BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag438a8d8c-a715-4024-a9e1-72c3304be6a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag438a8d8c-a715-4024-a9e1-72c3304be6a5-415x250-IndiaHerald.jpgత‌మ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత క‌డ‌ప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈనెల ప‌దోతేదీ సాయంత్రం ఐదుగంట‌ల స‌మ‌యంలో ఒక అనుమానితుడు త‌మ ఇంటిద‌గ్గ‌ర అనుమానాస్పదంగా సంచ‌రించాడ‌ని, ఆ త‌ర్వాత త‌మ ఇంటి కాంపౌండ్‌వాల్ ద‌గ్గ‌ర నుంచి ఫోన్‌కాల్స్ చేశార‌ని సునీత లేఖ‌లో పేర్కొన్నారు. త‌న తండ్రి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న శివ‌శంక‌ర్‌రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒక వ్య‌క్తి ఉన్నార‌ని, ఆ వ్య‌క్తిలాగే tag{#}Evening;Letter;CBI;Minister;Father;Districtవివేకా కుటుంబానికి ప్రాణ‌హాని?వివేకా కుటుంబానికి ప్రాణ‌హాని?tag{#}Evening;Letter;CBI;Minister;Father;DistrictFri, 13 Aug 2021 15:55:00 GMT
త‌మ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని, భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత క‌డ‌ప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈనెల ప‌దోతేదీ సాయంత్రం ఐదుగంట‌ల స‌మ‌యంలో ఒక అనుమానితుడు త‌మ ఇంటిద‌గ్గ‌ర అనుమానాస్పదంగా సంచ‌రించాడ‌ని, ఆ త‌ర్వాత త‌మ ఇంటి కాంపౌండ్‌వాల్ ద‌గ్గ‌ర నుంచి ఫోన్‌కాల్స్ చేశార‌ని సునీత లేఖ‌లో పేర్కొన్నారు. త‌న తండ్రి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న శివ‌శంక‌ర్‌రెడ్డి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒక వ్య‌క్తి ఉన్నార‌ని, ఆ వ్య‌క్తిలాగే ఈ అనుమానితుడు ఉన్నార‌ని చెప్పారు. ఆయ‌న మ‌ణికంఠ‌రెడ్డి అయివుండ‌వ‌చ్చ‌న్నారు. దీనిపై సీఐకి ఫిర్యాదు చేశాన‌ని, ఆ వ్య‌క్తి మ‌ణికంఠ‌రెడ్డి అనే తేల్చార‌న్నారు. శివ‌శంక‌ర్‌రెడ్డికి ఈ మ‌ణికంట‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడ‌ని సునీత వివ‌రించారు. త‌న తండ్రి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న ఇత‌ని పాత్ర‌ను వెంట‌నే తేల్చాల‌ని ఆమె కోరారు. వివేకా హ‌త్య‌కేసుపై జ‌రుగుతున్న ద‌ర్యాప్తులో భాగంగా ఈరోజు శివ‌శంక‌ర్‌రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట హాజ‌ర‌య్యారు.



వారి ర‌క్తంలోనే ఫ్యాక్ష‌న్ ఉంది..!!

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>