PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-role-in-eo-dispute9fc9e382-d6f8-454c-90f8-ecee81ed23eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-role-in-eo-dispute9fc9e382-d6f8-454c-90f8-ecee81ed23eb-415x250-IndiaHerald.jpgచిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవో సుబ్బారెడ్డి వివాదాస్పద వ్యవహారం మరింత ముదిరింది. హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన అధికారే.. ఆలయ ప్రాంగణంలో ఆచారాలకు విరుద్ధంగా అపచారానికి పాల్పడ్డారన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయ ఈవో సుబ్బారెడ్డి... ఆలయ ప్రాంగణంలో మేకపోతును బలి ఇచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం నడుస్తున్నా.. ఉన్నతాధికారులు గానీ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి గానీ స్పందించక పోవడం అనేకminister role in eo dispute{#}srinivas;District;Tirupati;News;Turmeric;Coronavirus;Janasena;Ministerఅపచారం చేసిన ఈవోకు మంత్రి ఉపకారం!?అపచారం చేసిన ఈవోకు మంత్రి ఉపకారం!?minister role in eo dispute{#}srinivas;District;Tirupati;News;Turmeric;Coronavirus;Janasena;MinisterFri, 13 Aug 2021 08:31:00 GMTచిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఈవో సుబ్బారెడ్డి వివాదాస్పద వ్యవహారం మరింత ముదిరింది. హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన అధికారే.. ఆలయ ప్రాంగణంలో ఆచారాలకు విరుద్ధంగా అపచారానికి పాల్పడ్డారన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయ ఈవో సుబ్బారెడ్డి... ఆలయ ప్రాంగణంలో మేకపోతును బలి ఇచ్చారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం నడుస్తున్నా.. ఉన్నతాధికారులు గానీ, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి గానీ స్పందించక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 

ఇటీవల కరోనా బారిన పడిన ఈవో సుబ్బారెడ్డి.. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ తర్వాత ద్వారకా తిరుమల ఆలయ ప్రాంగణంలోనే మేకపోతును బలిచ్చే కార్యక్రమాలను ఆలయం ఆవరణలోనే చేపట్టారు. దీనిపై విచారణ చేసేందుకు ఏఈవో రామాచార్యులుని నియమించారు.. అక్కడ జంతు బలి కార్యక్రమం జరిగినట్లు ఆయన విచారణలో కూడా వెల్లడైందని అక్కడి సిబ్బందే చెబుతున్నారు. అయితే ఆ నివేదిక ఇచ్చిన దగ్గర నుంచి రామాచార్యులుపై ఈవో కక్ష పెంచుకున్నారనీ, ఆయన్ను మానసికంగా వేధించడమే కాక, అందరి ముందూ అవమానించారనీ ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే రామాచార్యులు మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడనీ, ఆయన మృతికి ఈవో సుబ్బారెడ్డి వేధింపులే కారణమని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇంత తంతు జరిగినా... ఎవరూ దీనిపై స్పందించకపోవడంపై ప్రభుత్వ పెద్దలు ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈవో సుబ్బారెడ్డిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఉన్నతాధికారులు కాపాడుతున్నారని విపక్షాల నేతలు అంటున్నారు. తాజాగా జనసేన నాయకులు పోతిన మహేష్ ఈ వ్యవహారంపై గళం విప్పడంతో ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈవో సుబ్బారెడ్డి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని, ఆలయ పరిసరాల్లో జంతుబలి కార్యక్రమం చేపట్టినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. మేకకు పసుపు రాసి, చెవులు కోశారని, అక్కడ చూసిన వారే చెబుతున్నారని, అయినా ఈవో కాపాడేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. నీతులు చెప్పే అవినీతి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దీనిపై మాట్లాడాలని లేకపోతే ఈవో సుబ్బారెడ్డి దగ్గర ముడుపులు పుచ్చుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.



బోల్ ఇండియా - విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్యా 0 %

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>