనే ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>