PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ap-vaccinationca41c2cd-4f7d-480b-9030-16cdcc298933-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ap-vaccinationca41c2cd-4f7d-480b-9030-16cdcc298933-415x250-IndiaHerald.jpgఏపీలో స్కూల్స్ తిరిగి తెరిచేలోగా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏపీలో స్కూల్స్ తెరిచే మహూర్తం రానే వచ్చింది. ఈనెల 16నుంచి స్కూల్స్ పునఃప్రారంభిస్తామంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగారా..? ఈ విషయంలో ప్రభుత్వం వెనకబడినట్టు స్పష్టమవుతోంది. హైకోర్టుకి తెలిపిన వివరాల ప్రకారం ఏపీలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని ఉపాధ్యాయుల సంఖ్యap vaccination{#}Andhra Pradesh;High court;Srikakulam;Governmentవ్యాక్సినేషన్ పూర్తి కాకపోయినా స్కూల్స్ తెరవాల్సిందే..!వ్యాక్సినేషన్ పూర్తి కాకపోయినా స్కూల్స్ తెరవాల్సిందే..!ap vaccination{#}Andhra Pradesh;High court;Srikakulam;GovernmentFri, 13 Aug 2021 06:59:00 GMTఏపీలో స్కూల్స్ తిరిగి తెరిచేలోగా ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏపీలో స్కూల్స్ తెరిచే మహూర్తం రానే వచ్చింది. ఈనెల 16నుంచి స్కూల్స్ పునఃప్రారంభిస్తామంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇవ్వగలిగారా..? ఈ విషయంలో ప్రభుత్వం వెనకబడినట్టు స్పష్టమవుతోంది. హైకోర్టుకి తెలిపిన వివరాల ప్రకారం ఏపీలో సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని ఉపాధ్యాయుల సంఖ్య 69,618గా ఉంది.

ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే స్కూల్స్ తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వై.ఉమాశంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ వివరణ అడిగింది. ఈ వివరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని కేసుని ఈనెల 18కి వాయిదా వేసింది. స్కూల్స్ పునఃప్రారంభం ఈనెల 16నుంచి కావడంతో.. హైకోర్టులో కూడా స్కూల్స్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది.

అఫిడవిట్ లో ఏం చెప్పారంటే..?
ఏపీలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి మొత్తం టీచర్లు 2,83,303 మంది ఉన్నారు. వీరిలో కేవలం 79,205మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 69,618మందికి కనీసం ఒక్క డోసు కూడా ఇవ్వలేదు. ఈ దశలో స్కూల్స్ తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు తెరిచేందుకు మరో మూడు రోజులు మిగిలి ఉండగా కోర్టుకి ఈమేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. రెండు డోసులను ప్రామాణికంగా తీసుకోకుండా.. సింగిల్ డోస్ పూర్తయినా చాలని అంటున్నారు అధికారులు. మూడు రోజుల్లో మరింతమంది ఉపాధ్యాయులకు వ్యాక్సిన్లు ఇస్తామని, స్కూల్స్ తిరిగి మొదలైన వారం రోజుల వ్యవధిలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంటున్నారు. బోధనేతర సిబ్బంది విషయంలో కూడా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు అధికారులు.



వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>