PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp269cf195-035a-4b55-9bff-1d217bdc816a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp269cf195-035a-4b55-9bff-1d217bdc816a-415x250-IndiaHerald.jpgఅయితే విచిత్రంగా అధికార వైసీపీలో ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది. ఈ ఇద్ద‌రు నేత‌లలో ఒక‌రు ఎంపీగా.. మ‌రొక‌రు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వీరి మ‌ధ్య ఈ కోల్డ్ వార్ ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లోనూ ... అటు విశాఖ జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు ఎవ‌రో కాదు అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, పాడేరు ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి. వీరిద్ద‌రు కూడా ఉన్న‌త విద్యావంతులే..! వీరిద్ద‌రి తండ్రులూ కూడా గ‌తంలో ఎమ్మెల్యే లుగా ప‌నిచేశారు. అయితే వీరి మ‌ధ్య ఎక్క‌డో ఇగోలు క్లాషెస్ అయ్యాysrcp{#}Paderu;Vishakapatnam;MP;war;Party;MLAవైసీపీలో మ‌హిళా ఎంపీ VS మ‌హిళా ఎమ్మెల్యే.. ఎడ‌మొఖం.. పెడ‌మొఖం ?వైసీపీలో మ‌హిళా ఎంపీ VS మ‌హిళా ఎమ్మెల్యే.. ఎడ‌మొఖం.. పెడ‌మొఖం ?ysrcp{#}Paderu;Vishakapatnam;MP;war;Party;MLAFri, 13 Aug 2021 18:22:00 GMTరాజ‌కీయాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య యుద్ధాలు కామ‌న్‌. అయితే చాలా సార్లు మ‌నం అధికార పార్టీలోనే కొంద‌రు నేత‌ల మ‌ధ్య పెద్ద ప్ర‌చ్ఛ‌న్న యుద్ధాలు జ‌ర‌గ‌డం చూస్తూనే ఉంటుంటాం ?  ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొంద‌రు నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాల నేప‌థ్యంలో గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉంటాయి. అయితే ఏపీలో అధికార వైసీపీకి చెందిన నేత‌ల మ‌ధ్య కూడా ఇప్పుడు అంత‌ర్గ‌త యుద్ధాలు ఓ రేంజ్ లో న‌డుస్తున్నాయి. తొలి  యేడాది వ‌ర‌కు పార్టీల నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్నా త‌ర్వాత మాత్రం నేత‌ల మ‌ధ్య యుద్ధాలు ఓ రేంజ్లో న‌డుస్తున్నాయి.

అయితే విచిత్రంగా అధికార వైసీపీలో ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది. ఈ  ఇద్ద‌రు నేత‌లలో ఒక‌రు ఎంపీగా.. మ‌రొక‌రు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వీరి మ‌ధ్య ఈ కోల్డ్ వార్ ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లోనూ ... అటు విశాఖ జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు ఎవ‌రో కాదు అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి, పాడేరు ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి. వీరిద్ద‌రు కూడా ఉన్న‌త విద్యావంతులే..! వీరిద్ద‌రి తండ్రులూ కూడా గ‌తంలో ఎమ్మెల్యే లుగా ప‌నిచేశారు.

అయితే వీరి మ‌ధ్య ఎక్క‌డో ఇగోలు క్లాషెస్ అయ్యాయంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వీరిద్ద‌రిని మెచ్చి మ‌రీ టిక్కెట్లు ఇచ్చారు. ఇద్ద‌రూ కూడా గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీల‌తో ఘ‌న విజ‌యాలు సాధించారు. ఇద్ద‌రూ కూడా త‌మ ప్రాంత స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టిగానే పోరాటాలు చేస్తున్నారు. మాధ‌వి ఎంపీగా ఢిల్లీలో స‌త్తా చాటుతుంటే... ఇటు భాగ్య‌ల‌క్ష్మి అసెంబ్లీలో గిరిజ‌నుల స‌మ‌స్య‌లు బాగా ప్ర‌స్తావిస్తున్నారు. అయితే ఇద్ద‌రూ కూడా ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో కేడ‌ర్ లో గుబులు రేగింది.

ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్‌లో క‌న‌ప‌డేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రో వైపు వీరి ఎడ‌మొఖం.. పెడ‌మొఖం విష‌యంలో ఎంపీ విజ‌య‌సాయి దృష్టికి సైతం వెళ్లింద‌ట‌. అయితే ఆయ‌న కూడా రెండు మూడు సార్లు పంచాయితీలు చేసినా కూడా వీరి తీరులో మార్పు రావ‌డం లేదంటున్నారు.



విశాఖ పోలీసులు ఎక్కడా తగ్గడం లేదుగా...?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>