PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aiports-in-telangana9b7d5e18-2509-4249-b3ed-9e5e0d6bd5ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aiports-in-telangana9b7d5e18-2509-4249-b3ed-9e5e0d6bd5ae-415x250-IndiaHerald.jpg ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్టు ఒక్క‌టి మాత్రమే రాష్ట్ర అవ‌స‌రాల‌ను తీరుస్తోంది. దీంతో కొత్తగా ఆరు ఏయిర్ పోర్టులు నిర్మించేందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరో వారం పదిరోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవ‌కాశం ఉంది. ఆయా ప్రాజెక్టులకు కన్సల్టెంటుగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చి విమానాశ్రయాల ప్రాథమిక స్వరూపాన్ని వివరిస్తుంది. గత జూన్‌లోనే వీటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసaiports in telangana{#}Telangana;Rajiv Gandhi;Telangana Chief Minister;Peddapalli;Delhiతెలంగాణ‌కు కొత్త‌గా 6 ఏయిర్ పోర్టులు.. ఎక్క‌డెక్క‌డో తెలుసా?తెలంగాణ‌కు కొత్త‌గా 6 ఏయిర్ పోర్టులు.. ఎక్క‌డెక్క‌డో తెలుసా?aiports in telangana{#}Telangana;Rajiv Gandhi;Telangana Chief Minister;Peddapalli;DelhiFri, 13 Aug 2021 08:09:44 GMT  ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్టు ఒక్క‌టి మాత్రమే రాష్ట్ర అవ‌స‌రాల‌ను తీరుస్తోంది. దీంతో కొత్తగా ఆరు ఏయిర్ పోర్టులు నిర్మించేందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరో వారం పదిరోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవ‌కాశం ఉంది. ఆయా ప్రాజెక్టులకు కన్సల్టెంటుగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చి విమానాశ్రయాల ప్రాథమిక స్వరూపాన్ని వివరిస్తుంది. గత జూన్‌లోనే వీటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల (టెక్నో ఎకనమిక్‌ ఫీజబిలిటీ) నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఎయిర్‌పోర్స్ట్ అథారిటీ. 


ఆరు విమానాశ్రయాలకు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యల వివ‌రాల‌ను సూచించ‌నుంది. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఎయిర్ పోర్టుల‌ను రాష్ట్రం నలుదిక్కులా కొత్తగా ఏర్పాటు చేయాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ మేరకు నివేదిక కోరుతూ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ వాణిజ్య విభాగానికి కన్సల్టెన్సీ బాధ్యతను అప్పగించింది. అథారిటీ ప్రతినిధులు పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు నిర్వ‌హించారు.

    వరంగల్‌ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించే అవ‌కాశం ఉంద‌న్నారు. వీటితో పాటు నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులను ప్రతిపాదించింది సంస్థ‌. వీటన్నిటిలో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యమేనని తేల్చింది. దీనికి సంబంధించిన ప్రాథ‌మిక నివేధిక‌తో పాటు ఆ తర్వాత వాటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలు, కావాల్సిన భూమి వివరాలు, ఆయా ఎయిర్ పోర్టులను నిర్మించాలంటే తీసుకోవాల్సిన చర్యలతో కూడిన నివేదిక‌ను అందజేశారు.


     డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ విమానాశ్రయాలకు సంబంధించి ఫేజ్‌–1, ఫేజ్‌–2 పేరుతో రెండు వేరువేరు అంచనాలను అందించారు. ఫేజ్‌–1 ప్రకారం రూ.1,350 కోట్లు, ఫేజ్‌–2 ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయం కానుంద‌ని అంచ‌నా వేశారు. ఇక భూసేకరణకు ఇంతకు మించి ఖర్చు కానుందని తెలుస్తోంది. ఆరు విమానాశ్రయాలను నిర్మిస్తామని, వెంటనే అనుమతి మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా విమానయాన శాఖను కోరిన విష‌యం తెలిసిందే.


 మరోవైపు ఇప్పటికే మనుగడలో ఉన్న విమానాశ్రయానికి 150 కి.మీ. పరిధిలో రెండోది ఉండొద్దనే ఒక నిబంధనను జీఎంఆర్‌ సంస్థ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం క‌నిపిస్తోంది. ఆ నిబంధన ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, వరంగల్‌ ఎయిర్‌పోర్టులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ రెంటినీ జీఎంఆర్‌కు అప్పగించే అంశాన్ని చర్చించే అవకాశం ఉంది.  ఈ ఆరు విమానాశ్ర‌యాలు పూర్త‌యితే తెలంగాన మ‌రింత‌గా అభివృద్ది చెందే అవ‌కాశముంది.



వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>